అన్వేషించండి
Modi Kurnool Tour: కర్నూలు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, డీసీఎం
Modi Kurnool Tour: ప్రధానమంత్రి మోదీ కర్నూలులో ల్యాండ్ అయ్యారు. ఆయనకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు.
కర్నూలు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, డీసీఎం
1/5

వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఉదయం కర్నూలుజిల్లా చేరుకున్నారు.
2/5

కర్నూలు చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి గవర్నర్, సీఎం, డీసీఎం ఘన స్వాగతం పలికారు.
3/5

తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన నేతలతో ఆప్యాయంగా మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ. పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి ఆరా తీసిన మోదీ.
4/5

గూగుల్‌ను విశాఖకు తీసుకురావడంలో లోకేష్ తీసుకున్న చొరవను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తావిస్తూ లోకేష్‌ను అభినందించారను తెలుస్తోంది.
5/5

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కర్నూలుకు స్వాగతించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి పవిత్ర శ్రీశైలం ఆలయంలో మల్లికార్జున స్వామికి ప్రార్థనలు చేసి, ప్రజల ఆశీస్సులు కోరుతారని తెలిపారు. బహిరంగ సభలో ప్రసంగించి, కీలకమైన పారిశ్రామిక ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ వృద్ధి పథాన్ని బలోపేతం చేసే ₹13,429 కోట్ల విలువైన కొత్త పనులకు పునాది వేస్తారని తెలిపారు.
Published at : 16 Oct 2025 11:07 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















