Bunny Vas: వెనుక నుంచి దాడి చేస్తే సహించను - 'బుక్ మై షో'లో మూవీ రేటింగ్స్‌పై ప్రొడ్యూసర్ బన్నీ వాస్ స్ట్రాంగ్ కౌంటర్
Bunny Vas Reaction: సినిమాలపై ట్రోలింగ్స్, రిలీజ్ కాక ముందే నెగిటివ్ ప్రచారం చేసే వారికి ప్రముఖ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వెనుక నుంచి దాడి చేస్తే సహించేది లేదన్నారు.

Producer Bunny Vas Reaction On Book My Show Ratings And Negative Trollings: సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్స్‌పై పెయిడ్ కామెంట్స్‌పై ప్రముఖ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారగా... తాజాగా... మరోసారి ఆయన ట్రోలింగ్స్, రేటింగ్స్‌పై సంచలన కామెంట్స్ చేశారు.
'వాళ్లే చేస్తున్నారు'
కొంతమంది ఓ గ్రూప్‌గా మారి సినిమాలపై కావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని బన్నీ వాస్ తెలిపారు. 'సినిమాల కాంపిటీషన్ ఉన్నప్పుడు కొంతమంది ఓ గ్రూప్‌గా ఏర్పడి కొంతమంది నిర్మాతలను అప్రోచ్ అయ్యి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. కొంతమంది వాళ్లను తిడుతున్నారు. కొంతమంది తెలిసీ తెలియని ప్రొడ్యూసర్స్ మాత్రం ఇదేదో మనకు బెనిఫిట్ చేస్తుందని చెప్పి ఎంకరేజ్ చేస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. కొందరు థర్డ్ పార్టీస్ సినిమాలపై పాజిటివ్, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అవతలి సినిమాను తొక్కితేనే మా సినిమా ఆడుతుంది అనేదే తప్పు అని నేను చెప్పాను.' అని తెలిపారు.
'అలా దాడి చేస్తే సహించను'
ఎవరైనా ఎదురుగా వచ్చి యుద్ధం చేస్తే ఎలాగైనా ఎదుర్కొంటానని... కానీ వెనుక నుంచి దాడి చేస్తే మాత్రం సహించేది లేదని బన్నీ వాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 'ఒక విషయం కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చదు. ఏ విషయమైనా నాకు నచ్చితే నేను తీసుకుంటా. ఎదురుగా వస్తే ఎంత యుద్ధమైనా చేస్తా. వెనుక దాడి చేస్తే మాత్రం వారికి ఎక్కడ ఎలాగా ఎప్పుడు ఇవ్వాలో అది ఇచ్చేస్తా.' అని చెప్పారు.
Also Read: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ఫౌజీ' రిలీజ్ డేట్ కన్ఫర్మ్... ఎప్పుడో తెలుసా?
'సినిమాను చంపేయడం దారుణం'
టికెట్స్ అమ్ముకుని ఓ సినిమాను చంపేయడం దారుణమని బన్నీ వాస్ తెలిపారు. 'బుక్ మై షో యాప్‌లో ముందుగానే ఓ 20, 30 రేటింగ్స్ లైన్‌గా పడిపోతాయ్. నిజంగా సినిమా చూసిన వాళ్లు ఎవరైనా రేటింగ్స్ ఇస్తే మళ్లీ మొదలుపెడతారు. ఇవన్నీ చీప్ టాక్టిక్స్. టికెటింగ్ యాప్ షో వాళ్లను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. సినిమాలు బాగుంటే మీరు బాగుంటారు. మీ సైట్‌లో కూడా ఇలా కాంపిటీషన్ పెట్టి ఆ సినిమాకు ఇంత రేట్ అని పెట్టడం కరెక్ట్ కాదు. ముందుగానే ఆ సైట్లలో రేటింగ్స్ ఎందుకు?.
రివ్యూ రాసే వారు సినిమా చూసి ఇంత నచ్చింది అంటూ రేటింగ్స్ ఇస్తారు. అది ఒక విశ్లేషణ, వాళ్లు జర్నలిస్టులు, వాళ్లది ఒక డ్యూటీ. మనం టికెట్స్ అమ్ముకుని దాని మీద కమీషన్ తీసుకునే మనం కూడా ఒక సినిమాను ఇలా రేటింగ్స్ ఇవ్వడం దారుణం. మీ యాప్‌లో పెట్టే దానికి అథంటికేషన్ అయినా ఉండాలి. అది కూడా ఉండదు.' అని అన్నారు.
ఎమోషనల్‌గా రెస్పాండ్ అయ్యా
ఇండస్ట్రీలో అందరూ ఇలాంటి నెగిటివిటీని ఫేస్ చేస్తున్నారని బన్నీ వాస్ తెలిపారు. 'ఇండస్ట్రీలో ఈ ప్రాబ్లమ్ అందరూ ఫేస్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే నాకే తక్కువ జరిగింది. నేను దీనిపై రెస్పాండ్ అయిన తర్వాత నాకు చాలా కాల్స్ వచ్చాయి. ఇష్యూ అడ్రెస్ చేసినందుకు థాంక్స్ చెప్పారు. మూవీ రిలీజ్‌కు ముందు ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల నేను ఎమోషనల్‌గా రెస్పాండ్ అయ్యాను.' అని చెప్పారు.
కాగా... ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం ప్రధాన పాత్రలో నటించిన 'మిత్ర మండలి' గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. బీవీ వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ కల్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా.విజేందర్ రెడ్డి తీగల నిర్మించారు.





















