అన్వేషించండి

HYDRAA Eagle Team transgender jobs: భిక్షాటన నుంచి ఈగిల్ టీమ్ దాకా - హైడ్రాలో ట్రాన్స్‌జెండర్ల సగర్వ ప్రస్థానం.. గౌరవానికి కేరాఫ్ అడ్రస్‌గా యూనిఫాం !

Commissioner Ranganath transgender recruitment: ఒకప్పుడు బస్టాండ్లు, సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేస్తూ, సమాజం నుంచి అవహేళనలు ఎదుర్కొన్న ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో ‘హైడ్రా’ సరికొత్త వెలుగులు నింపింది.

HYDRAA  Transgender success stories : హైదరాబాద్ నగర రూపురేఖలను మారుస్తున్న  హైడ్రా  కేవలం అక్రమ కట్టడాల కూల్చివేతలకే పరిమితం కాకుండా, సామాజిక సంస్కరణలోనూ సరికొత్త అధ్యాయాన్ని  సృష్టిస్తోంది. సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్లకు గౌరవప్రదమైన ఉపాధిని కల్పించి, వారిని  హైడ్రా ఈగిల్ టీమ్ లో భాగస్వామ్యం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. 

ఒకప్పుడు బస్టాండ్లు, సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేస్తూ, సమాజం నుంచి అవహేళనలు ఎదుర్కొన్న ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో  హైడ్రా సరికొత్త వెలుగులు నింపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఫలితంగా, నేడు 16 మంది ట్రాన్స్‌జెండర్లు  11 మంది ట్రాన్స్ మహిళలు, 5 మంది ట్రాన్స్ పురుషులు  ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిని ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి  హైడ్రా ఈగిల్ టీమ్ లో చేర్చుకోవడం, వారికి ఒక గౌరవప్రదమైన వృత్తిని, గుర్తింపును అందించింది.

అవహేళనలు దాటి.. గౌరవం దిశగా 

 ఒకప్పుడు మేము బతకడానికి అడుక్కునేవాళ్లం. ఎక్కడికి వెళ్లినా ప్రజలు మమ్మల్ని హేళన చేసేవారు. కానీ ఈరోజు హైడ్రా యూనిఫాం ధరించి బయటకు అడుగుపెడితే, జనం మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. సార్.. మేడం.. అని సంబోధిస్తున్నారు అని ఈగిల్ టీమ్ సభ్యురాలు తాన్షీ రాయ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమాజం తమకు ఇవ్వని గౌరవాన్ని, గుర్తింపును హైడ్రా ఉద్యోగం ఇచ్చిందని రుచిత వంటి సభ్యులు గర్వంగా చెబుతున్నారు. భిక్షాటన అనే ముద్రను చెరిపేసి,  రక్షకులు  అనే కొత్త ముద్రను వీరు సొంతం చేసుకున్నారు.

 ప్రభుత్వ భూములకు కాపలాదారులు 

వీరు కేవలం పేరుకే ఉద్యోగంలో లేరు.  అత్యంత కష్టతరమైన విధులను నిర్వహిస్తూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. ఐలాపూర్‌లోని  862 ఎకరాల ప్రభుత్వ భూమిని  కాపాడటం నుంచి, మాదాపూర్‌లోని ఈదులకుంట చెరువును ఆక్రమణల బారి నుంచి రక్షించడం వరకు ఈగిల్ టీమ్ సభ్యులు ముందు వరుసలో నిలబడుతున్నారు. చలి, ఎండ అని చూడకుండా ప్రభుత్వ ఆస్తులను కంటికి రెప్పలా కాపాడుతూ, ఆక్రమణదారులకు సింహస్వప్నంగా మారుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో తమదైన ముద్ర వేస్తున్నారు. 

 సామాజిక మార్పుకు నాంది 

ట్రాన్స్‌జెండర్లను కేవలం సామాజిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, లా అండ్ ఆర్డర్, ఆస్తుల రక్షణ వంటి బాధ్యతాయుతమైన విధుల్లో చేర్చుకోవడం ఒక గొప్ప సంస్కరణ. ఇది ఇతర విభాగాలకు కూడా ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది. తమకు అవకాశం ఇస్తే తాము కూడా సమాజానికి ఉపయోగపడే పనులు చేయగలమని ఈ 16 మంది నిరూపిస్తున్నారు. వీరికి ప్రభుత్వం అందిస్తున్న వేతనం మాత్రమే కాదు, సమాజంలో దక్కుతున్న గౌరవం వారి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది.
 
 అవకాశం మనిషి జీవితాన్ని మార్చుతుంది.. గౌరవం మనిషి వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది  అనే మాటను హైడ్రా ఈగిల్ టీమ్ నిజం చేస్తోంది. హైదరాబాద్ నగర ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో ఈ ఈగిల్స్ ' చూపిస్తున్న తెగువ అభినందనీయం. ట్రాన్స్‌జెండర్ల పట్ల ఉన్న సామాజిక దృక్పథాన్ని మార్చడంలో హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget