WWC 2025 | టీమ్ ఇండియా సెమీస్ చేరాలంటే గెలవాల్సింది ఎన్ని మ్యాచులు?
Icc women's world Cup 2025లో టీమ్ ఇండియాకు ఇప్పుడు పరిస్థితి కత్తి మీద సాములా మారింది.
డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో, 330 పరుగుల భారీ టార్గెట్‌ను కూడా డిఫెండ్ చేసుకోలేక టోర్నీలో రెండో ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి తరువాత, కెప్టెన్ హార్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, చివరి ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యం వల్లే దెబ్బతిన్నామని ఒప్పుకుంది. ఏది ఏమైనా వరుస ఓటములతో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో ఉన్న టీమ్ ఇండియా, సెమీస్ చేరాలంటే... ఇక నెక్స్ట్ ఆడబోయే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిందే. మొదట అక్టోబర్ 19న ఇంగ్లాండ్‌తో, తర్వాత అక్టోబర్ 23న న్యూజిలాండ్‌తో, చివరిగా అక్టోబర్ 26న బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. అయితే బంగ్లా మినహా newzealand, England లపై చివరిగా ఆడినప్పుడు టీమిండియా అదరగొట్టింది..I కానీ ఓవరాల్ records లో మాత్రం ఈ రెండు team's పై మన record చాలా పేలవంగా ఉంది. అయితే, గుడ్ న్యూస్ ఏంటంటే... టోర్నీలో మిగిలిన జట్ల కంటే ఇండియాకు మెరుగైన నెట్ రన్‌రేట్ ఉండడం మంచి అడ్వాంటేజ్ అయింది. దీనివల్ల ఒకవేళ టీమ్ ఇండియా మూడింటిలో రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచినా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి సెమీస్‌కి వెళ్లే అవకాశం ఉంది.
మరి సెమీస్ చేరడం కోసం భారత్ ఈ మూడు *‘ఫైనల్స్’*లో ఎలా ఆడుతుంది? సెమీ-ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుందా? అనేది చూడాలి.





















