అన్వేషించండి

మహీంద్రా BE 6కు షాకింగ్‌ అప్‌డేట్స్‌.. మూడు స్క్రీన్‌లు, కొత్త డ్యాష్‌బోర్డ్‌తో మరింత స్టైలిష్‌

Mahindra BE 6 ఎలక్ట్రిక్‌ SUVకు కీలక అప్‌డేట్లు రానున్నాయి. ధర కూడా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

Mahindra BE 6 Price, Range And Features Telugu: మహీంద్రా, తన ప్రీమియం ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ BE 6కు కీలకమైన ఇంటీరియర్‌ అప్‌డేట్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆధునిక డిజైన్‌, ఎక్కువ రేంజ్‌ & అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతున్న ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీకి ఇప్పుడు మరింత ప్రీమియం అనుభూతిని అందించే మార్పులు రానున్నాయి. వీటిలో ముఖ్యంగా మూడు స్క్రీన్‌ల సెటప్‌, కొత్త డ్యాష్‌బోర్డ్‌ డిజైన్‌, కొత్త అప్‌హోల్స్టరీ కలర్‌ కాంబినేషన్‌ ఉన్నాయి. ఈ మార్పులు మిడ్‌-లైఫ్‌ ఫేస్‌లిఫ్ట్‌లో కాకుండా మోడల్‌ ఇయర్‌ అప్‌డేట్‌లో భాగంగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాబోయే మార్పులు ఇవే!
ప్రస్తుతం Mahindra XEV 9e & XEV 9S మోడళ్లలో మూడు స్క్రీన్‌ల సెటప్‌ను కంపెనీ అందిస్తోంది. ఇదే సెటప్‌ను త్వరలో BE 6లో కూడా అందించే అవకాశం ఉంది. అయితే ఇది అన్ని వేరియంట్లలో ఉంటుందా లేదా టాప్‌ స్పెక్‌ వేరియంట్లకే పరిమితం చేస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం మూడు స్క్రీన్‌ల సెటప్‌ ప్రీమియం కార్లలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. టాటా మోటార్స్‌ కూడా కొన్ని మోడళ్లలో ఈ ఫీచర్‌ను అందిస్తోంది. దీంతో ఈ ఫీచర్‌ చేరితే BE 6 పోటీ విభాగంలో మరింత బలంగా నిలిచే అవకాశం ఉంది.

ఇంటీరియర్‌లో మరో ముఖ్యమైన మార్పు డ్యాష్‌బోర్డ్‌ డిజైన్‌కు సంబంధించినది. ప్రస్తుతం ఉన్న BE 6లో డ్రైవర్‌ చుట్టూ హాలో ఆకారంలో ఉండే ప్రత్యేక లూప్‌ డిజైన్‌ను కంపెనీ ఉపయోగిస్తోంది. అయితే దీనివల్ల రెండో కప్‌ హోల్డర్‌కు సరిపడా స్థలం లేకపోవడం, వైర్‌లెస్‌ ఛార్జర్‌ & USB Type-C పోర్ట్‌లను ముందు ప్రయాణికుడు సులభంగా ఉపయోగించలేకపోవడం వంటి అంశాలు వినియోగదారుల దృష్టికి వచ్చాయి. ఈ కారణంగా ఇప్పుడు మరింత సంప్రదాయ శైలిలో ఉండే డ్యాష్‌బోర్డ్‌ను కంపెనీ సిద్ధం చేస్తోంది. ఇది పూర్తిగా కొత్త స్టాండర్డ్‌ డిజైన్‌గా వస్తుందా లేదా ప్రస్తుత డిజైన్‌తో పాటు మరో ఎంపికగా అందుబాటులో ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Mahindra Scorpio N ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్లు.. ఈ కొత్త ఫీచర్లు చూస్తే కొనాలనిపించాల్సిందే!

అప్‌హోల్స్టరీలో కూడా మార్పు చేయనుంది మహీంద్రా. ప్రస్తుతం ఉన్న బ్లాక్‌ & గ్రే కలర్‌ థీమ్‌కు బదులుగా కొత్త బ్లాక్‌ & టాన్‌ కలర్‌ కాంబినేషన్‌ను అందించనుంది. ఈ కొత్త రంగుల కలయిక క్యాబిన్‌కు మరింత ప్రీమియం లుక్‌ను తీసుకురానుంది.

ఇప్పటికే Mahindra BE 6లో పెద్ద టచ్‌స్క్రీన్‌, డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, కనెక్టెడ్‌ టెక్నాలజీ, ఆధునిక భద్రతా ఫీచర్లు వంటి విస్తృతమైన ఫీచర్ల జాబితా అందుబాటులో ఉంది. ఇప్పుడు రాబోయే ఈ అప్‌డేట్లతో ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ మరింత ఆకర్షణీయంగా మారే అవకాశముంది. ముఖ్యంగా త్వరలో మార్కెట్‌లో పోటీని పెంచనున్న Tata Sierra EV & Hyundai Creta Electric వంటి ప్రత్యర్థి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడంలో ఈ మార్పులు కీలక పాత్ర పోషించనున్నాయి.

ఇది కూడా చదవండి: కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌

ధరలు
ప్రస్తుతం Mahindra BE 6 ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.18.90 లక్షల నుంచి రూ.26.90 లక్షల వరకు ఉంది. కొత్త అప్‌డేట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ధరలో స్వల్ప పెరుగుదల ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోల్చితే Tata Sierra EV ధరలు రూ.18.79 లక్షల నుంచి రూ.25.99 లక్షల వరకు ఉండగా, Hyundai Creta Electric ధరలు రూ.18.03 లక్షల నుంచి రూ.23.67 లక్షల వరకు ఉన్నాయి.

అయితే కొత్త అప్‌డేట్లతో కూడిన Mahindra BE 6 ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందనే విషయంపై కంపెనీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఈ కొత్త ఫీచర్లు చేరితే BE 6 ప్రీమియం ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
Embed widget