అన్వేషించండి

City Facelift EMI Calculator: కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ ఈఎంఐ లెక్కలు: టాప్ వేరియంట్ లోన్ టెన్యూర్, ఈఎంఐ వివ‌రాలు

హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ టాప్ ఎండ్ హైబ్రిడ్ వేరియంట్ ను లోన్ పై సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం నెలవారీ ఈఎంఐ కాలిక్యులేషన్ వివరాలు ఈరోజు తెలుసుకుందాం.

City Facelift Loan EMI Calculator: ఇండియ‌న్ ఆటోమొబైల్ మార్కెట్ లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ఎట్టకేలకు లాంచ్ అయింది. ఈ మోడల్ ప్రారంభ ధరను రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. మార్కెట్ లో సెడాన్ కార్ల సేల్స్ తగ్గుతున్నప్పటికీ హోండా సిటీ తన ప్రీమియం లుక్, అప్‌మార్కెట్ ఫీచర్లతో ఎప్పటికప్పుడు మంచి డిమాండ్ సాధిస్తోంది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ ద్వారా అమ్మకాలను మరింత పెంచుకోవాలని హోండా ప్లాన్ చేస్తోంది. ఈ సరికొత్త సెడాన్ కారును ఫైనాన్స్ లేదా లోన్ ద్వారా కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం ఈఎంఐ (EMI) అంచనాల వివరాలు అందుబాటులోకి వచ్చాయి.

Read Also: Best CNG Cars: ధరలు పెరగకముందే ఈ CNG కార్లు కొనేయండి.. పెట్రోల్ ఖర్చుల నుంచి బిగ్ రిలీఫ్

వేరియంట్ల వారీగా ధరల జాబితా.. 

డిజైన్, ఫీచర్ల పరంగా చాలా అప్‌డేట్స్ వచ్చినప్పటికీ ఈ సెడాన్ కారులో నమ్మకమైన పాత 1.5-లీటర్ పెట్రోల్, పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లనే కొనసాగించారు. దీని బేస్ మోడల్ ఎస్‌వీ మాన్యువల్ ధర రూ. 11,99,900 గా ఉండగా, మిడ్ వేరియంట్లు వి మాన్యువల్ రూ. 13,29,900, వి సీవీటీ రూ. 14,29,900 ధరల్లో లభిస్తున్నాయి. హై ఎండ్ మోడళ్లయిన జెడ్ఎక్స్ మాన్యువల్ రూ. 15,25,900, జెడ్ఎక్స్ ప్లస్ మాన్యువల్ రూ. 16,14,900, జెడ్ఎక్స్ సీవీటీ రూ. 16,25,900 గా ఉన్నాయి. అలాగే జెడ్ఎక్స్ ప్లస్ సీవీటీ రూ. 17,14,900 కాగా, టాప్ వేరియంట్ జెడ్ఎక్స్ ప్లస్ ఈ:హెచ్‌ఈవీ హైబ్రిడ్ మోడల్ ధర రూ. 20,99,900 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

Read Also: India's First E100 Flex Fuel Car: ఇండియాలో మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్: వ‌చ్చేనెల‌లో ఈ100 వెహికల్‌ను తీసుకురానున్న మారుతి సుజుకి

 టాప్ ఎండ్ హైబ్రిడ్ ఈఎంఐ లెక్కలు.. 

ఈ కారు టాప్ వేరియంట్ 'జెడ్ఎక్స్ ప్లస్ ఈ:హెచ్‌ఈవీ (స్ట్రాంగ్ హైబ్రిడ్) సీవీటీ' ధర రూ. 20.99 లక్షలుగా ఉంది. దీనికి 100 శాతం ఎక్స్-షోరూమ్ ధరను లోన్ అమౌంట్‌గా తీసుకుని, 9.5 శాతం వడ్డీ రేటుతో లెక్కిస్తే కాలపరిమితిని బట్టి ఈఎంఐ మారుతుంది. ఒకవేళ కస్టమర్ 36 నెలల (3 ఇయర్స్) రీపేమెంట్ టెన్యూర్ ఆప్షన్ ఎంచుకుంటే నెలవారీ ఈఎంఐ రూ. 67,266 గా ఉంటుంది. ఈ మూడు సంవత్సరాల కాలానికి బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తం వడ్డీ విలువ రూ. 3,21,676 గా మారుతుంది. తక్కువ కాలంలో లోన్ క్లియర్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

నాలుగు, ఐదేళ్ల లోన్ టెన్యూర్ వివరాలు

ఒకవేళ నెలవారీ భారం తగ్గించుకోవడానికి కస్టమర్ 48 నెలల (4 ఇయర్స్) రీపేమెంట్ కాలపరిమితిని ఎంచుకుంటే ప్రతి నెల కట్టాల్సిన ఈఎంఐ అమౌంట్ రూ. 52,756 కు తగ్గుతుంది. ఈ టెన్యూర్ కు మొత్తం వడ్డీ రూ. 4,32,392 అవుతుంది. అలాగే లోన్ టెన్యూర్‌ను గరిష్టంగా 60 నెలలకు (5 ఇయర్స్) పెంచుకుంటే నెలవారీ ఈఎంఐ మరింత తగ్గి రూ. 44,102 అవుతుంది. అయితే దీనివల్ల బ్యాంక్‌కు కట్టాల్సిన మొత్తం వడ్డీ భారం పెరిగి రూ. 5,46,209 కు చేరుకుంటుంది. ఈ ఫైనల్ ఈఎంఐ అనేది కస్టమర్ షోరూమ్ లో చెల్లించే డౌన్ పేమెంట్, తీసుకునే లోన్ మొత్తం, బ్యాంక్ ఇచ్చే వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుందని గమనించాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Court Denies Sushil Bail: ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Embed widget