అన్వేషించండి

Pawan Kalyan personal abuse Press Club: నాగేశ్వర్ సంఘీభావ సభలో పవన్ కల్యాణ్‌పై దూషణలు - ఖండించిన ఏపీ బీజేపీ !

Professor Nageshwar Rao case AP: ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఏపీలో కేసుల విషయంలో జరిగిన సమావేశం వివాదాస్పదమైంది. పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ నేత విష్ణువర్ధన్ ఖండించారు.

Janasena vs Intellectuals controversy:  ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసుల విషయంలోలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సంఘీభావ సమావేశం ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. నాగేశ్వర్‌కు మద్దతు తెలపాల్సిన వేదికపై, కొందరు వక్తలు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లక్ష్యంగా వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ రంగు పులుముకుంది.  
  
అభిప్రాయ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్నారంటూ మొదలైన ఈ చర్చ, కొద్దిసేపటికే దారి తప్పింది. వేదికపై ఉన్న కొందరు వక్తలు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం , ఆయన తీరుపై అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమయింది.  సంఘీభావ సభ కాస్తా పవన్ కల్యాణ్ టార్గెట్ సభగా మారిపోయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   

 

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం 

ఈ పరిణామాలపై బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌పై  కొంతమంది చేసిన అనుచిత వ్యాఖ్యలు,  తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను ఏపీ బీజేపీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.   12 సంవత్సరాల తర్వాత కూడా ప్రాంతీయ భేదాలు, ప్రజల  సెంటిమెంట్ రెచ్చగొట్టడం దేనికి సంకేతం? ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే కానీ వ్యక్తిగత దూషణలు, ప్రాంతీయభావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ఎలాంటి స్థానం లేదన్నారు.  ప్రొఫెసర్ నాగేశ్వర్ తన తప్పును తానే ఒప్పుకోవడం జరిగిందని గుర్తు చేశారు.  ప్రజా వేదికలపై మాట్లాడే ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. 

 సోషల్ మీడియాలో యుద్ధం - జనసేన కౌంటర్ 

ప్రెస్ క్లబ్ సమావేశంలో చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి.   పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించిన వారిపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  పవన్ గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడిన మేధావులను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

 ఈ వివాదంపై మేధావి వర్గంలో కూడా చీలిక కనిపిస్తోంది. నాగేశ్వర్‌పై కేసులను ఖండించడంలో తప్పు లేదని, కానీ అదే సమయంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులను వ్యక్తిగతంగా దూషించడం వల్ల అసలు సమస్య పక్కదారి పడుతుందని కొందరు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ విమర్శలకు, వ్యక్తిగత దూషణలకు మధ్య ఉన్న గీతను మేధావులు గుర్తించకపోతే వారి విశ్వసనీయత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఇంద్రకీలాద్రి భక్తులకు అలర్ట్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం రద్దీ, వీఐపీ దర్శనాలు నిలిపివేత!
ఇంద్రకీలాద్రి భక్తులకు అలర్ట్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం రద్దీ, వీఐపీ దర్శనాలు నిలిపివేత!
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Embed widget