అన్వేషించండి

కొత్త Toyota Hiluxలో వచ్చిన మార్పులేంటి? పాత మోడల్‌తో పోలిస్తే కీలక తేడాలు ఇవే

2026 Toyota Hilux భారత్‌లో కొత్త డిజైన్‌, అప్‌డేటెడ్‌ ఇంటీరియర్‌ & కొత్త ఫీచర్లతో లాంచ్‌ అయింది. పాత మోడల్‌తో పోలిస్తే ఎలాంటి మార్పులు వచ్చాయో పూర్తి వివరాలు తెలుసుకోండి.

2026 Toyota Hilux Price And Features Telugu: టయోటా, భారత మార్కెట్లో తొమ్మిదో తరం Hilux పికప్‌ ట్రక్‌ను విడుదల చేసింది. 2022 మార్చిలో వచ్చిన ఎనిమిదో తరం Hiluxకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈ కొత్త మోడల్‌లో డిజైన్‌, ఇంటీరియర్‌, ఫీచర్లు & వేరియంట్లలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా... మరింత అగ్రెసివ్‌ లుక్‌తో పాటు కొత్త సాంకేతిక ఫీచర్లను జోడించడం ద్వారా ప్రీమియం అనుభూతిని అందించేందుకు టయోటా ప్రయత్నించింది. మరి పాత Hiluxతో పోలిస్తే కొత్త మోడల్‌లో ఏమేం మారాయో తెలుసుకుందాం.

టయోటా Tacoma పికప్‌ ట్రక్‌ డిజైన్‌ ప్రేరణతో కొత్త Hilux ను డిజైన్‌ చేశారు. 2026 టయోటా హైలక్స్‌ ముందు భాగంలో సన్నగా ఉండే LED హెడ్‌ల్యాంప్‌లు, వాటిలోనే కలిపిన DRLs కొత్త లుక్‌ను ఇస్తున్నాయి. గత మోడల్‌లో మధ్యలో టయోటా లోగో ఉండగా, ఇప్పుడు గ్లోస్‌ బ్లాక్‌ స్ట్రిప్‌పై పెద్ద అక్షరాలతో "TOYOTA" పేరు కనిపిస్తుంది. దీంతో వాహనం మరింత బలమైన రోడ్‌ ప్రెజెన్స్‌ను సొంతం చేసుకుంది.

ముందు భాగంలో మార్పులు
ఫ్రంట్‌ గ్రిల్‌ ఇప్పుడు మరింత చతురస్రాకారంలో హనీకాంబ్‌ మెష్‌ డిజైన్‌తో వచ్చింది. బంపర్‌ రెండువైపులా పెద్ద బ్లాక్‌ ఇన్‌సర్ట్‌లు, దిగువ భాగంలో వెడల్పైన ఎయిర్‌ ఇంటేక్‌లు, సిల్వర్‌ స్కిడ్‌ ప్లేట్‌, LED ఫాగ్‌ ల్యాంప్‌లు ఉండటంతో కొత్త Hilux మరింత రగ్గడ్‌గా కనిపిస్తోంది.

పక్క భాగంలో మార్పులు
సైడ్‌ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా కొన్ని కీలక అప్‌డేట్లు ఉన్నాయి. ముందు డోర్లపై HILUX బ్యాడ్జ్‌ను కొనసాగించారు. గతంలో ఉన్న 18 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌కు బదులుగా ఇప్పుడు 17 అంగుళాల కొత్త డిజైన్‌ వీల్స్‌ను బ్లాక్‌ ఫినిష్‌తో అందించారు. వీల్‌ ఆర్చ్‌ క్లాడింగ్‌ ఇప్పుడు అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా లభిస్తోంది. ORVMలు & డోర్‌ హ్యాండిల్స్‌ను కూడా బ్లాక్‌ రంగులో తీర్చిదిద్దారు. ట్రక్‌ బెడ్‌లోకి ఎక్కడం సులభం కావడానికి వెనుక బంపర్‌ ఇరువైపులా చిన్న సైడ్‌ స్టెప్‌లను జోడించారు.

ఇది కూడా చదవండి: రూ.1.23 లక్షల నుంచే Avore EX ఎలక్ట్రిక్‌ బైక్‌.. 260km రేంజ్‌, 114km టాప్‌ స్పీడ్‌

వెనుక భాగంలో మార్పులు
వెనుక భాగంలో కూడా మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. గత మోడల్‌లో ఉన్న B ఆకారపు టెయిల్‌ల్యాంప్‌ల స్థానంలో ఇప్పుడు C ఆకారపు LED టెయిల్‌ల్యాంప్‌లను అమర్చారు. టెయిల్‌గేట్‌పై కూడా పెద్ద అక్షరాలతో "TOYOTA" పేరు కనిపిస్తుంది. టెయిల్‌గేట్‌ హ్యాండిల్‌ను బ్లాక్‌ ఫినిష్‌లో అందించగా, ట్రక్‌ బెడ్‌ను చేరుకునేందుకు వెనుక బంపర్‌లో ఇంటిగ్రేటెడ్‌ స్టెప్‌ను కొనసాగించారు.

ఇంటీరియర్‌లో కొత్త Hilux పూర్తిగా ఆధునిక రూపాన్ని సంతరించుకుంది. కొత్త మూడు స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌పై ఫిజికల్‌ బటన్‌లు, పూర్తిగా డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే & 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను అందించారు. పాత మోడల్‌లో అనలాగ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ & 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ మాత్రమే ఉండేది. అయితే సెంటర్‌ కన్సోల్‌పై అవసరమైన నియంత్రణల కోసం ఫిజికల్‌ బటన్‌లను కొనసాగించడం వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.

ఫీచర్లు
అయితే కొన్ని సౌకర్యవంతమైన ఫీచర్లను టయోటా తొలగించింది. గత మోడల్‌లో లభించిన ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, రెండో వరుస AC వెంట్స్‌, ఆటో డిమ్మింగ్‌ IRVM, లెదర్‌ సీట్లు & పవర్‌ అడ్జస్టబుల్‌ డ్రైవర్‌ సీటు ఇప్పుడు అందుబాటులో లేవు. వాటి స్థానంలో మాన్యువల్‌ AC, సాధారణ IRVM, ఫ్యాబ్రిక్‌ సీట్లు & మాన్యువల్‌గా సర్దుకునే డ్రైవర్‌ సీటును అందించారు. ఉష్ణోగ్రత నియంత్రణ కోసం ప్రీమియం బటన్‌లకు బదులుగా సులభమైన రోటరీ డయల్‌లను ఉపయోగించారు.

కొత్త Hiluxలో వైర్‌లెస్‌ ఛార్జర్‌ను అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా అందించారు. టాప్‌ వేరియంట్‌లో వైర్‌లెస్‌ Apple CarPlay & Android Auto సపోర్ట్‌ కూడా లభిస్తుంది. భద్రత విషయంలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS & Isofix చైల్డ్‌ సీట్‌ మౌంట్లు కొనసాగించినప్పటికీ ADAS సాంకేతికతను మాత్రం ఇంకా అందించలేదు.

ఇది కూడా చదవండి: స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం

ఇంజిన్‌ 
ఇంజిన్‌ పరంగా మాత్రం ఎలాంటి మార్పు లేదు. కొత్త Hilux కూడా అదే IMV ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. ఇందులో 2.8 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ 204 హెచ్‌పీ శక్తి & 500Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు అన్ని వేరియంట్లలో 6 స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను మాత్రమే అందిస్తున్నారు. మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ను పూర్తిగా తొలగించారు. అలాగే 2WD & 4WD ఎంపికలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మరింత మంది కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే విదేశీ మార్కెట్లలో లభించే 48V మైల్డ్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌ను భారత్‌కు తీసుకురాలేదు.

ధరలు
పాత Hilux 4WD మాన్యువల్‌ & ఆటోమేటిక్‌ వేరియంట్లలో మాత్రమే రూ.35.30 లక్షలు & రూ.36 లక్షల ఎక్స్‌షోరూమ్‌ ధరలకు లభించేది. కొత్త Hilux మాత్రం 2WD & 4WD ఎంపికలతో రూ.31.99 లక్షల నుంచి రూ.36.69 లక్షల ఎక్స్‌షోరూమ్‌ ధరల మధ్య అందుబాటులోకి వచ్చింది. తక్కువ ప్రారంభ ధర, కొత్త డిజైన్‌, ఆధునిక ఇంటీరియర్‌ & అదనపు ఫీచర్లతో కొత్త Toyota Hilux భారత పికప్‌ ట్రక్‌ విభాగంలో మరింత బలమైన పోటీదారుగా నిలవనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget