అన్వేషించండి

HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!

Puppalguda Narsingi Lake Encroachments: గండిపేట ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. చెరువు మధ్యలో నిర్మించిన కట్టడాలను తొలగించి, రూ. 5,500 కోట్ల విలువైన భూమికి ఫెన్సింగ్ వేశారు.

Mushkin Cheruvu FTL boundaries HYDRAA:  హైదరాబాద్‌ జలవనరుల పరిరక్షణే ధ్యేయంగా దూసుకుపోతున్న  హైడ్రా  మరో భారీ ఆపరేషన్‌తో సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాల్‌గూడ - నార్సింగి పరిధిలోని  ముష్కిన్ చెరువు  ఆక్రమణలపై శనివారం ఉక్కుపాదం మోపింది. సుమారు 5,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగి, చెరువు మధ్యలో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు.  
 
ముష్కిన్ చెరువు పరిరక్షణ పేరుతో జరిగిన ఒక భారీ భూకబ్జా యత్నాన్ని హైడ్రా అధికారులు చాకచక్యంగా అడ్డుకున్నారు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత  నిధుల కింద చెరువును అభివృద్ధి చేస్తామంటూ ముందుకు వచ్చి, అసలు కథ నడిపింది. చెరువు మధ్యలో ఏకంగా ఒక ఆనకట్ట  వంటి కట్టడాన్ని నిర్మించి, సుమారు  34.21 ఎకరాల  జలవనరును ఆక్రమించుకునేందుకు ప్రయత్నించింది. నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా, వాటిని పూర్తిగా తొలగించి చెరువుకు పూర్వవైభవం తెచ్చే పనిలో పడింది.

 రూ. 5,500 కోట్ల భూమికి రక్షణ కవచం 

హెచ్‌ఎండిఏ  లెక్కల ప్రకారం ముష్కిన్ చెరువు  52.20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది 59.11 ఎకరాల వరకు ఉండగా, ఇందులో 20.23 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉంది. ఈ భూమిపై కన్నేసిన రియల్టర్లు, పేదల పేరుతో అక్కడ గుడిసెలు వేయించి కబ్జాకు తెరలేపారు. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ అక్షరాలా 5,500 కోట్ల రూపాయలు *. ఇంతటి భారీ విలువైన ప్రభుత్వ ఆస్తిని కాపాడేందుకు హైడ్రా శనివారం నుంచి చెరువు చుట్టూ ఫెన్సింగ్   వేసే పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది.

 పేదల ముసుగులో రియల్టర్ల మాయాజాలం 

చెరువు ఎఫ్‌టిఎల్  పరిధిలో గుడిసెలు వేయించి, ఆ భూమిని ఆక్రమించుకోవాలని చూసిన రియల్టర్ల వ్యూహానికి హైడ్రా చెక్ పెట్టింది. అక్కడ నివసిస్తున్న వారికి గత రెండు నెలల క్రితమే నోటీసులు ఇచ్చి, ఖాళీ చేసేందుకు సమయం ఇచ్చింది. హైడ్రా హెచ్చరికలతో గుడిసెల్లోని వారు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్లిపోవడంతో, అధికారులు శనివారం ఎలాంటి ఆటంకం లేకుండా క్లీన్ స్వీప్ చేశారు. చెరువు మధ్యలో పోసిన మట్టి కట్టలను, అక్రమంగా నిర్మించిన ఎంబ్యాంక్‌మెంట్‌ను జేసీబీలతో తొలగించి నీటి ప్రవాహానికి అడ్డులేకుండా చేశారు.

 నిబంధనల ఉల్లంఘనపై ఉక్కుపాదం 
 
చెరువు అభివృద్ధి పనులు చేపట్టిన సంస్థ పర్యావరణ నిబంధనలను ఘోరంగా ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. చెరువు విస్తీర్ణాన్ని తగ్గించి, మిగిలిన భూమిని కమర్షియల్ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని హైడ్రా వర్గాలు తెలిపాయి. ఎఫ్‌టిఎల్ సరిహద్దులను నిర్ణయించి, ఏ ఒక్క అంగుళం భూమి కూడా అక్రమార్కుల పాలు కాకుండా పక్కాగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భూమితో పాటు ఎక్సల్ పట్టా భూముల్లో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కూడా హైడ్రా దృష్టి సారించింది.

ముష్కిన్ చెరువు రక్షణ కోసం హైడ్రా చేపట్టిన ఈ భారీ ఆపరేషన్ రియల్ ఎస్టేట్ మాఫియాకు గట్టి హెచ్చరికగా మారింది. చెరువుల పునరుద్ధరణ పేరుతో భూములను మింగేయాలని చూస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ఘటన నిరూపించింది. శనివారం రోజంతా సాగిన ఈ ఆపరేషన్‌తో గండిపేట పరిసర ప్రాంతాల్లో భూబకాసురుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నగరంలోని మరిన్ని జలవనరులను కాపాడేందుకు హైడ్రా తన తదుపరి లక్ష్యాలను సిద్ధం చేసుకుంటోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget