అన్వేషించండి

Mithra Mandali OTT: థియేటర్లలో నవ్వుల 'మిత్ర మండలి' - ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?

Mithra Mandali OTT Platform: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'మిత్ర మండలి' థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ కూడా ఫిక్స్ అయ్యింది.

Priyadarshi's Mithra Mandali Movie OTT Partner Locked: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మిత్ర మండలి'. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నవ్వులు పూయిస్తోంది. ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ కూడా ఫిక్స్ అయ్యింది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

'మిత్ర మండలి' డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏ మూవీ అయినా రిలీజైన 4 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. ఒకవేళ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే స్ట్రీమింగ్ కాస్త ఆలస్యం కావొచ్చు. 4 నుంచి 6 వారాల తర్వాత 'మిత్ర మండలి' ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీకి ఎస్.విజయేంద్ర దర్శకత్వం వహించగా... ప్రియదర్శి, నిహారికలతో పాటు రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహర, సత్య, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషించారు. ఆర్ ఆర్ ధృవన్ మ్యూజిక్ అందించారు. నిహారిక, విజయేంద్రలకు ఇదే ఫస్ట్ మూవీ. ప్రొడ్యూసర్ బన్నీ వాస్ న్యూ బ్యానర్ 'బన్నీ వాస్ వర్క్స్' సమర్పణలో... సప్తాశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

Also Read: 'ప్రభుత్వ సారాయి దుకాణం'లో అసభ్యకర డైలాగ్స్ - నేషనల్ అవార్డ్ విన్నర్ డైరెక్టర్ మూవీపై కంప్లైంట్

స్టోరీ ఏంటంటే?

జంగ్లీపట్నానికి చెందిన నారాయణ (వీటీవీ గణేష్)కు తన కులం అంటే పిచ్చి. తన కులానికి చెందిన వారికి సహాయ సహకారాలు అందిస్తుంటాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా వేరే కులానికి చెందిన వారి రక్తాన్ని సైతం ఎక్కించుకునేందుకు ఆలోచిస్తాడు. ఇక కులాంతర వివాహ విషయాలైతే సరేసరి. అస్సలు ఒప్పుకోడు. తన కులం బలంతో ఎమ్మెల్యే కావాలని కలలు కంటాడు నారాయణ. ఇదే క్రమంలో అతని కూతురు స్వేచ్ఛ (నిహారిక) ఇంటి నుంచి వెళ్లిపోతుంది.

ఈ విషయం బయటకు తెలిస్తే... తన పొలిటికల్ కెరీర్, పరువుకు భంగం కలుగుతుందని భావించిన నారాయణ... కిడ్నాప్ కేసు పెట్ట ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్) సాయంతో వెతుకులాట ప్రారంభిస్తాడు. అయితే, స్వేచ్ఛ పారిపోవడం వెనుక అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాక్ మయూర్), రాజీవ్ (ప్రసాద్ బెహర), సాత్విక్ (విష్ణు ఓయ్) ఉన్నట్లు తేలుతుంది. అసలు స్వేచ్ఛ ఎవరిని ప్రేమించింది? ఇంటి నుంచి బయటకు రావడానికి అసలు కారణం ఏంటి? ఆ అమ్మాయి వల్ల ఈ నలుగురూ పడ్డ ఇబ్బందులేంటి? వీళ్లను నారాయణ ఏం చేశాడు? ఎమ్మెల్యే కావాలనే అతని కోరిక నెరవేరిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget