అన్వేషించండి

E20 Petrol Effect on BS3 Vehicles: మీది E20 పెట్రోల్‌కు అనుకూలమైన వాహనమేనా? ప్రభుత్వం ఏం చెప్పింది? ఏ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి?

E20 Petrol Effect on BS3 Vehicles: పాత వాహనాలపై E20 పెట్రోల్ ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏయే BS-3 వాహనాల విడిభాగాలు మార్చవలసి రావచ్చునో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో వివరించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్ర ప్రభుత్వం E20 ఇంధనం వాడకంపై స్పష్టతనిచ్చింది.
  • పాత BS-III వాహనాల రబ్బరు భాగాలు మార్చాల్సి రావచ్చు.
  • పనితీరు, మైలేజీపై ప్రతికూల ప్రభావం ఉండదని మంత్రి చెప్పారు.
  • సరైన సర్వీసింగ్, E20-అనుకూల భాగాలతో సమస్య ఉండదు.

E20 Petrol Effect on BS3 Vehicles: ప్రస్తుతం భారత్‌లో అత్యంత చర్చనీయాంశంగా ఉన్న అంశం ఇథనాల్. ప్రభుత్వం ఇప్పుడు అన్ని పెట్రోల్ పంపులలో ఇథనాల్‌ను తప్పనిసరి చేసింది. ఈ ఇంధనంపై అనేక చోట్ల నిరసనలు జరుగుతున్నప్పటికీ, ఈలోగా, వాహన యజమానుల ఆందోళనల కారణంగా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఇథనాల్‌కు సంబంధించిన పరిస్థితిని పూర్తిగా స్పష్టం చేసింది. రాజ్యసభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, E20 ఇంధనాన్ని ఉపయోగించడానికి వాహనాల ఇంజిన్‌ను మార్చడం లేదా ఎలాంటి పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

అయితే, ఏప్రిల్ 1, 2005న అమల్లోకి వచ్చిన BS-III ప్రమాణాలతో, 2016కు ముందు తయారు చేసిన కొన్ని వాహనాలకు రబ్బరు భాగాలు, గాస్కెట్‌లను మార్చవలసి రావచ్చు. కాబట్టి, ఇథనాల్ ప్రభావానికి ఏ వాహన భాగాలు ఎక్కువగా గురవుతాయో, వేటిని మార్చవలసి ఉంటుందో పరిశీలిద్దాం.

ఈ వాహనాలు, విడిభాగాలపై ప్రభావం పడుతుందా?

E20 ఇంధనం ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి ఇండియన్ ఆయిల్, ఐఐపి డెహ్రాడూన్, సియామ్, ఏఆర్ఏఐ ఒక అధ్యయనాన్ని నిర్వహించాయని ప్రభుత్వం తెలియజేసింది. ఈ అధ్యయనంలో కొన్ని ప్రధాన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. అధ్యయన నివేదిక ప్రకారం, ఏప్రిల్ 1, 2005 తర్వాత తీసుకొచ్చిన, 2016కు ముందు తయారైన బీఎస్-III ప్రమాణాలకు అనుగుణమైన ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు సమస్యలను ఎదుర్కోవచ్చు. 

ఇంధన సరఫరా వ్యవస్థలోని రబ్బరు పైప్స్‌, రబ్బరు సీల్స్, గాస్కెట్లు, వాషర్లను కూడా మార్చవలసి రావచ్చు. ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం, ఇది తీవ్రమైన సాంకేతిక సమస్య కాదు, సాధారణ వాహన సర్వీసింగ్ సమయంలో దీనిని సులభంగా మార్చవచ్చు.

ఇది పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందా?

పార్లమెంటులో అడిగిన వివిధ టెక్నికల్ ప్రశ్నలకు సమాధానమిస్తూ, వాస్తవ పరిస్థితుల్లో నిర్వహించిన పరీక్షలు, క్షేత్రస్థాయి ప్రయోగాల్లో, పాత వాహనాల ఇంజన్లలో E20 వాడకం వల్ల అసాధారణమైన లేదా ఇంజన్ జామ్ అయ్యే సమస్యలు తలెత్తలేదని తేలిందని నితిన్ గడ్కరీ చెప్పారు. 

