అన్వేషించండి

అథర్‌ స్కూటర్లలో 'పోత్‌హోల్‌ ప్లస్‌ అలర్ట్స్‌' ప్రారంభం.. రోడ్డుపై గుంతలు, స్పీడ్‌ బ్రేకర్ల గురించి ముందే హెచ్చరికలు

అథర్‌ ఎనర్జీ Gen 2 & ఆ తర్వాతి ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు పోత్‌హోల్‌ ప్లస్‌ అలర్ట్స్‌ ఫీచర్‌ను విడుదల చేసింది. గుంతలు, పాడైన రోడ్లు, స్పీడ్‌ బ్రేకర్లపై ముందుగానే విజువల్‌ & ఆడియో హెచ్చరికలు అందిస్తుంది.

Pothole+ Alerts For Ather Scooters: దేశీయ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అథర్‌ ఎనర్జీ, తన యూజర్ల కోసం మరో వినూత్న ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోడ్లపై ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చే లక్ష్యంతో రూపొందించిన 'పోత్‌హోల్‌ ప్లస్‌ అలర్ట్స్‌' ఫీచర్‌ను Gen 2 & ఆ తర్వాతి తరం అథర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు విడుదల చేయడం ప్రారంభించింది. ఈ ఫీచర్‌ ద్వారా... ప్రయాణికులకు రోడ్డుపై గుంతలు, పాడైన రహదారులు, ఎత్తుపల్లాలు & స్పీడ్‌ బ్రేకర్ల గురించి ముందుగానే హెచ్చరికలు అందుతాయి.

ప్రస్తుతం ఈ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అథర్‌ 450 అపెక్స్‌, 450ఎక్స్‌ & రిజ్టా జెడ్‌ మోడళ్లకు అందుబాటులోకి వస్తోంది. ఇది పూర్తిగా సాఫ్ట్‌వేర్‌ ఆధారిత ఫీచర్‌ కావడంతో కొత్త హార్డ్‌వేర్‌ను అమర్చాల్సిన అవసరం లేదు. అప్‌డేట్‌ పూర్తయ్యాక స్కూటర్‌లో ఈ సదుపాయం ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది.

రాత్రి వేళల్లో & వర్షాకాలంలో చాలా ఉపయోగం
నావిగేషన్‌ను ఉపయోగిస్తున్న సమయంలో ముందున్న రహదారిపై గుంతలు, పాడైన రోడ్డు భాగాలు, ఎత్తుపల్లాలు లేదా స్పీడ్‌ బ్రేకర్లు ఉన్నట్లు గుర్తిస్తే స్కూటర్‌ డ్యాష్‌బోర్డుపై విజువల్‌ అలర్ట్‌ కనిపిస్తుంది. దీంతో రైడర్‌కు ముందుగానే అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. రాత్రి వేళల్లో, పొగమంచు సమయంలో & వర్షాకాలంలో రోడ్లపై కనిపించని గుంతలను గుర్తించడంలో ఈ ఫీచర్‌ మరింత ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: కొత్త Toyota Hiluxలో వచ్చిన మార్పులేంటి? పాత మోడల్‌తో పోలిస్తే కీలక తేడాలు ఇవే

విజువల్‌ అలర్ట్స్‌తో పాటు ఆడియో హెచ్చరికలు కూడా అందుబాటులో ఉంటాయి. స్కూటర్‌లోని స్పీకర్ల ద్వారా లేదా అథర్‌ హాలో స్మార్ట్‌ హెల్మెట్‌ ద్వారా లేదా Bluetooth హెడ్‌సెట్‌కు ఈ అలర్ట్స్‌ వినిపిస్తాయి. దీంతో రైడర్‌ డ్యాష్‌బోర్డ్‌ను పదేపదే చూడాల్సిన అవసరం లేకుండా పూర్తిగా రోడ్డుపైనే దృష్టి సారిస్తూ సురక్షితంగా ప్రయాణించవచ్చు.

కనెక్టెడ్‌ స్కూటర్ల నుంచి డేటా సేకరణ
ఈ ఫీచర్‌కు బలం అథర్‌ రూపొందించిన కనెక్టెడ్‌ రోడ్‌ ఇంటెలిజెన్స్‌ సిస్టమ్‌. కంపెనీ కనెక్టెడ్‌ స్కూటర్ల నుంచి వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వెల్లడించకుండా సేకరించిన డేటాను విశ్లేషించి.. తరచుగా గుంతలు ఉండే ప్రాంతాలు, పాడైన రహదారులు & స్పీడ్‌ బ్రేకర్ల సమాచారాన్ని గుర్తిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా తర్వాత అదే మార్గంలో ప్రయాణించే ఇతర అథర్‌ వినియోగదారులకు ముందుగానే హెచ్చరికలు పంపిస్తుంది. దీంతో రోడ్డు పరిస్థితులపై మరింత ఖచ్చితమైన సమాచారం అందించగలుగుతోంది.

ఇది కూడా చదవండి: మీది E20 పెట్రోల్‌కు అనుకూలమైన వాహనమేనా? ప్రభుత్వం ఏం చెప్పింది? ఏ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి?

అథర్‌ ఈ పోత్‌హోల్‌ ప్లస్‌ అలర్ట్స్‌ ఫీచర్‌ను తొలిసారిగా 2025లో నిర్వహించిన కమ్యూనిటీ డే కార్యక్రమంలో ప్రదర్శించింది. అయితే దీనిని యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పట్టిందని కంపెనీ తెలిపింది. విశ్వసనీయమైన హెచ్చరికలు ఇవ్వాలంటే పెద్ద మొత్తంలో కనెక్టెడ్‌ స్కూటర్ల నుంచి డేటా సేకరించి విశ్లేషించాల్సి వచ్చిందని అథర్‌ ఎనర్జీ సీఈఓ తరుణ్‌ మెహతా వెల్లడించారు.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను దశలవారీగా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ రూపంలో విడుదల చేస్తున్నారు. Gen 2 & ఆ తర్వాతి తరం అథర్‌ స్కూటర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా 450 అపెక్స్‌, 450ఎక్స్‌ & రిజ్టా జెడ్‌ వినియోగదారులు ఈ కొత్త భద్రతా ఫీచర్‌ను ఉపయోగించుకోగలరు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ స్మార్ట్‌ టెక్నాలజీని వినియోగిస్తున్న అథర్‌ ఈ కొత్త ఫీచర్‌తో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రంగంలో మరో ముందడుగు వేసిందని చెప్పవచ్చు. ప్రయాణాన్ని మరింత సురక్షితంగా & సౌకర్యవంతంగా మార్చే ఈ అప్‌డేట్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget