అన్వేషించండి

Best 125cc Scooters in India: అనుకూల బడ్జెట్‌, ఆకట్టుకునే మైలేజ్‌! భారత మార్కెట్‌లో దుమ్మురేపుతున్న టాప్‌ 125 సీసీ స్కూటర్లు ఇవే!

Best 125cc Scooters in India: భారతీయ రోడ్లపై ఇప్పుడు 125cc స్కూటర్ల హవా నడుస్తోంది. రూ. 1 లక్ష లోపు ధరలో అద్భుతమైన మైలేజ్‌, స్మార్ట్‌ ఫీచర్లు ఇచ్చే టాప్ 5 స్కూటర్ల వివరాలు ఇవే!

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెరుగుతున్న పెట్రోల్ ధరలకు 125సీసీ స్కూటర్లు మంచి ఆప్షన్లు.
  • యమహా ఫాసినో125 స్టైలిష్ రెట్రో, హైబ్రిడ్ అసిస్ట్ తో వస్తుంది.
  • టీవీఎస్ జూపిటర్ 125 ఎక్కువ స్టోరేజ్, ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అందిస్తుంది.
  • సుజుకి యాక్సెస్ 125 స్మూత్ ఇంజిన్, కంఫర్ట్ రైడ్ క్వాలిటీతో వస్తుంది.
  • టీవీఎస్ ఎన్-టార్క్ 125 అగ్రెసివ్ లుక్, బ్లూటూత్ నావిగేషన్ అందిస్తుంది.
  • హోండా డియో 125 సిటీ ట్రాఫిక్, స్పోర్టీ గ్రాఫిక్స్‌తో వస్తుంది.

Best 125cc Scooters in India: భారతీయ మధ్యతరగతి కుటుంబాల్లో స్కూటర్‌ అనేది కేవలం ఒక వాహనం మాత్రమే కాదు. అది ఒక ఎమోషన్, ఆఫీసు పనులు, ఇంటి అవసరాలు, పిల్లల స్కూల్ డ్రాపింగ్స్‌, ఇలా అన్నింటికీ స్కూటరే ఆధారమైపోయింది. ఒకప్పుడు 100 సీసీ లేదా 110 సీసీ స్కూటర్లు మాత్రమే ఎక్కువగా కనిపించేవి. కానీ కాలం మారింది. ఇప్పుడు జనాలు పవర్‌తోపాటు మైలేజ్ ఇచ్చే 125సీసీ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. 

ముఖ్యంగా లక్షలోపు బడ్జెట్‌లో స్మార్ట్ ఫీచర్లు, స్పోర్టీ డిజైన్, 52 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ ఇచ్చే అద్బుతమైన ఆఫ్షన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఐదు రకాల స్కూటర్ల గురించి తప్పక తెలుసుకోవాలి. 

యమహా ఫాసినో125 

మీరు రోడ్లపై వెళ్తుంటే అందరూ మీ స్కూటర్ వైపు చూడాలి అనుకుంటే యమహా ఫాసినో కొనుక్కోండి. ఇది భారత్‌లో అత్యంత స్టైలిష్ రెట్రో స్కూటర్‌లలో ఒకటి. దీని కర్వీ డిజైన్ ప్రీమియం లుక్‌ను అందిస్తోంది. ఇందులో హైబ్రిడ్‌ అసిస్ట్‌ సిస్టమ్‌ ఉంది. ఇది స్కూటర్‌ ఆగి బయలుదేరేటప్పుడు అదనపు పవర్‌ను ఇస్తుంది. బ్లూటూత్‌ కనెక్టవిటీ, ఎల్‌ఈడీ లైట్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇది లీటర్‌కు సుమారు 52 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు 74, 910 నుంచి ప్రారంభమవుతుంది. 

Best 125cc Scooters in India: అనుకూల బడ్జెట్‌, ఆకట్టుకునే మైలేజ్‌! భారత మార్కెట్‌లో దుమ్మురేపుతున్న టాప్‌ 125 సీసీ స్కూటర్లు ఇవే!

