అన్వేషించండి

PMUY Free Gas Cylinder Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్.. ఏడాదికి 9 సిలిండర్లు, రూ.300 సబ్సిడీ.. PMUY అర్హతలు, అప్లై ప్రాసెస్ ఇదే!

PMUY Free Gas Cylinder Scheme: కేంద్ర ప్రభుత్వం పీఎం ఉజ్వల యోజన పథకం కింద పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అందిస్తుంది. అలాగే ఏడాదికి 9 సిలిండర్లపై రూ.300 చొప్పున సబ్సిడీ ఇస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పేద కుటుంబాలకు కేంద్రం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అందిస్తోంది.
  • కొత్త కనెక్షన్‌కు రూ.1600 ఆర్థిక సహాయం అందిస్తుంది.
  • లబ్ధిదారులకు సంవత్సరానికి 9 సిలిండర్లపై రూ.300 సబ్సిడీ.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది.

PMUY Free Gas Cylinder Scheme: పేద కుటుంబాలకు, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం "ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం" ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌నే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అంటారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏడాదికి 9 సిలిండర్లపై రూ.300 చొప్పున సబ్సిడీ ఇస్తుంది. కట్టెల పొయ్యిల నుంచి విముక్తి కల్పించి, మహిళల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ పథకం అమలు చేస్తున్నారు. కొత్త సిలిండర్ కనెక్షన్‌పై రూ.1600 ఆర్థిక సాయం అందిస్తుంది. 

2016 మే 1న ప్రధాని మోదీ ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించారు. ఉజ్వల యోజన మొదటి దశలో దేశంలో 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లను ఇచ్చారు. రెండో దశలో (UJJWALA 2.0) డిసెంబర్ 2024 వరకు 2.34 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉజ్వల యోజన పథకం ద్వారా 12 కోట్లకు పైగా కుటుంబాలు ఎల్పీజీ కనెక్షన్లు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సిలండర్ రూ.950 ఉంది. కేంద్రం దీనిపై రూ.300 రాయితీ ఇస్తుంది. అంటే ఉజ్వల యోజన లబ్దిదారులు రూ.650 చెల్లిస్తే సరిపోతుంది.  

Also Read: AC ఆన్‌లో ఉన్నా Petrol ఖర్చులు తగ్గించుకోవచ్చు.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ అర్హులు

  • లబ్ధిదారు భారతీయ మహిళ అయి ఉండాలి.
  • 18 ఏళ్ల వయస్సు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
  • ఎస్ఈసీసీ కుటుంబాలు
  • ఎస్సీ/ఎస్టీ కుటుంబాలు
  • పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారులు
  • AAY కార్డుదారులు 
  • అటవీ ప్రాంత నివాసులు
  • తేయాకు తోట కార్మికులు 
  • 14 పాయింట్ల డిక్లరేషన్ సర్పించాల్సి ఉంటుంది.  
  • గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండకూడదు. 

అవసరమైన పత్రాలు  

  • KYC ఫారం
  • దరఖాస్తుదారు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు
  • బ్యాంకు ఖాతా వివరాలు  
  • రేషన్ కార్డు లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పత్రం
  • వలసదారుల కోసం Self- Declaration  

Also Read: జూన్ 2 నుంచి మీ అకౌంట్‌లోకి డబ్బులు.. చేయూత పథకం అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా

ఎలా దరఖాస్తు చేయాలి?

మీ సమీపంలోని LPG పంపిణీదారుడిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.  

Step 1: మీ సమీపంలోని LPG పంపిణీదారుని నుంచి దరఖాస్తు ఫారమ్‌ను తీసుకోండి లేదా అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Step 2: అప్లికేషన్ ఫారమ్‌లో వివరాలు పూర్తి చేసి, అవసరమైన పత్రాలను సబ్మిట్ చేయండి.

Step 3: పూర్తి చేసిన అప్లికేషన్, అవసరమైన పత్రాలను మీ ప్రాంతంలోని LPG పంపిణీదారుడికి సమర్పించండి.

Step 4: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (OMC) మీ అప్లికేషన్‌ను ధృవీకరిస్తాయి.  

Stpe 5: వెరిఫికేషన్ పూర్తైన తర్వాత మీకు ఉచిత LPG కనెక్షన్‌ను జారీ చేస్తారు. 
 

ఉజ్వల కనెక్షన్ e-KYC తప్పనిసరి

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన వారు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా e-KYC చేయించుకోవాలి. ఇందుకోసం బ్యాంక్ ఖాతా నెంబర్, IFSC కోడ్, BPL సర్టిఫికేట్ లేదా SECC జాబితాలో పేరు ఉండాలి.  

ఏపీ ప్రభుత్వం ఉజ్వల యోజన లబ్దిదారులకు ఏడాది 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది. 

Also Read: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
 

Frequently Asked Questions

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) అంటే ఏమిటి?

పేద కుటుంబాలలోని మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. దీనినే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అంటారు.

PMUY పథకం కింద లబ్ధిదారులకు ఎంత ఆర్థిక సహాయం లభిస్తుంది?

ఈ పథకం కింద కొత్త సిలిండర్ కనెక్షన్‌కు రూ.1600 ఆర్థిక సహాయం లభిస్తుంది. అలాగే, ఏడాదికి 9 సిలిండర్లపై రూ.300 చొప్పున సబ్సిడీ ఇస్తారు.

PMUY పథకం కోసం ఎవరు అర్హులు?

18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ మహిళలు, ESC/ST కుటుంబాలు, AAY కార్డుదారులు, అటవీ ప్రాంత నివాసులు, తేయాకు తోట కార్మికులు అర్హులు.

PMUY పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

మీరు సమీపంలోని LPG పంపిణీదారుడిని సంప్రదించి దరఖాస్తు ఫారమ్ తీసుకొని, అవసరమైన పత్రాలతో పాటు సమర్పించవచ్చు.

PMUY లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా ఏమైనా అందిస్తుందా?

అవును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అధికారం కోసం కాదు, బాధ్యత కోసమే కూటమి: తిరుపతి సభలో పవన్ కళ్యాణ్
అధికారం కోసం కాదు, బాధ్యత కోసమే కూటమి: తిరుపతి సభలో పవన్ కళ్యాణ్
Telangana Congress Internal Conflicts: తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
Rains in Andhra Pradesh and Telangana: ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
Breaking News:ఒమన్‌ తీరంలో నౌకపై జరిగిన దాడిలో విశాఖ వాసి మృతి
ఒమన్‌ తీరంలో నౌకపై జరిగిన దాడిలో విశాఖ వాసి మృతి
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
King Maker CBN: పాతాళం నుంచి శిఖరాగ్రానికి - రెండేళ్లలోనే దేశ రాజకీయాన్ని శాసించే పవర్‌ఫుల్ లీడర్‌గా చంద్రబాబు ‘రైజ్’ !
పాతాళం నుంచి శిఖరాగ్రానికి - రెండేళ్లలోనే దేశ రాజకీయాన్ని శాసించే పవర్‌ఫుల్ లీడర్‌గా చంద్రబాబు ‘రైజ్’ !
Raghava Lawrence : మీరు ఎస్ అంటేనే... లేకుంటే... - పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్
మీరు ఎస్ అంటేనే... లేకుంటే... - పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్
US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
Telangana Congress Internal Conflicts: తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
Vijay Deverakonda: విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
US Military Attack: పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Embed widget