అన్వేషించండి

Drinking water After Meals: భోజనం తర్వాత ఎంత సమయానికి నీళ్లు తాగాలి? మధ్య మధ్యలో వాటర్ తాగడం మంచిదా కాదా?

Drinking water After Meals: భోజనం సమయంలో లేదా తర్వాత నీళ్లు తాగడంపై చాలా రకాల అపోహలు ఉన్నాయి. జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఏంటో చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భోజనానికి ముందు, తర్వాత నీరు తాగడంపై విభిన్న అభిప్రాయాలున్నాయి.
  • ఆధునిక వైద్యం జీర్ణక్రియకు నీటితో హాని లేదని చెబుతోంది.
  • ఆయుర్వేదం జీర్ణాగ్ని కోణంలో భోజనం, నీటి సంబంధాన్ని వివరిస్తుంది.
  • సరైన సమయానికి నీరు తాగడం జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

Drinking water After Meals: మనం రోజూ సాధారణంగా వినిపించే తిన్న వెంటనే నీళ్లు తాగొద్దు అని. మధ్య మధ్యలో కూడా నీళ్లు తాగడం మంచిది కాదని ఇంట్లో పెద్దలు చెబుతూనే ఉంటారు. ఒక వైపు ఆయుర్వేదం భోజనం తర్వాత కనీసం 30 నిమిషాల వరకు నీళ్లు తాగొద్దని చెబుతుంటే ఆధునిక వైద్యం మాత్రం నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియకు ఎలాంటి హాని లేదని చెబుతోంది. 

జీర్ణక్రియ అంటే ఏంటి?

మనం తీసుకునే ఆహారం శరీరానికి శక్తిని అందించాలంటే అది సరిగా జీర్ణం కావాలి. ఈ ప్రక్రియ మనం ఆహారం నోట్లు పెట్టుకున్న క్షణం నుంచి మొదలవుతుంది. నోటిలో విడుదలయ్యే సలైవే ఆహాన్ని మొత్తగా మార్చి, అందులోని ఎంజైమ్‌ ద్వారా జీర్ణక్రియను ప్రారంభిస్తుంది. కడుపులో ఉండే గ్యాస్ట్రిక్ యాసిడ్స్‌, డైజెస్టివ్ ఎంజైమ్‌ కలిసి ఆహారాన్ని మరింత చిన్న భాగాలుగా విడగొడతాయి. పోషకాలు శరీరంలో కలిసిపోయేలా పేగులు చేస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. నీరు ఆహారాన్నని కరిగించడంలో, పోషకాల శోషణలో, మలబద్ధకం నివారణలో సహయపడుతుంది. 

మేయో క్లినిక్ పరిశీలనలో ఏం తేలింది

ప్రపంచ ప్రఖ్యాత మేయో క్లినిక్‌ వంటి సంస్థల ప్రకారం భోజనం సమయంలో లేదా తర్వాత నీరు తాగడం వల్ల జీర్ణరసాలు పలుచన అవుతాయనేది కేవలం మిథ్య మాత్రమే. నీళ్లు తాగడం వల్ల కడుపులో పీహెచ్ స్థాయిలో స్వల్ప మార్పు వచ్చినా, మన శరీరం వెంటనే స్పందించి మరిన్ని ఆమ్లాలను వీడుదల చేసి దాన్ని సమతుల్యం చేస్తుంది. నీరు వాస్తవానికి ఆహారం సాఫీగా కదలడానికి గొంతు దిగడానికి, ఆహారాన్ని మెత్తగా చేయడానికి ఉపయోగపడుతుంది. 

ఆయుర్వేదం ఏం చెబుతుంది

ఆయుర్వేదం శాస్త్రం  భోజనం, నీటి మధ్య సంబంధం జీర్ణాగ్ని కోణంలో చూస్తుంది. కడపులో ఉండే జీర్ణశక్తిని అగ్నితో పోలుస్తారు. వాత పిత్త, కఫ ప్రకృతి గల వ్యక్తులకు వేర్వేరు సూచనలు ఉన్నాయి. వాత ప్రకృతి వారు భోజనం తర్వాత గంట ఆగి వెచ్చని నీరు తాగాలి. కఫ ప్రకృతి వారు భోజనానికి ముందే నీరు తాగాలని ఆయుర్వేదం చెబుతోంది. 

సరైన సమయం ఎప్పుడు 

వివిధ అధ్యయనాల, వైద్యుల అభిప్రాయాల ప్రకారం నీటిని భోజనానికి అర గంట ముందు ఒక గ్రాస్ తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల తక్కువ క్యాలరీలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది. ఆహారం మరీ పొడిగా ఉంటే, చిన్న చిన్న సిప్పులుగా నీరు తాగడం మంచి పద్ధతి. భారీ భోజనం చేసిన తర్వాత వెంటనే గ్లాసుల కొద్దీ నీరు తాగడం వల్ల ఉబ్బరం, అసిడిటి, వస్తాయి. అందుకే 15 నుంచి 30 నిమిషాల వ్యవధి ఇవ్వడం మంచిదని చాలా మంది 30 నిమిషాల వ్యవధి ఇవ్వడం మంచిదని అంటున్నారు.  

చివరిగా సైన్స్, ఆయుర్వేదం రెండూ మితం అనే సూత్రాన్ని అంగీకరిస్తాయి. నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ ఆగిపోదు. కానీ తాగే విధానం, ఉష్ణోగ్రత, మీ శరీర స్పందన చాలా ముఖ్యం. రోజంతా తగినంత హైడ్రేషన్ కలిగి ఉండటం , భోజనం తర్వాత కొద్ది సేపు నడవడం వంటి అలవాట్లు జీర్ణక్రియను మరింత మెరుగుపరుస్తాయి. 

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి 

Frequently Asked Questions

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియకు హాని కలుగుతుందా?

ఆధునిక వైద్యం ప్రకారం, భోజన సమయంలో లేదా తర్వాత నీరు తాగడం వల్ల జీర్ణరసాలు పలుచన అవుతాయనేది కేవలం అపోహ మాత్రమే. నీరు తాగడం వల్ల జీర్ణక్రియకు ఎలాంటి హాని ఉండదు.

జీర్ణక్రియ అంటే ఏమిటి?

మనం తీసుకునే ఆహారం శరీరానికి శక్తిని అందించడానికి సరిగా జీర్ణం కావాలి. నోటిలో ప్రారంభమై, కడుపులో ఆమ్లాలు, ఎంజైములు, మరియు పేగుల సహాయంతో పోషకాలు శరీరంలో కలిసిపోయేలా జరిగే ప్రక్రియే జీర్ణక్రియ.

ఆయుర్వేదం ప్రకారం భోజనం తర్వాత నీళ్లు తాగడం గురించి ఏం చెబుతుంది?

ఆయుర్వేదం ప్రకారం, భోజనం తర్వాత కనీసం 30 నిమిషాల వరకు నీళ్లు తాగకూడదు. వాత ప్రకృతి వారు గంట తర్వాత వెచ్చని నీరు తాగాలని, కఫ ప్రకృతి వారు భోజనానికి ముందే తాగాలని సూచిస్తుంది.

భోజనానికి ముందు నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఏమిటి?

భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల తక్కువ క్యాలరీలు తీసుకునే అవకాశం ఉంటుంది, ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget