అన్వేషించండి

Car Battery Life: కారు బ్యాటరీ త్వరగా పాడవుతుందా? ఈ చిట్కాలతో బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు

చిన్న నిర్లక్ష్యం వల్ల కారు బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. కొన్ని సాధారణ అలవాట్ల ద్వారా మీ కారు బ్యాటరీ ఏకంగా 7 నుండి 8 సంవత్సరాల పాటు సజావుగా పనిచేసేలా చూసుకోవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ నీటి స్థాయి మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేయాలి.
  • బ్యాటరీ టెర్మినల్స్ పై పేరుకున్న నాచును వేడి నీటితో శుభ్రం చేయాలి.
  • వాహనం స్టార్ట్ చేసే ముందు ఏసీ, లైట్లు వంటివి ఆన్ చేయకూడదు.
  • కంపెనీ అందించిన ఎలక్ట్రిక్ సిస్టమ్స్ మాత్రమే వాహనంలో వాడాలి.

పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు సీఎన్‌జీ ధరలు ఇటీవల పెరుగుతున్నాయి. ఇదివరకే కొందరు ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లగా.. మరికొందరు ఈవీలు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే చాలా మంది కారు లేదా బైక్ బ్యాటరీ 3 నుండి 4 సంవత్సరాలలో పాడైపోతుందని ఫిర్యాదు చేస్తున్నారు. బ్యాటరీని సరైన పద్ధతిలో మెయింటైన్ చేస్తే దాని లైఫ్ టైమ్ పెంచవచ్చు. చిన్నచిన్న నిర్లక్ష్యాలు బ్యాటరీని త్వరగా వీక్ చేసి దెబ్బతీస్తాయి. అదే కొన్ని చిట్కాలు పాటిస్తే మీ వాహనం బ్యాటరీని 7 నుంచి 8 సంవత్సరాల వరకు ఏ సమస్య లేకుండా వాడుకోవచ్చు.  అందుకే బ్యాటరీని పరీక్షించడం, సకాలంలో మెయింటెనెన్స్ చేయడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. 

బ్యాటరీ నీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి 
ఎలక్ట్రిక్ వాహనాలలో అన్నింటికంటే మొదటి, ముఖ్యమైన విషయం బ్యాటరీ గురించి శ్రద్ధ తీసుకోవాలి. ప్రతి మూడు నెలలకొకసారి వాహనం బోనెట్ తెరిచి బ్యాటరీలోని డిస్టిల్డ్ వాటర్ (Distilled water)ను ఖచ్చితంగా చెక్ చేయాలి. నీరు తగ్గిపోతే బ్యాటరీ లోపల త్వరగా వేడెక్కి పాడైపోవడం మొదలవుతుంది. సమయానికి డిస్టిల్డ్ వాటర్ నింపడం వల్ల బ్యాటరీ పనితీరు బాగుండి దాని లైఫ్ టైమ్ పెరుగుతుంది. 

Also Read: CNG Price Hike: మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!

టెర్మినల్స్ శుభ్రత
రెండవ ముఖ్యమైన విషయం బ్యాటరీ టెర్మినల్స్ శుభ్రంగా ఉంచడం. చాలా సార్లు బ్యాటరీ టెర్మినల్స్‌పై తెల్లటి లేదా నీలం రంగు నాచు పేరుకుపోతుంది. దీనివల్ల కరెంట్ ఫ్లో తగ్గడంతో మీ వాహనం స్టార్ట్ కావడంలో ఇబ్బందులు వస్తాయి. అలాంటప్పుడు కొద్దిగా వేడి నీటిని పోసి ఆ నాచును శుభ్రం చేయాలి. టెర్మినల్స్ శుభ్రంగా ఉండటం వల్ల బ్యాటరీ కనెక్షన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది.

స్టార్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి 
మీ వాహనాన్ని స్టార్ట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ముందు ఏసీ, హెడ్‌లైట్లు, మ్యూజిక్ సిస్టమ్ లేదా ఇతర ఎలక్ట్రిక్ పరికరాలను ఆన్ చేయకూడదు. స్టార్ట్ చేసే సమయంలో బ్యాటరీపై అప్పటికే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. మిగిలిన వస్తువులు కూడా ఆన్‌లో ఉంటే బ్యాటరీ త్వరగా వీక్ అవుతుంది. అందుకే మొదట ఇంజిన్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత మిగిలిన ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఆన్ చేయండి.

అదేవిధంగా మీ వాహనాన్ని ఆఫ్ చేసేటప్పుడు కూడా ఏసీ, బ్లోయర్, లైట్లు, మ్యూజిక్ సిస్టమ్ పూర్తిగా బంద్ చేయాలి. ఇవి ఆన్‌లోనే ఉండిపోతే, తరువాత సారి వాహనాన్ని స్టార్ట్ చేసేటప్పుడు బ్యాటరీపై అడిషనల్ బర్డన్ పడుతుంది. ఈ అలవాటు మెల్లమెల్లగా బ్యాటరీ కెపాసిటీ తగ్గించేస్తుంది.

కంపెనీ ఎలక్ట్రిక్ సిస్టమ్‌ను మాత్రమే వాడాలి
ఈ రోజుల్లో చాలా మంది వాహనంలో బయట నుండి భారీ లైట్లు, పెద్ద హారన్లు, సబ్ వూఫర్లు, యాంప్లిఫైయర్లను అమర్చుకుంటున్నారు. ఈ ఎక్కువ లోడ్ తీసుకునే ఎలక్ట్రిక్ వస్తువులు బ్యాటరీపై అవసరానికి మించి ఒత్తిడిని పెంచుతాయి. దీనివల్ల బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అయిపోయి, దాని ఆయుష్షు తగ్గిపోతుంది. అందుకే ఎల్లప్పుడూ కంపెనీ ఇచ్చిన ఎలక్ట్రిక్ సిస్టమ్‌ను మాత్రమే ఉపయోగించడం మంచిదని చెబుతారు. 

Also Read: Hero Electric Optima vs Vida VX2 Go: హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా vs విడా VX2గో: లక్ష లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ ఏది? ధర ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌ గురించి తెలుసుకోండి!

వాహనం సర్వీసింగ్ చేయించే సమయంలో బ్యాటరీ టెర్మినల్స్‌ను టైట్ చేయించాలి. టెర్మినల్స్ లూజ్‌గా ఉండటం వల్ల సరైన కనెక్షన్ కుదరక బ్యాటరీ పనితీరు దెబ్బతింటుంది. దీనితో పాటు టెర్మినల్స్‌పై గ్రీస్, పెట్రోలియం జెల్లీ లేదా యాంటీ కొరోషన్ కోటింగ్ పూయడం వల్ల తుప్పు, నాచు పట్టకుండా ఉంటుంది. దీనివల్ల బ్యాటరీ ఎక్కువ కాలం  పనిచేస్తూనే ఉంటుంది.

Frequently Asked Questions

ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ జీవితకాలం ఎలా పెంచుకోవచ్చు?

బ్యాటరీని సరైన పద్ధతిలో మెయింటెయిన్ చేస్తే దాని లైఫ్ టైమ్ పెంచవచ్చు. చిన్న చిన్న నిర్లక్ష్యాలు బ్యాటరీని త్వరగా వీక్ చేసి దెబ్బతీస్తాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే బ్యాటరీని 7 నుండి 8 సంవత్సరాల వరకు ఏ సమస్య లేకుండా వాడుకోవచ్చు.

ఎలక్ట్రిక్ వాహనాలలో బ్యాటరీ నీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్రతి మూడు నెలలకొకసారి వాహనం బోనెట్ తెరిచి బ్యాటరీలోని డిస్టిల్డ్ వాటర్ ను ఖచ్చితంగా చెక్ చేయాలి. నీరు తగ్గిపోతే బ్యాటరీ త్వరగా వేడెక్కి పాడైపోతుంది. సమయానికి డిస్టిల్డ్ వాటర్ నింపడం వల్ల బ్యాటరీ పనితీరు బాగుండి లైఫ్ టైమ్ పెరుగుతుంది.

వాహనాన్ని స్టార్ట్ చేసేటప్పుడు మరియు ఆఫ్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇంజిన్ స్టార్ట్ చేసే ముందు ఏసీ, హెడ్‌లైట్లు, మ్యూజిక్ సిస్టమ్ వంటి ఎలక్ట్రిక్ పరికరాలను ఆన్ చేయకూడదు. వాహనాన్ని ఆఫ్ చేసేటప్పుడు కూడా అన్ని ఎలక్ట్రిక్ వస్తువులను పూర్తిగా బంద్ చేయాలి. ఇది బ్యాటరీపై అదనపు భారాన్ని తగ్గిస్తుంది.

ఎలక్ట్రిక్ వాహనాలలో అదనపు ఎలక్ట్రిక్ పరికరాలను అమర్చడం వల్ల బ్యాటరీపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

బయట నుండి భారీ లైట్లు, పెద్ద హారన్లు, సబ్ వూఫర్లు వంటివి అమర్చడం వల్ల బ్యాటరీపై అవసరానికి మించి ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అయిపోయి, దాని ఆయుష్షు తగ్గిపోతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget