అన్వేషించండి

Balka Suman controversy: మిలిటెంట్ దాడులు చేద్దాం, ఆఫీసుల్ని తగులబెడదాం - బీఆర్ఎస్ కార్యకర్తలకు బాల్క సుమన్ పిలుపు వివాదాస్పదం

Singareni Bhavan attack call: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టాలని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

BRS Balka Suman controversy statements:  బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కార్చిచ్చు రాజేస్తున్నాయి. సింగరేణి సంస్థ పరిరక్షణ పేరుతో ఆయన ఇచ్చిన పిలుపు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలను, సింగరేణి భవన్‌ను తగులబెట్టాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
 
సింగరేణి సంస్థ పరిరక్షణ,  బొగ్గు గనుల వేలం అంశంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపుతోంది.   "మిలిటెంట్ తరహాలో దాడులు చేద్దాం, జీఎం ఆఫీసులను మరియు సింగరేణి భవన్‌ను తగలబెట్టండి, అవసరమైతే రైల్వే లైన్లను కూడా కోసి పడేయండి" అంటూ ఆయన అత్యంత వివాదాస్పద పిలుపునిచ్చారు. అంతేకాకుండా, "మీరు తగలబెడితే మళ్ళీ పైసలు కూడా అవే వస్తాయి" అంటూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని సమర్థించేలా మాట్లాడటం  కలకలం రేపుతోంది.   

ప్రభుత్వ ఆస్తులు ప్రజా ధనంతో నిర్మించినవని, రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ధ్వంసం చేయాలని పిలుపునివ్వడం నేరపూరిత చర్య అని పలువురు అభిప్రాయపడుతున్నారు. సింగరేణి భవన్ లాంటి కీలక కార్యాలయాలపై దాడులకు ప్రోత్సహించడం వల్ల పౌరుల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, అది హింసకు దారితీయకూడదని ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అంటున్నారు.  

బాల్క సుమన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. గతంలో కూడా బాల్క సుమన్ పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఈసారి ఏకంగా దాడులకు పిలుపునివ్వడం విమర్శలకు కారణం అవుతోంది.  

పోలీసులు బాల్క సుమన్ వ్యాఖ్యలపై నిశితంగా దృష్టి సారించారు. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలను పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Mancherial MLA Prem Sagar Rao: అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget