అన్వేషించండి

Car Brake Failure: వేసవిలో బ్రేకులు ఫెయిలయ్యే ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి

Brake Failure in Summer: వేసవిలో, అధిక ఉష్ణోగ్రతలు వాహనాల బ్రేక్ వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. సరైన నిర్వహణ మరియు కొన్ని సాధారణ జాగ్రత్తల ద్వారా, బ్రేక్ వైఫల్యాన్ని నివారించవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేసవిలో వేడెక్కే రోడ్లు, తరచుగా బ్రేకులు బ్రేక్ సిస్టమ్‌ను బలహీనపరుస్తాయి.
  • బ్రేక్ ఫ్లూయిడ్‌ను ఎప్పటికప్పుడు మార్చడం, అధిక వేగాన్ని తగ్గించడం ముఖ్యం.
  • బ్రేకుల నుండి శబ్దాలు, వైబ్రేషన్లు ప్రమాద సంకేతాలు, తక్షణ తనిఖీ అవసరం.
  • కొండ ప్రాంతాలలో ఇంజన్ బ్రేకింగ్‌ను వాడటం, టైర్‌లలో సరైన గాలి ఒత్తిడి.

Summer Car Care | వేసవి కాలం కేవలం మనుషులకే కాదు, వాహనాలు, వస్తువులకు కూడా నష్టాన్ని కలిగిస్తుంది. తీవ్రమైన ఎండ, నిరంతరం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మీ బైక్, కార్లపై ప్రభావం చూపుతాయి. అందుకే సమ్మర్ సీజన్‌లో బ్రేక్ ఫెయిల్యూర్ కేసులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చాలా మంది తమ కుటుంబంతో, లేక నచ్చిన వ్యక్తులతో లాంగ్ జర్నీకి బయలుదేరే ముందు కేవలం ఇంజన్,  టైర్లను మాత్రమే చెక్ చేస్తారు. కానీ బ్రేక్ సిస్టమ్‌పై ఫోకస్ చేయకపోవడంతో ఇబ్బంది పడతారు. 

బ్రేక్ సిస్టమ్స్ చెక్ చేయకపోవడం ప్రయాణం సమయంలో పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. ముఖ్యంగా హైవేలు లేదా కొండ ప్రాంతాల రోడ్లపై బ్రేకులు అకస్మాత్తుగా పడకపోతే మీ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. అందువల్ల, వేసవిలో డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన సమయంలో సర్వీసింగ్, కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే మీ జర్నీ మరింత సురక్షితంగా, ఒత్తిడి లేకుండా మార్చగలవు.

వేసవిలో బ్రేక్ సిస్టమ్ ఎందుకు వీక్ అవుతుంది
వేసవిలో రోడ్డు ఉష్ణోగ్రత సైతం ఎక్కువగా ఉంటుంది. నిరంతరం డ్రైవింగ్, పదేపదే బ్రేకులు వేయడం వల్ల బ్రేక్ ప్యాడ్‌లు, డిస్క్‌లు వేగంగా వేడెక్కుతాయి. ఎక్కువ వేడి ఉత్పత్తి అయినప్పుడు బ్రేక్ ఫ్లూయిడ్ (ఆయిల్) ప్రభావం తగ్గిపోవచ్చు, దీనివల్ల కొన్నిసార్లు బ్రేకులు సరిగ్గా పనిచేయవు. చాలా సార్లు ప్రజలు బ్రేక్ ఆయిల్‌ను చాలా కాలం పాటు మార్చరు. ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది. వాహనంలో ఓవర్‌లోడ్‌తో డ్రైవింగ్ చేయడం వల్ల కూడా బ్రేక్ సిస్టమ్‌పై అడిషనల్ ప్రెజర్ పడుతుంది.

Also Read: India's First E100 Flex Fuel Car: ఇండియాలో మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్: వ‌చ్చేనెల‌లో ఈ100 వెహికల్‌ను తీసుకురానున్న మారుతి సుజుకి

కార్ లేదా బైక్ బ్రేక్‌ల నుండి శబ్దం వస్తున్నా, వైబ్రేషన్ అనిపించినా లేదా బ్రేక్ వేసినప్పుడు వాహనం ఆలస్యంగా ఆగినా, అలాంటప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సంకేతాలన్నీ బ్రేక్ సిస్టమ్‌ను వెంటనే తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. టైమ్‌కు స్పందించి శ్రద్ధ పెట్టడం ద్వారా పెద్ద ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు.

ప్రయాణంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి
వేసవి కాలంలో సుదూర ప్రయాణాలకు బయలుదేరే ముందు వాహనం పూర్తి బ్రేక్ సిస్టమ్‌ను తప్పకుండా చెక్ చేయించండి. బ్రేక్ ఫ్లూయిడ్ లెవెల్ సరిగ్గా ఉండాలి. అవసరమైతే దానిని మార్పించాలి. ఎక్కువ స్పీడ్‌తో డ్రైవింగ్ చేయడం, అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వంటివి తగ్గించాలి. దీనివల్ల బ్రేకులు త్వరగా వేడెక్కుతాయి. కొండ ప్రాంతాలలో డ్రైవింగ్ చేసేటప్పుడు పదేపదే బ్రేక్‌లను నొక్కే బదులు ఇంజన్ బ్రేకింగ్‌ను ఉపయోగించడం మంచిదని భావించాలి. 

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బ్రేక్‌ల నుండి ఏదైనా కాలిన వాసన వస్తే, వెంటనే కారు ఆపి, బ్రేక్ సిస్టమ్ కాసేపు చల్లగా అయ్యేలా చూడండి. అలాగే, టైర్ గాలి ప్రెజర్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే దీని ప్రభావం కూడా బ్రేకింగ్‌పై పడుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో సురక్షితమైన, సౌకర్యవంతంగా జర్నీ ఆస్వాదించవచ్చు.

Read Also: AC ఆన్‌లో ఉన్నా Petrol ఖర్చులు తగ్గించుకోవచ్చు.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి

Frequently Asked Questions

వేసవిలో బ్రేక్ ఫెయిల్యూర్ కేసులు ఎందుకు ఎక్కువగా ఉంటాయి?

వేసవిలో అధిక రోడ్డు ఉష్ణోగ్రతలు, నిరంతర డ్రైవింగ్ వల్ల బ్రేక్ ప్యాడ్స్, డిస్కులు వేడెక్కుతాయి. దీనివల్ల బ్రేక్ ఫ్లూయిడ్ ప్రభావం తగ్గి, బ్రేకులు సరిగా పనిచేయవు.

బ్రేక్ సిస్టమ్ చెక్ చేయకపోతే కలిగే ప్రమాదాలు ఏమిటి?

బ్రేక్ సిస్టమ్ చెక్ చేయకపోతే, ముఖ్యంగా హైవేలు లేదా కొండ ప్రాంతాలలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. బ్రేకులు అకస్మాత్తుగా పనిచేయకపోతే పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది.

వేసవిలో సురక్షితమైన ప్రయాణం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్రయాణానికి ముందు బ్రేక్ సిస్టమ్ మొత్తాన్ని చెక్ చేయించుకోవాలి, బ్రేక్ ఫ్లూయిడ్ లెవెల్ సరిచూసుకోవాలి. ఎక్కువ స్పీడ్, అకస్మాత్తుగా బ్రేకులు వేయడం తగ్గించాలి.

బ్రేక్ ఫ్లూయిడ్ ఎప్పుడు మార్చాలి?

చాలామంది బ్రేక్ ఆయిల్ ను చాలా కాలం పాటు మార్చరు. ఇది సమస్యను పెంచుతుంది. కాబట్టి, అవసరమైతే బ్రేక్ ఫ్లూయిడ్ ను మార్పించాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget