పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో ఇది 'సూపర్ ఎల్ నినో'గా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Published by: Raja Sekhar Allu

ఎల్ నినో కారణంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.

Published by: Raja Sekhar Allu

జూలై తర్వాత ఎల్ నినో ప్రభావం పెరిగి వర్షాలు తగ్గుముఖం పట్టవచ్చు.

Published by: Raja Sekhar Allu

దక్షిణాదిలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల సాగునీటి కొరత ఏర్పడవచ్చు.

Published by: Raja Sekhar Allu

తమిళనాడు ,కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాల్లో అకస్మాత్తుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

Published by: Raja Sekhar Allu

మే, జూన్ నెలల్లోనే కాకుండా వర్షాకాలంలో కూడా ఉక్కపోత, వేడి గాలులు ఎక్కువగా ఉండవచ్చు.

Published by: Raja Sekhar Allu

వర్షాలు తక్కువగా పడటం వల్ల దక్షిణాదిలోని కృష్ణా, కావేరి బేసిన్లలోని ప్రాజెక్టులకు ఇన్-ఫ్లో తగ్గుతుంది.

Published by: Raja Sekhar Allu

శీతాకాలంలో వచ్చే ఈశాన్య రుతుపవనాల వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల్లో అధిక వర్షాలు కురిపించే అవకాశం ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

రైతులు తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలని , ప్రభుత్వం నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

Published by: Raja Sekhar Allu

ఈ ఏడాది ఎల్ నినో వల్ల ఎండలు ఎక్కువగా ఉండి, వర్షాలు తక్కువగా పడవచ్చు; కానీ తీర ప్రాంతాల్లో అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది.

Published by: Raja Sekhar Allu