అన్వేషించండి

Best CNG Cars: ధరలు పెరగకముందే ఈ CNG కార్లు కొనేయండి.. పెట్రోల్ ఖర్చుల నుంచి బిగ్ రిలీఫ్

Fuel Saving Cars | మీరు కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఈ 5 సిఎన్‌జి (CNG) కార్లు బెస్ట్ ఆప్షన్లుగా మారనున్నాయి.

Best CNG Cars | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత్ సహా పలు దేశాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో గత రెండు నెలల్లోనే 100 శాతానికి పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. వాటితో పోల్చితే భారత్‌లో ఇంధన ధరలు చాలా తక్కువగానే పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు కేవలం వాహనాలకు మాత్రమే కాదు.. వీటిపై ఆధారపడిన, ఉపయోగించే అన్ని రంగాలపై ప్రభావం చూపుతాయి. ఇది సామాన్యుడి  జేబుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

ఒకవేళ మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అధిక ఇంధన ధరల నుంచి తప్పించుకోవాలనుకుంటే, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ (CNG) కార్లు మీకు బెస్ట్ ఛాయిస్. మీ కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత పొదుపైన, ప్రత్యామ్నాయంగా ఈ కార్లు నిలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సీఎన్‌జీ కార్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారు. మీ బడ్జెట్ తక్కువగా ఉండి, సాధారణ ఖర్చుతో ఒక మంచి సిఎన్‌జి కార్ కొనాలనుకుంటే, మార్కెట్లో ఈ రేంజ్‌లో అనేక అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆ బడ్జెట్ ఫ్రెండ్లీ సిఎన్‌జి కార్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

మారుతి సుజుకి వ్యాగన్ఆర్
భారత్‌లో చిన్న కుటుంబాలకు ఎంతో ప్రజాదరణ పొందిన మారుతి వ్యాగన్ఆర్ సీఎన్‌జీ అద్భుతమైన మైలేజీకి పేరుగాంచింది. ఇది దాదాపు ఒక కిలో సిఎన్‌జికి 34 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 6 లక్షలు ఉంటుంది. వాహనాల ధరలు ఆయా రాష్ట్రాల్లో ఒక్కోలా ఉంటాయని తెలిసిందే.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో
మీ బడ్జెట్ 5 లక్షల లోపు ఉన్నట్లయితే, ఇది మీకు ఫస్ట్ ఛాయిస్ కావచ్చు. రూ.4.62 లక్షల ప్రారంభ ధరతో లభించే మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో కారు ఒక కేజీ CNG తో 32.73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

Also Read: India's First E100 Flex Fuel Car: ఇండియాలో మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్: వ‌చ్చేనెల‌లో ఈ100 వెహికల్‌ను తీసుకురానున్న మారుతి సుజుకి

మారుతి సుజుకి స్విఫ్ట్ 
యువతకు ఎంతో ఇష్టమైన ఈ హ్యాచ్‌బ్యాక్‌లో మారుతి సుజుకీ స్విఫ్ట్ కొత్త జెడ్-సిరీస్ ఇంజన్‌ను అందించారు. ఇది ఎస్-CNG టెక్నాలజీతో పనిచేస్తుంది. ఒక కిలోగ్రాముకి 32.85 కిలోమీటర్ల మైలేజీతో దూసుకెళ్తుందని కంపెనీ తెలిపింది. ఈ కారు ప్రారంభ ధర సుమారు 7.45 లక్షల రూపాయలుగా ఉంది.

టాటా పంచ్ సిఎన్‌జి
టాటా సంస్థ భారతీయులు నమ్మే బ్రాండ్లలో ఒకటి. టాటా పంజ్ CNG భారత్‌లో అత్యంత సురక్షితమైన (5 స్టార్ రేటింగ్ కలిగిన)  మైక్రో SUV. టాటా పంచ్ సిఎన్‌జి డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో అందుబాటులో ఉంది. దీనివల్ల కారు బూట్ స్పేస్ (లగేజీ పెట్టుకునే స్థలం) అస్సలు తగ్గదు. పంచ్ సీఎన్జీ ప్రారంభ ధర దాదాపు రూ. 6.75 లక్షలు, కాగా ఈ కారు కిలోగ్రాముకి సుమారు 27 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

Read Also: AC ఆన్‌లో ఉన్నా Petrol ఖర్చులు తగ్గించుకోవచ్చు.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి

హ్యుందాయ్ ఎక్స్టర్ 
మైక్రో SUV హ్యుందాయ్ ఎక్స్‌టర్ తన స్టైలిష్ లుక్, ప్రీమియం ఫీచర్లతో ఫేమస్ అయింది. ఈ CNG కార్ కిలోగ్రాముకి 27 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 5.80 లక్షల వరకు ఉంటుంది.

సీఎన్జీ కార్ల ఉపయోగాలు (CNG Car Uses)
పెట్రోల్‌, డీజిల్ ఇంధనాలతో పోలిస్తే సిఎన్‌జి చాలా చౌక. దాంతోపాటు ఇది పర్యావరణానికి అనుకూలం కావడంతో ఇంజన్ లైఫ్‌ను కూడా పెంచుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
కొత్త SUVల దెబ్బకు పడిపోతుందన్నారు.. కానీ ఈ కారు జోరు తగ్గలేదు, ఇప్పటికీ టాప్‌ ప్లేస్‌!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో
Maruti Wagon R CNG నిజంగా ఎంత మైలేజ్ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో వచ్చిన ఫలితం ఇదే!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Hero Xpulse 210 రియల్‌ రివ్యూ - 5,600km తిరిగిన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget