అన్వేషించండి

Mandula Samuel controversial comments : ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలతో కలకలం - కేసులు నమోదు చేయరా అని బీజేపీ ప్రశ్న

Professor Nageshwar issue: తెలంగాణ కాంగ్రెస్ నేత మందుల సామేలు ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కేసులు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Mandula Samuel vs Pawan Kalyan: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మందుల సామేలు వ్యవహారశైలి ఇప్పుడు సొంత పార్టీకే తలనొప్పిగా మారుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశంలో   ఏపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశంపై స్పందిస్తూ, ఏమాత్రం సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను ఆయన వ్యక్తిగతంగా దూషించారు. నాగేశ్వర్ ఇష్యూలో అసలు కాంగ్రెస్ కు సంబంధం లేదు.  అయితే సామేలు దానిని ప్రాంతీయ ,  రాజకీయ కోణంలోకి మళ్లించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతం కాదని, కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానమే ఇదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

 ఏపీ బీజేపీ గళం - విష్ణువర్ధన్ రెడ్డి సూటి ప్రశ్న 

మందుల సామేలు వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడటం కాంగ్రెస్ సంస్కృతికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఐదు కోట్ల మంది సోదర తెలుగు రాష్ట్ర ఆంధ్రులను అవమానించడం న్యాయమేనా?  వెంటనే జూబ్లీహిల్స్ వదిలి వెళ్లిపోవాలి అంటూ బెదిరింపులకు దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలపై ఇంత బహిరంగంగా బెదిరిస్తుంటే, ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చున్నారు. తెలంగాణ ప్రజలు అందరినీ ప్రేమించే గొప్ప సమాజం. మీ రాజకీయాల కోసం మంచి రాష్ట్రాన్ని నాశనం చేయడం ఎందుకని ప్రశ్నించారు. 

అవసరం లేని వివాదంలో కాంగ్రెస్ 

వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదు. కానీ, సామేలు అత్యుత్సాహం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిఫెన్స్‌లో పడాల్సి వచ్చింది. ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఆయన, తాజాగా మరోసారి హద్దులు దాటడంపై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం పరంగా ఏపీతో సత్సంబంధాలు కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుంటే, ఇలాంటి నేతల వ్యాఖ్యలు ఆ ప్రయత్నాలకు గండికొడుతున్నాయని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

 నెటిజన్ల ట్రోలింగ్ - సోషల్ మీడియాలో నిరసన 

సామేలు వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో పవన్ కల్యాణ్ అభిమానులు,  టీడీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో ఆయనపై విరుచుకుపడుతున్నారు. నాగేశ్వర్ వంటి మేధావుల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఈ ట్రోలింగ్ సెగ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్‌కు కూడా తాకడంతో, పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.    
 
రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే అయినా, అవి వ్యక్తిగత దూషణల స్థాయికి చేరినప్పుడు పార్టీలకు ఇబ్బందులు తప్పవు. మందుల సామేలు వంటి నేతలు  పార్టీ ప్రతిష్టను పణంగా పెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Breaking News: జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం!మెకానిక్ దుర్మరణం!
జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం!మెకానిక్ దుర్మరణం!
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Ongole Politics: కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
Embed widget