Rohit Sharma and Virat Kohli | ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీ 3 సెంచరీలు బాదేస్తాడన్న హర్బజన్ సింగ్
ఆస్ట్రేలియా సిరీస్‌కి ముందు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ అదిరిపోయే బూస్ట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా టూర్‌లో కోహ్లీ దుమ్మురేపుతాడంటూ హర్బజన్ చెప్పడంతో.. రన్ మెషీన్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీకి తిరుగులేదని.. ఈ సిరీస్‌లో కచ్చితంగా రెండు సెంచరీలైతే చేస్తాడని అనడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా ఉంది. అయితే సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత టీమిండియా.. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా టూర్ వెళ్లనుంది. ఈ టూర్‌తో చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఇలాంటి టైంలో.. హర్బజన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘నా వరకైతే విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఎలాంటి డౌట్ లేదు. ఆట విషయంలో అతను ఎంతో పర్‌ఫెక్ట్. ప్రస్తుత టీమిండియాలోనే కాదు.. ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా కోహ్లీ అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్. ప్రస్తుతం అతనితో కలిసి ఆడుతున్న వారిలో చాలా మంది కంటే కూడా కోహ్లీ చాలా ఫిట్‌గా ఉన్నాడు. అందుకే కోహ్లీ ఆట కోసం ఎదురుచూస్తున్నా. విరాట్ కోహ్లీ మరింత కాలం వన్డేల్లో కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా. ఆస్ట్రేలియా కోహ్లీకి ఇష్టమైన ప్రదేశం. అక్కడ టన్నుల కొద్దీ రన్స్ చేశాడు. ఈ సారి కూడా ఇరగదీస్తాడని.. మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు సెంచరీలు బాదేస్తాడని అనుకుంటున్నా. రోహిత్ కూడా మంచి ప్రదర్శన చేసి జట్టు విజయానికి తోడ్పడాలని కోరుకుంటున్నా.'అన్నాడు హర్భజన్ సింగ్. దీంతో ఇప్పుడు రోకో ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు.





















