అన్వేషించండి

Nissan Tekton Hybrid SUV India: నిసాన్ టక్టాన్‌ దెబ్బకు దిగ్గజాలు షేక్ అవ్వాల్సిందే! రూ. 11 లక్షలకే హైబ్రిడ్ మ్యాజిక్‌... మైలేజీ చూస్తే మైండ్ బ్లాక్!

Nissan Tekton: నిసాన్ టెక్టాన్‌ హైబ్రిడ్‌ ఎస్‌యూవీ భారత మార్కెట్‌లోకి వస్తోంది. 25 కిలోమీటర్ల మైలేజీ, అడ్వాన్స్డ్‌ అడాస్ ఫీచర్లు, 11 లక్షల ధరతో క్రెటా, సెల్టోస్‌ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొత్త నిస్సాన్ టెక్టాన్ హైబ్రిడ్ SUV భారత మార్కెట్లోకి వస్తోంది.
  • తక్కువ ధరలో 25 కి.మీ/లీటర్ మైలేజ్, లగ్జరీ ఫీచర్లు అందిస్తుంది.
  • జూలై 9, 2026న అధికారిక ఆవిష్కరణ, భారతదేశంలోనే తయారీ.
  • లెవల్ 2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో భద్రతకు ప్రాధాన్యత.

Nissan Tekton Hybrid SUV India: భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీల హా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సి-సెగ్మెంట్‌లో హ్యుందాయ్‌, క్రెటా, కియా సెల్టోస్‌ వంటి కార్లు ఏళ్ల తరబడి రాజ్యమేలుతున్నాయి. అయితే, ఈ మోనోపోలీకి గండి కొట్టేందుకు జపాన్ దిగ్గజం నిసాన్ సిద్ధమైంది. అద్భుతమైన మైలేజీ, అదిరిపోయే ఫీచర్లు, జేబుకు చిల్లు పడకుండా ఉండే ధరతో నిసాన్ టెక్టాన్‌ పేరుతో సరికొత్త హైబ్రి్‌ ఎస్‌యూవీని రంగంలోకి దించుతుంది. 

నిసాన్ ఇండియా తన ఉనికిని చాటుకోవడానికి ప్రవేశపెడుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మోడల్. ఇది ఒక ప్రీమియం మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ. అంతర్జాతీయంగా పేరుగాంచిన నిసాన్ పెట్రోల్‌ డిజైన్ ఫిలాసఫీని ఈ కారులో మనం చూడొచ్చు. కండలు తిరిగిన బాడీ, అగ్రెసివ్‌ ఫ్రంట్‌ గ్రిల్‌, ముందు నుంచి వెనుక వరకు ఉన్న ఎల్‌ఈడీ లైట్ బార్ దీనికి ప్రత్యేక గుర్తింపును ఇస్తోంది. 

ఎందుకు నిసాన్ ప్రత్యేకమైంది?

సాధారణంగా హైబ్రిడ్‌ కార్లు అంటే ధర ఎక్కువగా ఉంటాయని ఒక అభిప్రాయం ఉఁది. కానీ నిసాన్ ఆ అంచనాను తలకిందులు చేసింది. నిసాన్ టెక్టాన్‌లోని స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఇంజిన్‌ నగర ప్రాంతాల్లో లీటరుకు 25 కిలోమీటర్లు కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుందని అంచనా. పెట్రోల్ ధరలు మండిపోతున్న  రోజుల్లో ఇది సామాన్యులకు పెద్ద రట. ఇంతటి హై ఎండ్‌ ఫీచర్లు ఉన్నప్పటికీ దీని ప్రారంభ ర కేవలం 11 లక్షలు ఉండవచ్చని సమాచారం. ఇది క్రెటా, సెల్టోస్ వంటి కార్ల బేస్ వేరియంట్ల ధరతో సమానం. కేవలం మైలేజ్ మాత్రమే కాదు. విలాసవంతమైన క్యాబిన్ కూడా దీన సొంతం. 

విడుదల తేదీ ఎప్పుడంటే?

నిసాన్ టెక్టాన్ హైబ్రిడ్‌ అధికారిక ఆవిష్కరణ జులై 9, 2026న జరగనుంది. ఈ కారును పూర్తిగా భారత్‌లోని తయారు చేసిన, ఇక్కడి మార్కెట్‌తోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేయాలని నిసాన్ భావిస్తోంది. 

ఫీచర్లు- టెక్నాలజీ 

నిసాన్ టెక్టాన్ లోపలి భాగం ఒక విలాసవంతమైన హోటల్ గదిని తలపిస్తోంది. ట్రిపుల్ టోన్ కలర్ స్కీమ్, పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్‌ సిస్టమ్‌, ఫుల్లీ డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయి. 

కుటుంబాలతో ప్రయాణించే వారికి అనువుగా వెనుక సీటు ప్రయాణీకులకు ఎక్కువ ప్రాధాన్య ఇచ్చారు. పనోరమిక్ సన్‌రూఫ్‌, వెంటిలేటెడ్ సీట్లు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. నిసాన్ ఇందులో మూడు రకాల ఇంజిన్లు అందించే ఛాన్స్ ఉంది. 1.0L టర్బో పెట్రోల్, 1.3L టెర్బో పెట్రోల్, 1.5L స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఇంజిన్లు రావచ్చు.

భద్రతకు పెద్దపీట

నిసాన్‌ టెక్టాన్ కేవలం వేగం, డిజైన్ మీ మాత్రమే కాకుండా భద్రత మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో లెవల్‌ 2  అడాస్‌ ఉంది. ఆటోమేటిక్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్‌ వంటి ఫీచర్లు ప్రమాదాలకు నివారించడంలో సహాయపడతాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, టీపీఎంఎస్, ఏబీఎస్‌ విత్ ఈబీడీ, 360 డిగ్రీ కెమెరా వంటి అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా వచ్చే అవకాశం ఉంది. 

నిసాన్‌ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటీ?

నిసాన్ ఇండియా గ కొంతకాలంగా భారత మార్కెట్‌లో వెనుకబడి ఉంది. అయితే, టెక్టాన్ రూపంలో అది తన పూర్వవైభవాన్ని పొందేందుకు ప్రయత్నిస్తోంది. హ్యూందాయ్‌ క్రెట్, కియా సెల్టోస్‌, రాబోయే కొత్త డస్టర్‌ వంటి కార్లతో ఇది నేరుగా తలపడనుంది. బలమైన డిజైన్, హైబ్రిడ్‌ ఎఫిషియన్సీ, సరసమైన ధర... ఈ మూడు అస్త్రాలతో నిసాన్ వినియోగదారులను ఆకర్షించాలని చూస్తోంది. 

నిసాన్ టెక్టాన్ కేవలం ఒక కారు మాత్రమే కాదు, ఇది నిసాన్ కంపెనీకి ఒక గేమ్‌ ఛేంజర్‌ కానుంది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌, లగ్జరీ ఫీచర్లు కావాలనుకునే భారతీ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వినియోగదారులకు ఇది ఒక వర ప్రసాదం అని చెప్పవచ్చు. 

Frequently Asked Questions

నిసాన్ టెక్టాన్ ఎప్పుడు విడుదల అవుతుంది?

నిసాన్ టెక్టాన్ హైబ్రిడ్ అధికారిక ఆవిష్కరణ జులై 9, 2026న జరగనుంది. ఈ కారును పూర్తిగా భారత్ లోనే తయారు చేయాలని నిసాన్ భావిస్తోంది.

నిసాన్ టెక్టాన్ లో ఎలాంటి ఇంజిన్లు అందుబాటులో ఉంటాయి?

నిసాన్ టెక్టాన్ లో 1.0L టర్బో పెట్రోల్, 1.3L టర్బో పెట్రోల్, మరియు 1.5L స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

నిసాన్ టెక్టాన్ మైలేజ్ ఎంత ఉంటుంది?

నిసాన్ టెక్టాన్ లోని స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ నగర ప్రాంతాల్లో లీటరుకు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుందని అంచనా.

నిసాన్ టెక్టాన్ లో ఎలాంటి భద్రతా ఫీచర్లు ఉంటాయి?

నిసాన్ టెక్టాన్ లో లెవల్ 2 ADAS, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఆరు ఎయిర్ బ్యాగ్ లు, ESP, TPMS, ABS తో EBD, మరియు 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
ట్రాఫిక్ చలాన్ పేరుతో కొత్త సైబర్ మోసం - కేంద్రం హెచ్చరిక, ఇలా జాగ్రత్తపడండి
ట్రాఫిక్ చలాన్ కట్టమంటూ మీ మొబైల్‌కు మెసేజ్‌ వచ్చిందా? అది మాయాజాలం కావచ్చు, జాగ్రత్త!
E20 పెట్రోల్‌ను చవగ్గా ఇవ్వడం సర్కారు లక్ష్యం కాదట - ఇంకా ఏం చెప్పిందంటే?
E20 పెట్రోల్‌లో 20% ఇథనాల్ ఉన్నా ధర ఎందుకు తగ్గలేదు? లీటరు ఇథనాల్‌ రేటెంత?
కొత్త బర్గ్‌మన్ స్ట్రీట్ 125 రివ్యూ - స్టైలిష్ లుక్‌, 56 కిలోమీటర్లకు పైగా మైలేజ్‌, కానీ ఈ లోపాలు కూడా ఉన్నాయి!
2026 సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125 రివ్యూ - పవర్‌ ఎంత, రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ ఎంత?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Embed widget