DAY-NRLM పథకం కింద డ్వాక్రా మహిళలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల వరకు రుణాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా MSME యూనిట్ల ఏర్పాటుకు ఈ రుణాలు పొందవచ్చు.
DAY NRLM Scheme: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల లోన్.. వడ్డీ రాయితీ కూడా!
DAY NRLM Scheme: డ్వాక్రా సంఘాలకు దీనదయాల్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద రూ.10 లక్షల వరకు తక్కువ వడ్డీ రుణాలు అందిస్తుంది కేంద్రం.

- DAY-NRLM పథకం కింద మహిళలకు రూ. 10 లక్షల వరకు రుణాలు.
- MSME యూనిట్ల ఏర్పాటుకు, ఫుడ్ ప్రాసెసింగ్‌కు రుణాలు పొందవచ్చు.
- 6 నెలలు యాక్టివ్‌గా ఉన్న డ్వాక్రా సంఘాలు అర్హులు.
- వెనుకబడిన జిల్లాల్లో 7% వడ్డీ రాయితీతో రుణాలు లభిస్తాయి.
DAY NRLM Scheme: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు, సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త అవకాశాన్ని కల్పిస్తుంది. దీనదయాల్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) కింద డ్వాక్రా మహిళలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల వరకు రుణాలు అందిస్తోంది. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ (MSME) యూనిట్ల ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకు రుణాలు పొందవచ్చు.
ఏ వ్యాపారాలకు లోన్ ఇస్తారు?
కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే మహిళలకు దీనదయాల్ అంత్యోదయ యోజన పథకం ఎంతో మేలు చేస్తుంది. ఈ పథకం కింద ఈ యూనిట్లు ఏర్పాటుకు రుణాలు అందిస్తారు.
- ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు
- నర్సరీలు, తేనె ఉత్పత్తి
- మునగ సాగు, మష్రూమ్స్ సాగు
- ఇతర స్వయం ఉపాధి పరిశ్రమలు
అర్హతలు
- ఈ పథకం కింద రుణాలు పొందేందుకు డ్వాక్రా మహిళలు ఈ అర్హతలు కలిగి ఉండాలి.
- డ్వాక్రా సంఘం బ్యాంకులో అకౌంట్ తెరిచిన తేదీతో సంబంధం లేకుండా, కనీసం గత 6 నెలలుగా సంఘం యాక్టివ్‌గా ఉండాలి.
- డ్వాక్రా సంఘాలు తప్పనిసరిగా ఐదు ఫార్ములాలు పాటించాలి. రెగ్యులర్ మీటింగ్‌లు, పొదుపు, పరస్పర రుణాలు, సకాలంలో తిరిగి చెల్లించడం, ఎప్పటికప్పుడు అకౌంట్ పుస్తకాలు అప్డేట్
- నాబార్డ్ గ్రేడింగ్ నిబంధనల ప్రకారం అర్హత కలిగి ఉండాలి. డ్వా్క్రా సంఘాల ద్వారా ఈ గ్రేడింగ్ ప్రక్రియ జరుగుతుంది.
- ప్రస్తుతం పనిచేయని సంఘాలను పునరుద్ధరించి, కనీసం 3 నెలల పాటు యాక్టివ్ గా కొనసాగిస్తే రుణాలు పొందేందుకు అర్హత సాధిస్తాయి.
వడ్డీ రాయితీలు
కేంద్రం గుర్తించిన 250 వెనుకబడిన జిల్లాల్లోని అన్ని మహిళా స్వయం సహాయక బృందాలు ఏడాదికి 7% రాయితీ రేటుతో రూ.3 లక్షల వరకు లోన్ పొందేందుకు అర్హులు అవుతారు. తమ ప్రస్తుత రుణాలపై SGSY కింద మూలధన రాయితీని పొందుతున్న SHG సంఘాలు ఈ పథకానికి అనర్హులు. ఈ జిల్లాల్లో సకాలంలో రుణం చెల్లించే మహిళా సంఘాలు 3% అదనపు వడ్డీ రాయితీకి కూడా పొందుతారు. అంటే అసలు వడ్డీ రేటు 4% మాత్రమే.
మిగిలిన జిల్లాల్లో DAY-NRLM పథకం కింద డ్వాక్రా గ్రూపులు సాధారణ రుణ రేటుతో రుణాలు పొందుతాయి. సకాలంలో తిరిగి చెల్లించే స్వయం సహాయక బృందాలకు, బ్యాంకు వడ్డీ రేటు, కేంద్రం నిర్ణయించిన 7% మధ్య ఉన్న తేడాను బట్టి రాయితీ నిర్ణయిస్తారు. ఈ రాయితీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డ్వాక్రా బృందాలకు అందిస్తాయి.
Also Read: లేబర్ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు
ఆర్బీఐ, నాబార్డ్ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు ఈ రుణాలను మంజూరు చేస్తాయి. రూ.10 లక్షల వరకు బ్యాంకులు ఎలాంటి ఎలాంటి పూచీకత్తు లేదా మార్జిన్ మనీ లేకుండా రుణాలు ఇస్తాయి. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలన, మహిళలకు ఉపాధి కల్పనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది.
ఎలా దరఖాస్తు చేయాలి
- స్థానిక బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసు, జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజెన్సీ (DRDA) లేదా స్థానిక NRLM కోఆర్డినేటర్‌ను సంప్రదించాలి.
- ఇప్పటికే ఉన్న కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ లేదా గ్రామ స్థాయి ఫెసిలిటేటర్లను సంప్రదించి ఈ పథకం దరఖాస్తు గురించి తెలుసుకోవచ్చు.
- 10-20 మహిళలు డ్వాక్రా గ్రూపుగా ఏర్పడి 6 నెలల పాటు యాక్టివ్‌గా ఉంటే దరఖాస్తులు అర్హులు అవుతారు. SHG గ్రేడ్ అయితే సంబంధిత బ్యాంకును సంప్రదించి లోన్ అప్లై చేసుకోవచ్చు.
Also Read: మహిళా సంఘాలకు రైస్ మిల్లలు, గోదాములు, సూపర్ బజార్‌లు- ముఖ్యమంత్రి కీలక ప్రకటన
కావాల్సిన డాక్యుమెంట్స్
- గుర్తింపు, అడ్రస్ ఫ్రూఫ్ - ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు
- SHG రికార్డులు: సమావేశాల సమాచారం, హాజరు రిజిస్టర్లు, గ్రూప్ తీర్మాన పత్రాలు
- డ్వాక్రా గ్రూపు బ్యాంకు అకౌంట్ పాస్‌బుక్
- బీపీఎల్ రేషన్ కార్డు
- ఆదాయ ధృవీకరణ పత్రం
- కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
DAY-NRLM పథకం కింద మహిళలకు ఎంత వరకు రుణాలు అందుబాటులో ఉన్నాయి?
ఈ పథకం కింద ఎలాంటి వ్యాపారాలకు రుణాలు ఇస్తారు?
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, నర్సరీలు, తేనె ఉత్పత్తి, మునగ సాగు, మష్రూమ్స్ సాగు వంటి వివిధ రకాల స్వయం ఉపాధి పరిశ్రమలు మరియు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ఈ పథకం కింద రుణాలు అందిస్తారు.
రుణాలు పొందడానికి డ్వాక్రా సంఘాలు పాటించాల్సిన అర్హతలు ఏమిటి?
డ్వాక్రా సంఘం కనీసం 6 నెలలుగా యాక్టివ్‌గా ఉండాలి. సంఘాలు తప్పనిసరిగా ఐదు ఫార్ములాలు (రెగ్యులర్ మీటింగ్‌లు, పొదుపు, పరస్పర రుణాలు, సకాలంలో తిరిగి చెల్లించడం, అకౌంట్ పుస్తకాలు అప్డేట్) పాటించాలి మరియు నాబార్డ్ గ్రేడింగ్ నిబంధనల ప్రకారం అర్హత కలిగి ఉండాలి.
వడ్డీ రాయితీలు ఎలా వర్తిస్తాయి?
గుర్తించిన 250 వెనుకబడిన జిల్లాల్లోని మహిళా స్వయం సహాయక బృందాలు ఏడాదికి 7% రాయితీతో రూ.3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. సకాలంలో రుణం చెల్లించే వారికి అదనంగా 3% రాయితీ కూడా లభిస్తుంది.
DAY-NRLM పథకం కింద రుణాలు పొందడానికి ఎలా దరఖాస్తు చేయాలి?
స్థానిక బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసు, జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజెన్సీ (DRDA) లేదా స్థానిక NRLM కోఆర్డినేటర్‌ను సంప్రదించాలి. 10-20 మహిళలు డ్వాక్రా గ్రూపుగా ఏర్పడి 6 నెలల పాటు యాక్టివ్‌గా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