అంతేకాకుండా, వాహనాల డ్రైవింగ్ పనితీరు, కోల్డ్ స్టార్ట్‌లు, ఇతర మెటల్‌ పార్ట్స్‌ లేదా ప్లాస్టిక్ భాగాలపై E20 వల్ల ఎటువంటి ప్రతికూలమైన ప్రభావం కానీ, హానికరమైన ఎఫెక్ట్‌ లేదు. E20 ఇంధనాన్ని ఉపయోగించే వాహనాలపై ఆటోమొబైల్ తయారీదారులు తమ వారంటీ ప్రక్రియను కొనసాగిస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు.

మైలేజీ తగ్గుతుందనే ప్రచారంపై ప్రకటన 

E20 పెట్రోల్ కారణంగా మైలేజీ తగ్గుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. E20 వల్ల తమ వాహనాల మైలేజీ తగ్గిపోయిందని చాలా మంది అనుమానిస్తున్నారు. అయితే, వాహనం మైలేజీ కేవలం ఎలాంటి ఇంధనం వాడుతున్నామనే దానిపై ఆధారపడి ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహనం పరిస్థితి, సరైన డ్రైవింగ్ అలవాట్లు, ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్‌లను సకాలంలో మార్చడం, సరైన టైర్ ప్రెజర్, వీల్ అలైన్‌మెంట్, ఎయిర్ కండిషనర్ లోడ్ వంటి అనేక ఇతర ముఖ్యమైన అంశాలు కూడా మైలేజీని ప్రభావితం చేస్తాయి. 

వాహన యజమానులందరికీ ముఖ్యమైన సలహా

గమనించదగ్గ విషయం ఏమిటంటే, మీ కారు లేదా బైక్ 2016 తర్వాత (BS-IV లేదా BS-VI) తయారై ఉంటే, అది E20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీది 2016 కంటే ముందు తయారైన BS-3 మోడల్ అయితే, కంగారు పడకుండా, సర్వీసింగ్ సమయంలో అధికారిక వర్క్‌షాప్‌లో ఫ్యూయల్ పైపులు, రబ్బర్ గాస్కెట్‌లను చెక్‌ చేయించండి. అవసరమైతే వాటిని E20-కి అనుకూలమైన భాగాలతో మార్పించండి.

Frequently Asked Questions

E20 ఇంధనం వాడటానికి వాహన ఇంజిన్‌ను మార్చాలా?

లేదు, E20 ఇంధనం వాడటానికి వాహన ఇంజిన్‌ను మార్చాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. పెద్ద మార్పులు ఏవీ చేయనవసరం లేదు.

E20 ఇంధనం వల్ల ఏ వాహనాలు, వాటి భాగాలపై ప్రభావం పడుతుంది?

ఏప్రిల్ 1, 2005 తర్వాత తయారైన బీఎస్-III ప్రమాణాల వాహనాలపై ప్రభావం ఉండవచ్చు. ఇంధన సరఫరా వ్యవస్థలోని రబ్బరు పైప్స్, సీల్స్, గాస్కెట్లను మార్చవలసి రావచ్చు.

E20 ఇంధనం వాహన పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందా?

పరీక్షలు, క్షేత్రస్థాయి ప్రయోగాల్లో, పాత వాహనాల ఇంజన్లలో E20 వాడకం వల్ల అసాధారణ సమస్యలు తలెత్తలేదని తేలింది. డ్రైవింగ్ పనితీరుపై ప్రతికూల ప్రభావం ఉండదు.

E20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజీ తగ్గుతుందా?

వాహనం మైలేజీ ఇంధనంపై మాత్రమే ఆధారపడదు. వాహనం పరిస్థితి, డ్రైవింగ్ అలవాట్లు, నిర్వహణ వంటి అనేక అంశాలు మైలేజీని ప్రభావితం చేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
RE క్లాసిక్ 350కి ఆర్మీ టచ్.. కొత్త గోర్ఖా ఎడిషన్ కొనేముందు తెలుసుకోవాల్సిన 7 సంగతులు
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి అట్రాక్టివ్‌ లుక్.. గోర్ఖా ఎడిషన్‌లో ఉన్న 7 ప్రత్యేకతలు ఇవే
Advertisement

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget