పట్టుచీర, పట్టుపంచె కట్టుకుని భగవంతుడి సన్నిధానానికి వెళ్లకుండా ఉండడమే మంచిదని చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్తలు
ఓ పట్టు వస్త్రం తయారవ్వాలంటే ఎన్నో పట్టుపురుగులు ప్రాణార్పణం చేస్తాయి
మల్బరీ ఆకులను పెట్టి పట్టుపురుగును బాగా పెంచుతారు...
పట్టుపురుగు లోపల ఉన్నప్పుడే పట్టుకాయలన్నీ మరుగు నీళ్లలో పడేస్తారు..
ఆ మరుగునీట్లోంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి గిలగిల కొట్టుకుంటుంది
బయటకు వెళ్లే మార్గం లేక పట్టుపురుగు తాను అల్లుకున్న గూడులోనే చనిపోతుంది
ఆ తర్వాత పట్టుకాయలో దారాన్ని తీసేసి పురుగును బయటపడేస్తారు..ఓ ప్రాణార్పణంతో తయారైన వస్త్రం అది
అందుకే.. పట్టు పంచె, పట్టుచీర కట్టుకుని వెళ్లేకన్నా నూలువస్త్రం ధరించి ఆలయానికి వెళ్లడం మంచిది