Bodyline Bowling History | క్రికెట్ కారణంగా ఆసీస్, ఇంగ్లండ్‌లు శత్రువులుగా ఎలా మారాయి? | ABP Desam
2020-2021 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పుజారాపై ఆసీస్ బౌలర్లు.. బాడీలైన్ బౌలింగ్‌తో ఎటాక్ చేసి ఏ రకంగా కొట్టారో.. ఇంజూర్ చేశారో ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ఎప్పటికీ మర్చిపోలేరు. కానీ.. విచిత్రం ఏంటంటే.. ఒకప్పుడు ఇదే బాడీలైన్ బౌలింగ్‌ని తట్టుకోలేక ఆసీస్ బ్యాటర్లు వణికిపోయారు. ఆసీస్ క్రికెట్ బోర్డ్ అయితే ఏకంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో ఫైట్‌కి రెడీ అయిపోయింది. రెండు దేశాల మధ్య పొలిటికల్ రిలేషన్స్ కూడా దెబ్బతినే పరిస్థితొచ్చింది. మరి ఆసీస్ బ్యాటర్లని, ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని వార్ మోడ్‌లోకి తీసుకొచ్చిన ఆ బాడీలైన్ బౌలింగ్ కథేంటో ఈ రోజు స్పోర్ట్స్ టేల్స్‌లో తెలుసుకుందాం.
బాడీలైన్ బౌలింగ్.. ఈ పేరు వినగానే మనకి విండీస్ దిగ్గజ బౌలర్లు Curtly Ambrose, Courtney Walsh, Andy Roberts, Michael Holding.. ఇలాంటి వాళ్లంతా గుర్తుకొస్తారు. కానీ.. మీకో విషయం తెలుసా..? అసలు బాడీలైన్ బౌలింగ్ మొదలుపెట్టింది.. ఇంగ్లీష్ బౌలర్లే. అది కూడా ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాటర్ డాన్ బ్రాడ్‌మన్‌ని దెబ్బ కొట్టడానికి. కానీ.. వాళ్లు స్టార్ట్ చేసిన ఈ అనెథికల్ బౌలింగ్ ప్రాక్టీస్.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల ఫ్రెండ్‌షిప్‌నే దెబ్బతీసింది. ఎందుకంటే.. క్రికెట్ అంటే జస్ట్ ఓ స్పోర్ట్ కాదు.. అదో ఎమోషన్. అందులోనూ ఇప్పుడంటే.. ఇండియా వరల్డ్ క్రికెట్‌ని లీడ్ చేస్తుంది కానీ.. ఒకప్పుడు మాత్రం క్రికెట్ అంటే ఓన్లీ ఇంగ్లండ్ అండ్ ఆస్ట్రేలియా.. అంతే. దాదాపు వందేళ్లకి పైగా క్రికెట్ హిస్టరీ ఉంది ఈ రెండు టీమ్స్‌కి. ముఖ్యంగా ఈ రెండు టీమ్స్ మధ్య జరిగే యాషెస్ సిరీస్ అంటే.. క్రికెట్ చరిత్రకే వన్ ఆఫ్ ది.. కాదు కాదు.. వన్ అండ్ ఓన్లీ కల్ట్ క్లాసిక్ సిరీస్ అన్నమాట. ఇచ్చేది బూడిద కప్పే అయినా.. ఆ కప్పు కోసం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు రక్తాలు చిందిస్తారు. అందుకే ఇది అంత ప్రిస్టీజియస్ టోర్నీగా పేరు తెచ్చుకుంది. అయితే అలాంటి టోర్నీకి సంబంధించి 90 ఏళ్ల క్రితం జరిగిన ఒక సీజన్లో.. ప్రపంచ క్రికెట్ ముందు ఇంగ్లండ్‌ని థానోస్ కంటే పెద్ద విలన్‌గా నిలబెట్టింది.





















