అన్వేషించండి

AP Local Elections: ఏపీ స్థానిక సమరానికి జగన్ సై - ఏకగ్రీవాలుండవ్ - కానీ క్యాడర్ ధైర్యం చేస్తుందా?

YS Jagan local body elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఒక్క సీటు కూడా ఏకగ్రీవం కాకూడదని, అక్రమ తొలగింపులపై పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

AP Local Body Unanimous elections: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ ముసురుకున్న సందేహాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెరదించారు. తాడేపల్లి వేదికగా జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.    మున్సిపల్, కార్పొరేషన్ ,  పంచాయతీ ఎన్నికలను వైసీపీ బహిష్కరిస్తుందని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ, వైఎస్ జగన్ సమరశంఖం పూరించారు. గెలుపోటముల కంటే ప్రజాస్వామ్యబద్ధంగా ‘పోటీ’లో నిలబడటమే అత్యంత ముఖ్యమని ఆయన పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఒక్క స్థానాన్ని కూడా కూటమి పార్టీలకు ఏకగ్రీవం కాకుండా చూడాలని, ప్రతిచోటా గట్టి పోటీ ఇవ్వాలని ఇన్‌ఛార్జ్‌లకు దిశానిర్దేశం చేయడం ద్వారా తన పట్టుదలని చాటుకున్నారు.

పులివెందుల ఫలితం తర్వాత మారిన లెక్కలు

ఇటీవల పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో వైసీపీకి ఆశించిన ఫలితం రాలేదు. అక్కడ డిపాజిట్ దక్కకపోవడంతో పార్టీ నైతికంగా కొంత ఒత్తిడికి లోనైంది. కూటమి ప్రభుత్వం అధికార బలంతో నామినేషన్లను అడ్డుకుంటోందని, తమ పార్టీని పోటీ చేయకుండా అణిచివేస్తోందని వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని పార్టీలోని కొందరు పెద్దలు భావించినప్పటికీ, జగన్ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవాలంటే పోటీ తప్పదని ఆయన గ్రహించారు.

 ఏకగ్రీవాల  అపవాదు నుంచి బయటపడేలా..: 

గత వైసీపీ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఏకగ్రీవాలు జరిగాయి. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేనలు.. వైసీపీ భౌతిక దాడులు . బెదిరింపులతో నామినేషన్లు వేయనివ్వలేదని తీవ్ర విమర్శలు చేశాయి. ఇప్పుడు అదే తరహా కూటమి పార్టీలు కూడా అదే తరహా వ్యూహం పాటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.  అందుకే, ఈసారి ప్రతి సీటులోనూ అభ్యర్థులను నిలబెట్టాలని, ఎవరైనా నామినేషన్లు అడ్డుకుంటే లీగల్ సెల్ ద్వారా పోరాడాలని నిర్ణయించారు. దీని ద్వారా గతంలో తమపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టడంతో పాటు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు.

 క్యాడర్ బలోపేతమే పరమావధి 

ఒక రాజకీయ పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తే కింది స్థాయి కార్యకర్తలు నిర్వేదంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఐదేళ్ల రాజకీయం స్థానిక నేతలపైనే ఆధారపడి ఉంటుంది. పోటీ చేయకపోతే గ్రామ స్థాయి నేతలు ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని నివారించేందుకు జగన్ పోటీ  అస్త్రాన్ని ఎంచుకున్నారు. గెలుపోటముల సంగతి పక్కన పెడితే ప్రజల పక్షాన నిలబడి ఓట్లు అడగాలి అన్నది జగన్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.

కూటమికి గట్టి సవాల్ 

జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వానికి కూడా సవాల్‌గా మారనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఈ ఎన్నికలు నిరూపిస్తాయి. టీడీపీ, జనసేన తమ పట్టును నిరూపించుకోవాలని చూస్తుంటే, వైసీపీ తన ఉనికిని చాటుకోవాలని తాపత్రయపడుతోంది.   ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారనున్నాయి. గెలుపు గుర్రాలు ఎవరనేది పక్కన పెడితే, ఏకగ్రీవాలు లేకుండా హోరాహోరీగా సాగే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మేలు చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ తాజా నిర్ణయం వైసీపీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందా లేదా అనేది వేచి చూడాలి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Regional Politics AP: వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
Nara Lokesh Praises Pawan Kalyan : పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget