Sunny Leone: సన్నీలియోన్ పాన్ ఇండియా మూవీ 'త్రిముఖ' - టీజర్ ఎప్పుడో తెలుసా?
Trimukha Teaser: బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూవీ 'త్రిముఖ'. రాజేష్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

Sunny Leone's Trimukha Movie Teaser Release Date Locked: సన్నీలియోన్... పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ మూవీస్‌లో స్పెషల్ సాంగ్స్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో పాటే పలు సినిమాల్లో అతిథి పాత్రల్లోనూ మెరిశారు. ఇప్పుడు ఆమె తాజాగా తెలుగులోనూ మూవీస్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ మూవీస్ చేస్తున్నారు. గతంలో కరెంట్ తీగ, జిన్నా సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'త్రిముఖ' పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది.
టీజర్ ఎప్పుడంటే?
'త్రిముఖ' మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించగా... అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మించారు. ఈ మూవీ టీజర్ ఈ నెల 18న రిలీజ్ చేయబోతున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అదే రోజున రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు. థ్రిల్లింగ్, మిస్టరీ కథాంశం బ్యాక్ డ్రాప్‌గా మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేయగా వైరల్ అవుతోంది.
ఈ మూవీలో సన్నీలియోన్‌తో పాటు యోగేష్ కల్లె, ఆకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, మొట్టా రాజేంద్రన్, అషు రెడ్డి, షకలక శంకర్, ప్రవీణ్, సుమన్, రవి ప్రకాష్, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'త్రిముఖ' జర్నీ తమకెంతో స్పెషల్ అని... 5 భాషల్లో మూవీ నిర్మించడం మామూలు విషయం కాదని మూవీ టీం తెలిపింది. టీజర్ చూస్తే మేము ఎలాంటి ప్రపంచం సృష్టించామో ప్రేక్షకులకు అర్థమవుతోందని వెల్లడించింది. డిసెంబరులో మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.

'త్రిముఖ' టెక్నికల్ టీం - బ్యానర్ : అఖీరా డ్రీమ్ క్రియేషన్స్, నిర్మాతలు : శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి, దర్శకుడు : రాజేష్ నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: సుమిత్ పటేల్ ఓదెల, ప్రొడక్షన్ కంట్రోల్ : పివి చౌదరి, ఎడిటర్ : ఆర్కె, అఖిల్ బలరామ్, సౌండ్ డిజైన్: శ్రీను నాగపురి, డ్యాన్స్ కొరియోగ్రఫీ: బాబీ మాస్టర్, స్టంట్ కొరియోగ్రఫీ: కృష్ణ మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి అల్తి.
Also Read: 'ప్రభుత్వ సారాయి దుకాణం'లో అసభ్యకర డైలాగ్స్ - నేషనల్ అవార్డ్ విన్నర్ డైరెక్టర్ మూవీపై కంప్లైంట్





