టీవీఎస్ జూపిటర్ 125

ప్రాక్టికాలిటీ, సౌకర్యం కోరుకునే వారికి జూపిటర్‌ 125 ఒక మంచి వరం లాంటిది. ఇందులో ఫ్రంట్‌ ఫ్యూయల్‌ ఫిల్లింగ్ ఉండటం వల్ల సీటు దిగాల్సిన పని లేదు. సీటు కింద చాలా ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇద్దరి హెల్మెట్‌ కూడా పెట్టుకోవచ్చు. ఇది సుమారు 50 కిలోల మైలేజీ అందిస్తుంది. దీని ధర సుమారు 78, 700 నుంచి మొదలవుతుంది. 

img

సుజుకి యాక్సెస్‌ 125

ఏళ్ల తరబడి భారత్ మార్కెట్‌లో తన ఉనికిని చాటుకుంటున్న స్కూటర్ ఇది. సుజుకి యాక్సెస్‌ దాని స్మూత్‌ ఇంజిన్, కంఫర్ట్‌బుల్ రైడ్ క్వాలిటీకి పేరుగాంచింది. లేటెస్ట్‌ మోడల్‌లో బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, కొత్త రంగులు అందుబాటులోకి వచ్చాయి. దీని ధర సుమారు 79,885 నుంచి మొదలవుతుంది. 
Pearl Mat Aqua Silver (Q2D)

టీవీఎస్‌ ఎన్‌-టార్క్‌ 125

మీకు వేగం, స్టైల్‌, అగ్రెసివ్‌ లుక్ కావాలంటే ఎన్‌టార్క్‌ కంటే మెరుగైన ఆప్షన్ లేదు. దీని అగ్రెసివ్‌ బాడీ, షార్ప్ లుక్స్ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇందులో డిజిటల్‌ స్క్రీన్‌ ఉంటుంది. దీనికి బ్లూటూత్‌ కనెక్ట్‌ చేసి నావిగేషన్, రైడ్ అనలిటిక్స్ చూసుకోవచ్చు. ఇది 81 వేల నుంచి ప్రారంభమవుతుంది. 
Best 125cc Scooters in India: అనుకూల బడ్జెట్‌, ఆకట్టుకునే మైలేజ్‌! భారత మార్కెట్‌లో దుమ్మురేపుతున్న టాప్‌ 125 సీసీ స్కూటర్లు ఇవే!

హోండా డియో 125

సిటీ ట్రాఫిక్‌లో సులువుగా దూసుకుపోవడానికి హోండా డియో 125 అద్భుతంగా పని చేస్తుంది. దీని స్పోర్టీ గ్రాఫిక్స్, షార్ప్ ఫ్రంట్ ఎండ్‌ దీనికి ప్రత్యేక గుర్తింపు ఇస్తాయి. హై ఎండ్‌ వేరియంట్‌లలో టీఎఫ్‌టీ డిస్‌ప్లే, స్మార్ట్ కీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. దీని ధర సుమారు 87 వేల నుంచి ప్రారంభమవుతుంది. 


Best 125cc Scooters in India: అనుకూల బడ్జెట్‌, ఆకట్టుకునే మైలేజ్‌! భారత మార్కెట్‌లో దుమ్మురేపుతున్న టాప్‌ 125 సీసీ స్కూటర్లు ఇవే!

Also Read:నిసాన్ టక్టాన్‌ దెబ్బకు దిగ్గజాలు షేక్ అవ్వాల్సిందే! రూ. 11 లక్షలకే హైబ్రిడ్ మ్యాజిక్‌... మైలేజీ చూస్తే మైండ్ బ్లాక్!

పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో మంచి పవర్‌తోపాటు మైలేజ్ ఇచ్చే వాహనం అవసరం. 125సీసీ స్కూటర్లు హైవేపై, సిటీ ట్రాఫిక్‌లో సమానమైన పని తీరు చూపిస్తాయి. మీ పాత 100సీసీ పదే పదే రిపేర్లు వస్తున్నా, లేదా మీరు మొదటిసారి వాహనం కొంటున్నా, లక్ష లోపు బడ్జెట్‌లో ఇవి మంచి ఆప్షన్లు. 

Also Read:పెరిగిన పెట్రో ధ‌ర‌లు: ఇంధన ఖర్చులు తగ్గించుకునేలా డ్రైవింగ్ హ్యాబిట్స్, మెయింటెనెన్స్ వివరాలు ఇవే

కేవలం మైలేజ్‌, స్టైల్ కావాలనుకుంటే యమహా ఫాసినో ఎంచుకోవచ్చు. ఎక్కువ లగేజీ, ఫ్యామిలీ సౌకర్యం కావాలంటే టీవీఎస్ జూపిటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నమ్మకం రీసేల్ వాల్యూ కావాలంటే మాత్రం సుజుకి యాక్సెస్‌ మంచిది. వేగం, టెక్నాలజీ కావాలంటే టీవీఎస్‌ ఎన్‌టార్క్‌ ఉత్తమమైన ఎంపిక. 

Also Read:ట్రయంఫ్ టైగర్ 900 సరికొత్త ఎడిషన్లు లాంచ్ - ఆల్పైన్, డెజర్ట్ మోడళ్ల ఫీచర్లు, ప్రైస్ డీటైల్స్

ఈ ఐదు స్కూటర్లు తమదైన ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. ఒకప్పుడు స్కూటర్లు అంటే కేవలం తిరగడానికి మాత్రమే అనుకునేవారు ఇప్పుడు అందులో బ్లూటూత్, హైబ్రిడ్‌ అసిస్ట్ వంటి టెక్నాలజీలు వచ్చేశాయి. మీ అవసరాలు, మీ వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా పైన పేర్కొన్న వాటిలో ఏదో ఒకటి ఎంచుకొని టెస్ట్ రైడ్ చేయండి.

Frequently Asked Questions

125 సీసీ స్కూటర్లు ఎందుకు ప్రాచుర్యం పొందుతున్నాయి?

పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో, 125 సీసీ స్కూటర్లు పవర్ తో పాటు మంచి మైలేజీని అందిస్తున్నాయి. ఇవి సిటీ ట్రాఫిక్ మరియు హైవేలపై కూడా అద్భుతమైన పనితీరును కనబరుస్తాయి.

యమహా ఫాసినో 125 యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి?

యమహా ఫాసినో 125 ఒక స్టైలిష్ రెట్రో స్కూటర్. ఇందులో హైబ్రిడ్ అసిస్ట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, LED లైట్లు ఉన్నాయి మరియు ఇది సుమారు 52 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

టీవీఎస్ జూపిటర్ 125 యొక్క ప్రయోజనాలు ఏమిటి?

జూపిటర్ 125 ప్రాక్టికాలిటీ మరియు సౌకర్యం కోసం రూపొందించబడింది. ఇందులో ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్, ఎక్కువ స్టోరేజ్ స్పేస్ (రెండు హెల్మెట్లు పట్టేంత) మరియు సుమారు 50 కిలోమీటర్ల మైలేజ్ ఉంటుంది.

సుజుకి యాక్సెస్ 125 ఎందుకు మంచి ఎంపిక?

సుజుకి యాక్సెస్ 125 దాని స్మూత్ ఇంజిన్, కంఫర్టబుల్ రైడ్ క్వాలిటీకి పేరుగాంచింది. లేటెస్ట్ మోడల్ లో బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు కొత్త రంగులు అందుబాటులో ఉన్నాయి.

వేగం మరియు స్టైల్ కోరుకునే వారికి ఏ స్కూటర్ మంచిది?

వేగం, స్టైల్ మరియు అగ్రెసివ్ లుక్ కావాలనుకుంటే టీవీఎస్ ఎన్-టార్క్ 125 ఉత్తమ ఎంపిక. దీని డిజిటల్ స్క్రీన్ తో బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా నావిగేషన్, రైడ్ అనలిటిక్స్ చూడవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget