అన్వేషించండి

Hydra Latest News: కబ్జా చెర నుంచి పార్క్, ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా! 1500 కోట్ల విలువైన ల్యాండ్‌ సేఫ్‌!

Hydra Latest News: హైదరాబాద్‌ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తోంది. తాజాగా 1500 కోట్ల విలువైన భూములు కాపాడారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Hydra Latest News: భాగ్యనగరంలో ప్రభుత్వ భూములు, చెరువులు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన పార్కు స్థలాలను కబ్జా చేస్తూ అక్రమార్కులపై హైడ్రా తన ఉక్కుపాదం మోపుతోంది. అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కబ్జాకు గురైన ప్రభుత్వ ఆస్తులను వెలికి తీస్తూ, భూ మాఫియాకు గట్టి హెచ్చరికలు పంపుతోంది. తాజాగా నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన భారీ ఆపరేషన్లలో ఏకంగా 1500 కోట్ల రూపాయలకుపైగా విలువ చేసే ప్రభుత్వ భూములను, పార్కు స్థలాలను హైడ్రా అధికారులు ఆక్రమణలు చెర నుంచి విడిపించారు. స్వాధీనం చేసుకున్న ఈ భూముల చుట్టూ తక్షణమే ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడంతోపాటు , ఇవి ప్రభుత్వ ఆస్తులని తెలిపే బోర్డులను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. 

జంగంకుంటలో 700 కోట్ల భారీ ఆపరేషన్ 

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్‌ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదే క్రమంలో ఇక్కడి జంగంకుంట చెరువుపై కబ్జాదారుల కన్ను పడింది. సుమారు నాలుగు ఎకరాల మేర విస్తరించి ఉన్న ఈ కుంటను అక్రమార్కులు మట్టితో పూడ్చి వేసి, చదును చేశారు. ఆ స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో హైడ్రా రంగంలోకి దిగింది. 

రెవెన్యూ అధికారులో కలిసి సంయుక్తంగా నిర్వహించిన శాస్త్రీయ సర్వేలో ఇది ఆక్రమణ అని నిర్దారణ కావడంతో, హైడ్రా అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. సుమారు 700 కోట్ల విలువైన ఈ నాలుగు ఎకరాల  భూమిని కబ్జాదారుల నుంచి రక్షించి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు క్రిమినల్‌ కేసులు కూడా నమోదయ్యాయి. 

Image

Image

ImageImage

కొత్త చెరువుకు పునర్జీవం- అల్వాల్‌లో 8 ఎకరాల రక్షణ

అల్వాల్ మండల పరిధిలోని కొత్త చెరువు గత కొంతకాలంగా ఆక్రమణల కోరల్లో చిక్కుకుంది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వచ్చే సుమారు 8 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించి, అక్కడ ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్లు, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కేంద్రలను ఏర్పాటు చేశారు. దీని వల్ల చెరువు విస్తీర్ణం తగ్గడమే కాకుండా, ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల నీరు తీవ్రంగా కలుషితం అవుతుందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన హైడ్రా బృందాలు, ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. చెరువు శిఖం భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి, 8 ఎకరాల చెరువు భూమిని కాపాడురు. 

కాలనీల్లో పార్కు స్థలం స్వాధీనం 

ప్రజా మౌలిక సదుపాయాలు, గ్రీనరీ కోసం కేటాయించి పార్కు స్థలాను కూడా వదలని కబ్జాదారులపై హైడ్రా దృష్టి పెట్టింది. ఎల్బీనగర్‌ పరిధిలోని వనస్థలిపురం జక్కిడి నగర్ కాలనీలో గతంలో జీహెచ్‌ఎంసీకి గిఫ్ట్ డీడ్‌ రూపంలో అప్పగించిన 650 గజాల పార్కు స్థలాన్ని కొదరు వ్యక్తులు ఆక్రమించారు. అక్కడ ప్రహీ గోడ నిర్మించి, రేకుల షెడ్లను కూడా వేశారు. హైడ్రా అధికారులు ఆ నిర్మాణాలను కూల్చివేసి స్థలానికి ఫెన్సింగ్ వేశారు. 

Image

Image

Image

మౌలాలి సర్కిల్‌ పరిధిలోని రాధాకృష్ణ హౌసింగ్‌ కాలనీలో 450 గజాల పార్కు స్థలాన్ని ఆక్రమణల నుంచి రక్షించారు. ఇక్కడ కూడా స్థానిక ప్రజల అవసరాల కోసం కేటాయించిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా, అధికారులు అడ్డుకొని స్వాధీనం చేసుకున్నారు. 

హైడ్రా చేపట్టిన ఈ ఆపరేషన్లు కేవలం కూల్చివేతలకు పరిమితం కాలేదు. స్వాధీనం చేసుకున్న ప్రతి భూమి చుట్టూ కంచె వేసి, ఇవి ప్రభుత్వ ఆస్తులని బోర్డులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో మళ్లీ కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసే ఆక్రమణలకు సహకరించే వారిపై, కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు వేగవంతం చేశారు.  

Frequently Asked Questions

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?

హైడ్రా భాగ్యనగరంలో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కు స్థలాలను ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. అక్రమార్కులను తొలగించి, ఆస్తులను స్వాధీనం చేసుకుంటోంది.

కొత్త చెరువు విషయంలో హైడ్రా ఎందుకు స్పందించింది?

కొత్త చెరువును ఆక్రమించి, ప్లాస్టిక్ వ్యర్థాల కేంద్రాలను ఏర్పాటు చేయడంతో నీరు కలుషితమవుతుందని స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా స్పందించింది. 8 ఎకరాల చెరువు భూమిని స్వాధీనం చేసుకుంది.

జంగంకుంట చెరువు ఆక్రమణపై హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంది?

జంగంకుంట చెరువును మట్టితో పూడ్చి, ప్లాట్లుగా మార్చేందుకు ప్రయత్నించిన అక్రమార్కులను హైడ్రా అడ్డుకుంది. 700 కోట్ల విలువైన 4 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని, క్రిమినల్ కేసులు నమోదు చేయించింది.

పార్కు స్థలాల ఆక్రమణలపై హైడ్రా చర్యలు ఏమిటి?

వనస్థలిపురం, మౌలాలి ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన పార్కు స్థలాలను హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, ప్రభుత్వ ఆస్తులని బోర్డులు ఏర్పాటు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!
Advertisement

వీడియోలు

BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget