అన్వేషించండి

Regional Sentiment politics: తెలంగాణలో మళ్లీ ప్రాంతీయ మంట - పవన్, చంద్రబాబులే టార్గెట్.. వ్యూహం ఎవరిది? ప్రజా స్పందన ఎలా ఉంది?

Targeting Pawan Kalyan in Telangana politics: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయ సెంటిమెంట్ తెరపైకి వస్తోంది. నాగేశ్వర్ ఏపీ రాజకీయాలు చేసిన వ్యాఖ్యల వివాదం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది.

Revanth Reddy vs regional sentiment 2026: తెలంగాణ రాజకీయాల్లో  మరోసారి ప్రాంతీయ సెంటిమెంట్ తెరపైకి వస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చేసిన విశ్లేషణలతో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్న పొలిటికల్ గ్రౌండ్ లా కనిపిస్తున్నాయి.  
 
ఏపీ వివాదం.. తెలంగాణ సమస్యగా మలుపు 

ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం కొత్తేమీ కాదు. అయితే, ఈసారి ఆయన వ్యాఖ్యలపై ఏపీ నేతల స్పందనను సాకుగా చూపి, తెలంగాణలో ఒక వర్గం నేతలు దీనిని తెలంగాణపై దాడి గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ నేతలు తెలంగాణ వ్యక్తులను గౌరవించడం లేదనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా మళ్లీ పాత సెంటిమెంట్‌ను రగిలించవచ్చని కొన్ని రాజకీయ శక్తులు భావిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం వెనుక గ్రేటర్ హైదరాబాద్‌లోని సెటిలర్ల ఓటు బ్యాంకును చీల్చడం లేదా ప్రభావితం చేయడం అనే బలమైన వ్యూహం కనిపిస్తోంది.

 బీఆర్ఎస్ సైలెంట్  దూకుడు - సోషల్ మీడియా వార్

బీఆర్ఎస్ పార్టీకి చెందిన అగ్రనేతలు ఈ వివాదంపై నేరుగా మైకుల ముందుకు రాకపోయినప్పటికీ, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగాలు మాత్రం అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. పవన్ కల్యాణ్ గతంలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను, చంద్రబాబు పాత రాజకీయాలను తవ్వి తీస్తూ రీల్స్, పోస్టులతో హోరెత్తిస్తున్నారు. నేరుగా విమర్శిస్తే నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుందని భావించి, సోషల్ మీడియా ద్వారా  సెంటిమెంట్ మంట ను రాజేసే బాధ్యతను కింది స్థాయి కేడర్‌కు అప్పగించినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ నేతలకు లొంగిపోతోందనే ముద్ర వేయడం ద్వారా రేవంత్ రెడ్డి సర్కార్‌ను ఇరకాటంలో పెట్టడమే వీరి ప్రధాన ఉద్దేశం.

 ఎన్టీఆర్ విగ్రహం నుంచి నాగేశ్వర్ దాకా 

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసి టీడీపీ సానుభూతిపరులకు దగ్గరయ్యే ప్రయత్నం చేయగా, దానికి విరుగుడుగా ఇప్పుడు నాగేశ్వర్ ఇష్యూను విపక్షాలు వాడుకుంటున్నాయి. "తెలంగాణ గడ్డపై ఏపీ నేతల పెత్తనం ఏంటి?" అనే పాత నినాదాన్ని మళ్లీ వాడుతూ, రేవంత్ రెడ్డిని  ఏపీ ప్రయోజనాల పరిరక్షకుడి గా చూపించే ప్రయత్నం జరుగుతోంది. పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించడం ద్వారా ఆయన అభిమానులను రెచ్చగొట్టి, తద్వారా వచ్చే ఘర్షణ వాతావరణాన్ని రాజకీయంగా వాడుకోవాలనేది ఈ  షాడో పాలిటిక్స్  అసలు ప్లాన్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ప్రజా స్పందన ఉంటుందా? 

 దశాబ్దం క్రితం ఉన్నంత తీవ్రస్థాయిలో ఇప్పుడు సెంటిమెంట్ పనిచేస్తుందా అనేది సందేహమే. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత ఇప్పుడు ఉద్యోగాలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాల గురించి ఆలోచిస్తున్నారు. కేవలం వ్యక్తుల మధ్య జరిగే మాటల యుద్ధాన్ని ప్రాంతీయ పోరాటంగా మార్చాలని చూస్తున్న వారి ఉద్దేశాన్ని సామాన్యులు గమనిస్తున్నారు. గత పదేళ్లలో ఏపీ-తెలంగాణ మధ్య సత్సంబంధాలు పెరగడం, వ్యాపార లావాదేవీలు విడదీయలేని విధంగా ఉండటంతో.. ఈ కృత్రిమ సెంటిమెంట్ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   ఏపీ రాజకీయాలపై నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం అక్కడి నుంచే రావాలి కానీ, దానిని తెలంగాణ సమస్యగా మార్చడం అంటే అభివృద్ధి అజెండా నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమే అవుతుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. 
 
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈ  పవన్-బాబు  టార్గెట్ పాలిటిక్స్ మరింత ముదిరే అవకాశం ఉంది. అయితే, ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్న తరుణంలో.. కేవలం సెంటిమెంట్‌ను నమ్ముకుని చేసే రాజకీయాలు ఎంతవరకు ఫలిస్తాయో కాలమే నిర్ణయించాలి.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget