Prabhas: ఒకే రోజు డబుల్ బొనాంజా - ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ
Fauji Update: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. అవెయిటెడ్ మూవీస్‌పై బిగ్ అప్డేట్స్ ఆయన బర్త్ డే సందర్భంగా ఒకే రోజు రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Prabhas Movie Updates On 23rd October: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఒకే రోజు డబుల్ ట్రీట్ అందనుంది. ఆయన బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న అవెయిటెడ్ మూవీస్‌పై అదిరిపోయే అప్డేట్స్ రానున్నాయి. మారుతి డైరెక్షన్‌లో హారర్ కామెడీ మూవీ 'ది రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక మరో మూవీ 'ఫౌజీ' నుంచి కూడా అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది.
టైటిల్‌పై సస్పెన్స్
'సీతారామం' మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్న డైరక్టర్ హను రాఘవపూడి. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పీరియాడికల్ వార్ డ్రామా 'ఫౌజీ' రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి భారీ హైప్ క్రియేట్ అవుతోంది. మూవీలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తుండగా... 'ఫౌజీ' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం సాగింది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా... ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా... ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ. వీరితో పాటే బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తితో పాటు సీనియర్ హీరోయిన్ జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తుండగా... వచ్చే ఏడాది ఆగస్టులో మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. త్వరలోనే మూవీకి సంబంధించి ఇతర వివరాలు సైతం వెల్లడి కానున్నాయి.
ఫస్ట్ సింగిల్... వెరీ స్పెషల్
ప్రభాస్ బర్త్ డే రోజునే 'ది రాజా సాబ్' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్, ట్రైలర్ వేరే లెవల్‌లో ఉండగా... వింటేజ్ ప్రభాస్‌ను గుర్తు చేశాయి. ఇక ఈ సాంగ్ అంతకు మించి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మ్యాగ్జిమమ్ కంప్లీట్ కాగా.... సాంగ్ పిక్చరైజేషన్ కోసం టీం మొత్తం కేరళ వెళ్లింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాట కోసం అదిరిపోయే ట్యూన్ ఇవ్వగా... సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. అయితే, లిరికల్ వీడియో మాత్రమే రిలీజ్ చేస్తారా? లేక ఫుల్ వీడియోనా? అనేది తెలియాల్సి ఉంది.
మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, కమెడియన్ సప్తగిరి, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న వరల్డ్ వైడ్‌గా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















