అన్వేషించండి

HYDRA Demolitions: రంగనాథ్ ప్రభుత్వ ఏజెంట్ అని విమర్శలు! అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న హైడ్రా కమిషనర్!

HYDRAA Commissioner Ranganath | సంగారెడ్డి అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌లో దాదాపు 15వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాత్ తెలిపారు.

హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణ ప్రభుత్వానికి ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు లాయర్ ముఖీమ్ ఆరోపించారు. కుంటలు, చెరువులు, జలాశయాలు ఉంటే వాటి వద్ద FTL, బఫర్ జోన్లు నిర్ణయించి ప్రభుత్వ ఆస్తులను హైడ్రా పరిరక్షించాలి కానీ మిగతా పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైనా ఫిర్యాదులు ఇస్తే పోయి కూలగొట్టడమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. హౌసింగ్ సొసైటీ, హౌసింగ్ లే ఔట్స్ కనిపిస్తే వాటి మీద పడుతున్నారని, వాటితో డబ్బులు కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఇటీవల ఇంటర్వ్యూలో సైతం రంగనాథ్ చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు.

‘నోటీసులు ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. మీ ఇల్లు శికం భూముల్లో కట్టారని ఓ ఇంటర్వ్యూలో అడిగితే అది 40 ఏళ్ల కింద మా నాన్న కట్టారని రంగనాథ్ చెబుతున్నాడు. ఒవైసీ సోదరులు ఫాతిమా కాలేజీని చెరువు మధ్యలో కట్టినా చర్యలు తీసుకోవడం లేదు. మీరు అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారు, జైల్లో పెడతారని ఆందోళన చెందవద్దు. ధైర్యంగా ఉండకపోతే మీ భూములు లాక్కుని వ్యాపారం చేయాలని ప్లాన్ చేశారు. హైడ్రా ప్రభుత్వ అధికారిగా కాదు, ఓ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అమీన్ పూర్, ఐలాపురం, కిష్టారెడ్డిపేటలలో బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ ఫిక్స్ చేసిన తరువాత ఆ బిల్డింగ్స్ జోలికి పోవాలని కోర్టు సైతం హైడ్రాను ఆదేశించింది. కోర్టుల్లో కేసు ఉంది విచారణ జరుగుతుందని చెబితే, ఫిర్యాదు వచ్చిందనే సాకుతో కట్టడాలు అక్రమంగా కూల్చివేస్తున్నారని’ సుప్రీంకోర్టు లాయర్ ముఖీమ్ ఆరోపించారు. 

ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టుకున్నందుకే కూల్చివేతలు: రంగనాథ్

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపురంలో శనివారం హైడ్రా  చేపట్టిన కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఐలాపురంలోని భూములపై 1998 నుంచే హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఉన్నాయని, అయితే వాటిని బేఖాతరు చేస్తూ లాయర్ ముఖీమ్ అనే వ్యక్తి ప్రభుత్వ భూములను ఆక్రమించి ఫాంహౌస్‌ను నిర్మించుకున్నారని రంగనాథ్ తెలిపారు. కేవలం ఒక ఫాంహౌస్‌తో మొదలైన ఈ ఆక్రమణ, కాలక్రమేణా 40 ఎకరాలకు విస్తరించిందని రంగనాథ్ వివరించారు.

గత 20 ఏళ్లుగా ముఖీమ్ తన అనుచరులతో కలిసి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూదందాకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను అక్రమంగా ప్లాట్లుగా మార్చి, ఒక్కో 100 గజాల స్థలాన్ని సుమారు 10 లక్షల రూపాయలకు పేద ప్రజలకు విక్రయించి కోట్ల రూపాయలు గడించినట్లు ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే కాకుండా, సామాజిక మాధ్యమాల్లో హైడ్రా చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఐలాపురం కూల్చివేతలపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని రంగనాథ్ స్పష్టం చేశారు.

కాగా, శనివారం భారీ పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. ముఖీమ్  నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమని, ఆక్రమణదారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget