అన్వేషించండి

Karthika Puranam Day-6 October 27: కార్తీక మహాపురాణం కథ DAY-6 ( అక్టోబర్ 27): దీపదానం చేస్తే మోక్షం తథ్యం! ఆ పిసినారి వితంతువు పుణ్యం ఎలా పొందిందో తెలుసుకోండి!

Karthika Puranam: కార్తీకమాసంలో కార్తీకపురాణం చదువుతారు. రోజుకో కథ చొప్పున 30 రోజులు 30 కథలు. ఆరవ రోజు చదువుకోవాల్సిన కథ ఇది

అక్టోబరు 27  కార్తీకపురాణం ఆరవ అధ్యాయం 

వశిష్ఠుడు జనకమహారాజుతో ఇలా చెబుతున్నారు..
ఓ జనకమహారాజా కార్తీక మాసమందు భక్తితో నెలంతా  హరికి కస్తూరి, గంధం, పంచామృతాలతోను స్నానము చేయించేవారు పదివేల అశ్వమేధ యాగముల ఫలమును పొంది తుదకు పరమపదాన్ని పొందుతారు. కార్తీకమాసంలో సాయంకాలం హరిసన్నిధిలో దీప దానము ఆచరించువారు విష్ణులోకమును బొందుదురు. ఈ నెలలో దీపదానం చేసినవారు జ్ఞానవంతులై విష్ణులోకాన్ని పొందుతారు. కార్తీకమాసంలో ప్రత్తిని చక్కగా ధూళిలేకుండా విడదీసి వత్తినిచేసి బియ్యపు పిండితోగాని, గోధుమపిండితోగాని పాత్రనుజేసి ఆవునెయ్యివేసి వత్తినితడిపి వెలిగించి వేదబ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఈ నెలంతా రోజూ ఈ విధానాన్ని అనుసరించి నెలచివర్లో వెండి ప్రమిదలో బంగారువత్తిని ఉంచి బియ్యపు పిండి మధ్యలో ఉంచి  పూజించి నివేదించి ఆ తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి దీపదానం చేయాలి.  

సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం |
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ||

మంత్రార్థము దీపం సర్వజ్ఞానదాయకము, సమస్త సంపత్ప్రదాయకం. అందుకే దీపదానమును జేయుచున్నాను. ఈ దీనివల్ల నాకు నిరంతరముశాంతి గలుగుగాక. ఈ ప్రకారంగా స్త్రీగాని, పురుషుడుగాని కార్తికమాసంలో అనుసరిస్తే అనంతఫలం పొందుతారు. కార్తీక దీపదానమువలన మనోవాక్కాయ ములచేత చేయబడిన తెలిసి తెలియక జేసిన పాపములు నశించును. దీనికి సంబంధించి ఓ ఇతిహాసం  చెబుతాను వినమని చెప్పసాగెను.
 
లుబ్ధ వితంతువుకు స్వర్గ ప్రాప్తి
 
పూర్వ కాలంలో ద్రవిడ దేశంలో ఓ గ్రామంలో ఓ స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొన్నిరోజులకే భర్త చనిపోయెను. సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు. అందుకే ఆమె ఇతరుల ఇండ్లలో దాసిపని చేస్తూ అక్కడే భోజనం చేసేది.  వారి సంతోషంతో ఏవైనా వస్తువులిస్తే వాటిని ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకుని ఆ సొమ్మును వడ్డీలకు ఇచ్చి ధనం కూడబెట్టేది. ఎవరైనా దొంగిలించిన వస్తువులను కూడా తక్కువ ధరకు కొని వాటిని ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము కూడబెట్టేది. ఈ విధముగా కూడబెట్టిన ధనాన్ని వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇంట్లో దాసిపనులు చేస్తూ రోజులు గడిపేసేది. ఎంత సంపాదించినా కానీ ఒక్కరోజైనా భగవంతుని ధ్యానం, ఉపవాసం అనేదే ఆచరించేది కాదు. వ్రతాలు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూసి అవహేళన చేసేది. బిచ్చగాడికి కూడా బిచ్చం వేసేది కాదు. అలా కొంతకాలం తర్వాత ఓ రోజు ఓ  బ్రాహ్మణుడు శ్రీరంగంలో శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గమధ్యంలో ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చారు. ఆ రోజు అక్కడే ఉన్న ఓ సత్రంలో బసచేశారు. ఆగ్రామంలో మంచిచెడులు తెలుసుకుని ఆ పసినారి స్త్రీ గురించి కూడా తెలుసుకుని అక్కడకు వెళ్లారు. 

"అమ్మా! నా హితవచనము విను. మన శరీరం శాశ్వతంకాదు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో అయినా మృత్యువు మనల్ని తీసుకుని పోతుంది.  పంచభూతాలు, సప్తధాతువులతో నిర్మించిన ఈ శరీరంలో ప్రాణం - జీవం  పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగును. ఇలాంటి శరీరాన్ని నిత్యం అని నువ్వు భ్రమిస్తున్నావు, ఇది అజ్ఞానము తల్లి ఆలోచించుకో అని చెప్పారు. తినక, దానం చేయక సంపాదించిన ధనాన్ని ఇప్పటికైనా పేదలకు దానం చేయమని చెప్పారు. ఇన్నాళ్లు చేసిన పాప పరిహారార్థం కార్తీకమాసంలో దానధర్మాలు చేసి పుణ్యం సంపాదించుకోమని చెప్పారు. దానధర్మాలు చేసి కార్తీకమాసంలో బ్రాహ్మణులకు భోజనం పెడితే వచ్చే జన్మలో నీవు పుణ్యవతిపై సకల సౌభాగ్యాన్ని పొందుతావని ఉపదేశించారు. కార్తికమాసంలో ప్రాతస్స్నానమాచరించి బ్రాహ్మణునకు దీపదానము చేయుమని చెప్పారు.  ఆ మాటలు విన్న ఆ పిసినారి వితంతువు మనసు మార్చుకుంది. కార్తీకవ్రతం చేసింది..సూర్యోదయసమయాన స్నానం, హరిపూజ, దీపదానము,  పురాణ శ్రవణం చేసింది. మరణానంతరం విమానమెక్కి శాశ్వత స్వర్గసుఖం పొందింది.

కాబట్టి కార్తికమాసమందు అన్నిటికన్నా దీపదానం అధిక పుణ్య ప్రదం అని చెప్పారు వశిష్ఠుడు.
 
స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరో అధ్యాయం సమాప్తం

గమనిక: పండితులు చెప్పినవివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

( రోజుకో కథ చదువుకుంటే మంచిది..ముందు రోజు కథ చదువుకోవడానికి ఆటంకం వస్తే.. ఆ తర్వాత రోజు అన్ని కథలు కలిపి చదువుకోవచ్చు)

కార్తీక మహాపురాణం కథ DAY-1: కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యం!

కార్తీక మహాపురాణం కథ DAY-2 : కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది?

కార్తీక మహాపురాణం కథ DAY-3 : బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం

కార్తీక మహాపురాణం కథ DAY-4 : కార్తీకమాసంలో దీపారాధనతో మోక్షం ఎలా సాధ్యం!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Advertisement

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget