Sonakshi Sinha: బాలీవుడ్ హీరోయిన్ ప్రెగ్నెన్సీ రూమర్స్! - ఆ డ్రెస్‌లో చూసి కన్ఫర్మ్స్ చేసేస్తోన్న నెటిజన్లు
Sonakshi Sinha Pregnancy Rumours: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రెగ్నెన్సీ రూమర్స్ మరోసారి హల్చల్ చేస్తున్నాయి. తన భర్తతో కలిసి తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరు కాగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Bollywood Actress Sonakshi Sinha Preganancy Rumours Gone Viral: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రెగ్నెన్సీ రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. గతేడాది తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను అమె వివాహమాడగా గత కొంతకాలంగా ఆమె తల్లి కాబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. తాజాగా తన భర్తతో కలిసి విక్రమ్ ఫడ్నీస్ షోకు హాజరయ్యారు.
ఈవెంట్‌లో ఈ జంట ఫోటోలకు ఫోజులివ్వగా సోనాక్షి అనార్కలి సూట్‌లో కనిపించారు. లూజ్‌గా ఉన్న డ్రెస్సులో బేబీ బంప్ కవర్ చేసినట్లు కనిపించిందంటూ ఆమె ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు అదే నిజం కావొచ్చంటూ విషెష్ సైతం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. కొందరు మాత్రం ఆమె స్టైలిష్‌గా కనిపించారని... అంతే తప్ప ప్రెగ్నెన్సీ లాంటిది ఏమీ లేదని అంటున్నారు. మరి దీనిపై ఈ కపుల్ రియాక్ట్ కావాల్సి ఉంది.
View this post on Instagram
Also Read: ఓటీటీలోకి విజయ్ ఆంటోని పొలిటికల్ థ్రిల్లర్ 'భద్రకాళి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అయితే, గతంలోనూ సోనాక్షి సిన్హా ప్రెగ్నెన్సీ రూమర్స్ హల్చల్ చేశాయి. పెళ్లైన తర్వాత ఈ జంట ఆస్పత్రిలో కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం సాగింది. దీనిపై సోనాక్షి సైతం స్పందిస్తూ... 'నేను ఆస్పత్రికి వెళ్తే ప్రెగ్నెంట్ అంటూ డిసైడ్ చేసేస్తున్నారు. అందుకే నేను ఇక ఆస్పత్రికి వెళ్లను.' అంటూ రియాక్ట్ అయ్యారు. తాజాగా మళ్లీ అలాంటి వార్తలు రావడంతో మళ్లీ ఆమె రియాక్ట్ అవుతారో లేదో తెలియాల్సి ఉంది.
ఇక సినిమాల విషయానికొస్తే... తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తోన్న 'జటాధర' మూవీలో సోనాక్షి సిన్హా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమెకు ఇదే ఫస్ట్ తెలుగు మూవీ. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్... 'ధన పిశాచి' సాంగ్ ట్రెండ్ అవుతున్నాయి. పవర్ ఫుల్ రోల్‌లో భయపెట్టే విధంగా సోనాక్షి లుక్ ఉంది. ఈ మూవీకి వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తుండగా... సుధీర్ బాబు, సోనాక్షి సిన్హాలతో పాటు రైన్ అంజలి, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో కేఆర్ బన్సల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు. త్వరలోనే మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















