హెల్మెట్ ధరించడం వల్ల నిజంగానే జుట్టు ఊడిపోతుందా?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ట్రాఫిక్ పెరగడం, ప్రమాదాల కారణంగా హెల్మెట్ ధరించడం అవసరం మాత్రమే కాదు తప్పనిసరి కూడా.

Image Source: pexels

హెల్మెంట్ వాడకం పెరగడంతో పాటు, ప్రజల మనస్సుల్లో ఒక భయం కూడా ఏర్పడింది.

Image Source: pexels

కొంతమంది హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుందని నమ్ముతారు

Image Source: pexels

నిరంతరం టైట్ హెల్మెట్ ధరించడం వల్ల ట్రాక్షన్ అలోపేసియా సమస్య ఏర్పడవచ్చు

Image Source: pexels

జుట్టు రాలే సమస్యల్లో ఇది ఓ రకం. జుట్టు మూలాలపై నిరంతరం లాగడం, రాపిడి వలన సంభవిస్తుంది

Image Source: pexels

హెల్మెట్బి గుతుగా ఉన్నప్పుడు, అది కొన్ని భాగాలపై ఒత్తిడిని కలిగిస్తుంది, దీనివల్ల వెంట్రుకల కుదుళ్లు బలహీనపడటం ప్రారంభమవుతుంది.

Image Source: pexels

అంతేకాకుండా, హెల్మెట్ లోపల పేరుకుపోయే చెమట, వేడి , సహజ నూనెలు స్కాల్ప్ ను ప్రభావితం చేస్తాయి, దీనివల్ల జుట్టు వేగంగా రాలిపోవచ్చు.

Image Source: pexels

నిపుణులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చని అంటున్నారు

Image Source: pexels

హెల్మెట్ ధరించడానికి ముందు, రాపిడి , తేమ నుండి రక్షణ కోసం కాటన్ లేదా చెమట పీల్చుకునే టోపీని ధరించండి.

Image Source: pexels

మీ జుట్టును శుభ్రంగా , చిన్నగా ఉంచుకుంటే, హెల్మెట్ ధరించడం వల్ల మీ జుట్టుకు ఎటువంటి హాని జరగదు.

Image Source: pexels