అన్వేషించండి

PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు

Andhra Pradesh News | దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలవుతోంది. ఆర్సెల్లార్ మిత్తల్, నామ్ టెక్ భాగస్వామ్యంతో విశాఖ ఐటీఐని హబ్ అండ్ స్పోక్ విధానంలో ఆధునీకరించనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏపీలో పారిశ్రామిక, సాంకేతిక అభివృద్ధికి పీఎం సేతు పథకం ప్రారంభం.
  • విశాఖ ఐటీఐ ఆధునీకరణకు ఆర్సెల్లార్ మిత్తల్, నామ్ టెక్ భాగస్వామ్యం.
  • కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాల లక్ష్యంతో ఐటీఐ విద్యార్థులకు శిక్షణ.
  • హబ్ అండ్ స్పోక్ విధానంతో అత్యాధునిక సాంకేతిక విద్య అందుబాటులోకి.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, సాంకేతికంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా పీఎం సేతు (PM SETU Scheme) పథకాన్ని ఏపీలో అమలు చేసేందుకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో భాగంగా దేశవ్యాప్తంగా ఐటీఐ (ITI) లను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీకి ఈ సరికొత్త ప్రతిష్టాత్మక పథకం అమలు చేసే తొలి అవకాశాన్ని కల్పించింది.

ఈ పథకం కింద విశాఖపట్నం ఐటీఐ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ ఐటీఐ క్లస్టర్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆర్సెల్లార్ మిత్తల్ (Arcelor Mittal) భాగస్వామ్యంతో విశాఖ ఐటీఐ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఈ ఆధునికీకరణ ప్రక్రియకు ప్రముఖ విద్యా సంస్థ నామ్ టెక్ (NAMTECH) అకడమిక్ భాగస్వామిగా వ్యవహరించనుంది. దీని ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు లభించనున్నాయి.

Also Read: JEE Advanced Answer Key: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు విద్యార్థులకు ఛాన్స్ 

కోర్సు పూర్తి కాగానే ఉద్యోగాలే లక్ష్యం
దేశవ్యాప్తంగా ఉన్న ఐటీఐల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 60 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పీఎం సేతు (PM SETU) పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ఐటీఐ విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా, కోర్సు పూర్తికాగానే తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించడం. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం కోసం దీనిని డిజైన్ చేశారు.

ఈ పథకంలో భాగంగా హబ్ అండ్ స్పోక్ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ సరికొత్త మోడల్ ద్వారా ఐటీఐ విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ (Technical Training) అందిస్తారు. పరిశ్రమలకు నేరుగా ఉపయోగపడే అత్యాధునిక కోర్సులు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈ విధానం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ చొరవతో ఏపీలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం సేతు పథకాన్ని దేశంలో తొలిసారిగా ఏపీలోనే అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. 

 

Frequently Asked Questions

పీఎం సేతు పథకం అంటే ఏమిటి?

పీఎం సేతు పథకం అనేది ఐటీఐ (ITI) లను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీని ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించి, కోర్సు పూర్తి కాగానే ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం.

పీఎం సేతు పథకం దేశంలో తొలిసారిగా ఎక్కడ అమలు చేయబడుతోంది?

పీఎం సేతు పథకం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయబడుతోంది. విశాఖపట్నంలోని ఐటీఐ అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది.

పీఎం సేతు పథకం ద్వారా విద్యార్థులకు ఎలాంటి శిక్షణ లభిస్తుంది?

ఈ పథకం ద్వారా విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ (Technical Training) అందిస్తారు. పరిశ్రమలకు నేరుగా ఉపయోగపడే అత్యాధునిక కోర్సులు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అందుబాటులోకి రానున్నాయి.

పీఎం సేతు పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించారు?

దేశవ్యాప్తంగా ఉన్న ఐటీఐల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 60 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పీఎం సేతు పథకాన్ని రూపొందించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల రాజకీయం- 34% టీడీపీ ఫార్ములాపై వైసీపీ నిలబడుతుందా?
ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల రాజకీయం- 34% టీడీపీ ఫార్ములాపై వైసీపీ నిలబడుతుందా?
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
వృషభ రాశి వారఫలాలు అక్టోబర్ 12-18 : శరన్నవరాత్రిలో గ్రహాల కీలక ప్రభావం!
వృషభ రాశి వారఫలాలు అక్టోబర్ 12-18 : శరన్నవరాత్రిలో గ్రహాల కీలక ప్రభావం!

వీడియోలు

India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget