రోజూ 10–15 km సిటీ డ్రైవ్ కోసం ₹10-12 లక్షల్లో వచ్చే బెస్ట్ CNG కార్ల లిస్ట్ - మీ అవసరాలకు సరిగ్గా సరిపోతాయి
ప్రతి రోజూ 10–15 కి.మీ. సిటీ డ్రైవ్ చేసే వాళ్లకి CNG కార్లు బెస్ట్ ఆప్షన్. ₹10–12 లక్షల బడ్జెట్‌లో ఉన్న Swift, i10 Nios, Tiago మోడల్స్ మంచి మైలేజ్ & కంఫర్ట్‌తో ఆకట్టుకుంటున్నాయి.

Best City Commuting CNG Cars Under 10 to 12 Lakh: సిటీ ట్రాఫిక్‌లో రోజూ 10–15 కి.మీ. డ్రైవ్ చేయాల్సి వస్తుంటే, పెట్రోల్ ఖర్చు పెద్ద భారమైపోతుంది. అలాంటప్పుడు CNG కార్లు చాలా తెలివైన ఆప్షన్. తక్కువ రన్నింగ్ ఖర్చు, ఎకో-ఫ్రెండ్లీ ఫ్యూయల్ & స్మూత్ డ్రైవింగ్ అనుభవం ఇవన్నీ CNG కార్లకు అదనపు బోనస్.
ఇప్పుడు మార్కెట్లో ₹10 లక్షల నుంచి ₹12 లక్షల ధరల్లో దొరికే టాప్ CNG కార్లను పరిశీలిద్దాం - ఇవి రోజువారీ సిటీ డ్రైవ్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతాయి.
1. Maruti Suzukli Swift CNG
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన మారుతి స్విఫ్ట్ ఇప్పుడు CNG వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారులోని 1.2 లీటర్ డ్యుయల్ జెట్ ఇంజిన్.. CNGతో 76PS పవర్ ఇస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, కిలోకు సుమారు 30.9 km వరకు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కానీ ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది, CNG ట్యాంక్ బూట్‌లో ఉండటం వల్ల లగేజ్ స్పేస్ తక్కువగా ఉంటుంది. అయితే డ్రైవింగ్ కంఫర్ట్ & బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్.
2. Hyundai Grand i10 Nios CNG
స్టైలిష్‌గా కనిపించే ఈ కారు యూత్‌కి బాగా నచ్చే మోడల్. ఈ స్మార్ట్ ఫోర్ వీలర్‌లోని 1.2 లీటర్ ఇంజిన్.. CNG వెర్షన్‌లో 68PS పవర్ ఇస్తుంది. మైలేజ్‌లో... కిలోగ్రాముకు 27 km వరకు కవర్ చేస్తుంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్.. Swift కంటే ఒక అడుగు ముందుంది. ఎందుకంటే, ఈ కారులో CNG ట్యాంక్‌ను బూట్ కింద ఫిట్ చేశారు కాబట్టి లగేజ్ స్పేస్ యథాతథంగా ఉంటుంది. రోజూ ఆఫీస్‌కి వెళ్లే వాళ్లకి ఇది మంచి కాంపాక్ట్ చాయిస్.
3. Tata Tiago CNG
ఈ సెగ్మెంట్‌లో టాటా టియాగో CNG కూడా మిస్ చేయలేని కారు. 1.2 లీటర్ రివోట్రాన్ ఇంజిన్‌తో నడిచే ఈ టాటా బ్రాండ్ స్ట్రాంగ్ వెహికల్.. 73PS పవర్ జనరేట్ చేయగలదు. కంపెనీ లెక్క ప్రకారం, కిలోగ్రాముకు 26.4 km మైలేజ్ ఇస్తుంది. ముఖ్యంగా ఇది AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా అందుబాటులో ఉంది, అంటే ఫుల్ ట్రాఫిక్‌లోనూ టపటపా గేర్ మార్చే టెన్షన్ ఉండదు. ఈ టాటా కారు సేఫ్టీ పరంగా కూడా అగ్రగామిగా నిలుస్తుంది. బిల్డ్ క్వాలిటీ బలంగా ఉంటుంది కాబట్టి యువతకు & ఫ్యామిలీకి కూడా ఇది నమ్మకమైన ఆప్షన్.
వీటిలో ఏది బెస్ట్?
మీకు బూట్ స్పేస్ & ప్రాక్టికల్ యూజ్ ముఖ్యం అయితే Hyundai i10 Nios CNG తీసుకోవచ్చు. ఆటోమేటిక్ ఫీచర్ కావాలంటే Tata Tiago CNG ని పరిశీలించండి. డ్రైవింగ్ ఫన్ & మైలేజ్ ఇష్టమైతే Maruti Swift CNG సరిగ్గా సరిపోతుంది.
₹10–12 లక్షల బడ్జెట్‌లో వచ్చే ఈ CNG కార్లు సిటీ డ్రైవ్‌కి పర్ఫెక్ట్ ప్యాకేజ్. తక్కువ రన్నింగ్ ఖర్చు, ఎకో ఫ్రెండ్లీ డ్రైవ్, స్మార్ట్ ఫీచర్లు - ఇవన్నీ కలిసి ఈ కార్లను యువతకు & ఫ్యామిలీకి మరింత ఆకర్షణీయంగా మారాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - ABP దేశం ఆటో సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















