అన్వేషించండి

రూ.1.23 లక్షల నుంచే Avore EX ఎలక్ట్రిక్‌ బైక్‌.. 260km రేంజ్‌, 114km టాప్‌ స్పీడ్‌

Avore EX ఎలక్ట్రిక్‌ బైక్‌ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. EX1, EX2, EX2S మోడళ్ల ధరలు, రేంజ్‌, బ్యాటరీ, టాప్‌ స్పీడ్‌, ఫీచర్లు & వాటి మధ్య తేడాలను తెలుసుకోండి.

Avore EX Range, Price Explained In Telugu: గుజరాత్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ స్టార్టప్‌ అవోర్ ‍‌(Avore), రెండు రోజుల క్రితం, తన కొత్త Avore EX ఎలక్ట్రిక్‌ బైక్‌ శ్రేణిని భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో EX1, EX2 & EX2S అనే మూడు వేరియంట్లు ఉన్నాయి. మూడు మోడళ్లూ ఒకే స్పోర్టీ డిజైన్‌తో ఉన్నప్పటికీ బ్యాటరీ సామర్థ్యం, మోటార్‌ పవర్‌, రేంజ్‌, టాప్‌ స్పీడ్‌ & ఫీచర్లలో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. తక్కువ ధరలో మంచి రేంజ్‌ కోరుకునే వారి నుంచి అధిక పనితీరు కోరుకునే రైడర్ల వరకు అందరికీ సరిపోయేలా ఈ లైనప్‌ను రూపొందించింది.

Avore EX1
ఎంట్రీ లెవెల్‌ మోడల్‌గా వచ్చిన EX1లో 3.24kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు 7.5kW ఎలక్ట్రిక్‌ మోటార్‌ అందించారు. కంపెనీ తెలిపిన IDC ప్రమాణాల ప్రకారం ఇది ఒకసారి పూర్తి ఛార్జ్‌తో 160 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ బైక్‌ గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. ఇందులో Eco, City & Sport అనే మూడు రైడింగ్‌ మోడ్‌లతో పాటు Reverse మోడ్‌ను కూడా అందించారు. చైన్‌ ఫైనల్‌ డ్రైవ్‌తో వచ్చే ఈ వేరియంట్‌ ధర రూ.1.23 లక్షలు.

Avore EX2
మధ్యస్థ వేరియంట్‌గా ఉన్న EX2లో కూడా అదే 7.5kW మోటార్‌ను కొనసాగించారు. అయితే ఇందులో పెద్దదైన 5kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీంతో IDC రేంజ్‌ 255 కిలోమీటర్లకు పెరిగింది. దీని టాప్‌ స్పీడ్‌ గంటకు 100 కిలోమీటర్లు. Eco, City & Sport రైడింగ్‌ మోడ్‌లు, Reverse మోడ్‌, చైన్‌ ఫైనల్‌ డ్రైవ్‌ వంటి ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి. కంపెనీ ప్రకారం సాధారణ 15A సాకెట్‌తో బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతం వరకు సుమారు రెండు గంటల్లో ఛార్జ్‌ చేయవచ్చు. ఈ వేరియంట్‌ ధర రూ.1.46 లక్షలు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?

Avore EX2S
సిరీస్‌లో అత్యంత ప్రీమియం మోడల్‌గా వచ్చిన EX2Sలో 10.5kW సామర్థ్యం గల శక్తివంతమైన ఎలక్ట్రిక్‌ మోటార్‌ను అందించారు. బ్యాటరీ మాత్రం EX2లో ఉన్న అదే 5kWh యూనిట్‌నే ఉపయోగించారు. ఈ మోడల్‌ గరిష్ట వేగం గంటకు 114 కిలోమీటర్ల వరకు చేరుతుందని కంపెనీ వెల్లడించింది. అలాగే IDC ప్రమాణాల ప్రకారం ఒకసారి పూర్తి ఛార్జ్‌తో 260 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని పేర్కొంది.

ఫీచర్ల పరంగా కూడా EX2S ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో Park Assist (PAM+), Eco, City, Sport & Apex అనే ఐదు రైడింగ్‌ మోడ్‌లతో పాటు ప్రత్యేకమైన SYFT మోడ్‌ను కూడా అందించారు. ఈ SYFT మోడ్‌ ద్వారా సంప్రదాయ గేర్‌ బైక్‌ను నడుపుతున్న అనుభూతి కలిగేలా ఎడమ కాలి లీవర్‌తో దశలవారీగా పవర్‌ డెలివరీని పెంచుకోవచ్చు.

EX1 & EX2 వేరియంట్లలో LCD డిస్‌ప్లే ఉండగా, EX2Sలో 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ TFT డిస్‌ప్లేను అందించారు. అలాగే చైన్‌ ఫైనల్‌ డ్రైవ్‌కు బదులుగా బెల్ట్‌ డ్రైవ్‌ను అమర్చడం ద్వారా మరింత సాఫీగా & తక్కువ నిర్వహణ ఖర్చుతో ప్రయాణ అనుభవాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఈ టాప్‌ వేరియంట్‌ ధర రూ.1.70 లక్షలు.

ఇది కూడా చదవండి: స్టైలిష్‌ లుక్‌, 260km వరకు రేంజ్‌, 114kmph టాప్ స్పీడ్‌ - Avore నుంచి మూడు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లు

ఏది బెటర్‌?
తక్కువ ధరలో మంచి రేంజ్‌ కావాలనుకునే వారికి EX1 సరైన ఎంపికగా కనిపిస్తే, ఎక్కువ దూర ప్రయాణాలు చేసే వారికి EX2 అనుకూలంగా ఉంటుంది. అధిక పనితీరు, ప్రీమియం ఫీచర్లు, అత్యాధునిక టెక్నాలజీ కోరుకునే వారికి EX2S అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. దీంతో విభిన్న అవసరాలు ఉన్న కొనుగోలుదారులను ఆకట్టుకునేలా Avore తన కొత్త EX శ్రేణిని రూపొందించింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget