Mars Transit In Capricorn 2024: మకరంలోకి కుజుడు - ఈ 5 రాశులవారికి మంచిరోజులొచ్చినట్టే!
Astrology: ధనస్సు రాశిలో ఉన్న కుజుడు 2024 ఫిబ్రవరి 5 నుంచి మకర రాశిలో సంచరిస్తాడు..ఈ సంచారం 5 రాశులవారికి అదృష్టాన్ని తీసుకొస్తోంది...
![Mars Transit In Capricorn 2024: మకరంలోకి కుజుడు - ఈ 5 రాశులవారికి మంచిరోజులొచ్చినట్టే! Astrology mars transit In Capricorn 5th february 2024 horoscope future predictions effects on zodiac signs Mars Transit In Capricorn 2024: మకరంలోకి కుజుడు - ఈ 5 రాశులవారికి మంచిరోజులొచ్చినట్టే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/31/bd248563de2917533e4cbe5c017c1b621706705947399217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mars Transit In Capricorn 2024: గ్రహాలు రాశులు మారిన ప్రతిసారీ ఆ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులవారికి శుభఫలితాలుంటే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటాయి. డిసెంబరు 27 నుంచి ధనస్సు రాశిలో సంచరిస్తున్న కుజుడు...ఫిబ్రవరి 5 నుంచి రాశిమారుతున్నాడు. మకర రాశిలో ప్రవేశించి మార్చి 15 వరకూ ఇదే రాశిలో ఉంచాడు. అనంతరం కుంభరాశిలోకి అడుగుపెడతాడు. ఈ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ 5 రాశులవారికి మంచి రోజులు మొదలవుతాయి.
మేష రాశి ( Aries )
మకర రాశిలో కుజుడి సంచారం సమయంలో మేష రాశివారి వృత్తి జీవితంలో పెద్ద మార్పులు ఉంటాయి. మీ కెరీర్‌లో శుభవార్త అందుకుంటారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ప్రేమికులు పెళ్లి దిశగా అడుగేసేందుకు మంచి సమయం ఇది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కృషి ద్వారా అన్ని రకాల సవాళ్లను అధిగమిస్తారు. శ్రమ పెరుగుతుంది..ఆరోగ్యం విషంయలో జాగ్రత్త అవసరం.
Also Read: ఈ రాశులవారికి ఫిబ్రవరి నెల చుక్కలు చూపిస్తుంది, నెలాఖరు కొంత ఉపశమనం
వృషభ రాశి (Taurus )
కుజుడి సంచారం మీకు అదృష్టాన్ని తీసుకొస్తోంది. కష్టపడితేనే అందుకు తగిన ఫలితం అందుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వస్తు సౌఖ్యం పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో అఖండ విజయం సాధిస్తారు. ఈ సమయంలో సుదీర్ఘ వ్యాపార ప్రయాణాలు మీకు ఆర్థిక లాభాలను అందిస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. సహోద్యోగులతో కలసి పర్యటనలు ఆస్వాదిస్తారు. మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి మీరు నిజాయితీగా ఉండాలి , మీ దినచర్యను శ్రద్ధగా అనుసరించాలి.
తులా రాశి (Gemini )
గత నెలలో వెంటాడిన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. మకర రాశిలో కుజుడి సంచారం సమయంలో నూతన ఆదాయ మార్గాలు వస్తాయి. వృత్తి , ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నవారు, నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకున్నవారికి గుడ్ టైమ్. మీ పని మీ సీనియర్లను ఆకట్టుకుంటుంది కానీ దీనికి సంబంధించిన ప్రతిఫలం పొందడానికి టైమ్ పడుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడిని మీ వ్యక్తిగత జీవితంపై పడకుండా చూసుకోవాసి.
Also Read: ఈ 6 రాశులవారికి ఫిబ్రవరి నెల సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది!
వృశ్చిక రాశి (Scorpio )
మకరంలో కుజుడి సంచారం సమయంలో వృశ్చిక రాశివారికి ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఆర్థికంగా లాభపడతారు. నిరుద్యోగుల అన్వేషణ పూర్తవుతుంది. అవివాహితులేకు వివాహ సూచనలున్నాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీరు నిస్సంకోచంగా మీ భావాలను పంచుకోవడం మంచిది. మీ నిజాయితీ మరియు పనిలో ఏకాగ్రత విజయానికి మార్గం సుగమం చేస్తుంది. మీరు మీ కార్యాలయంలో ప్రమోషన్, పెర్క్‌లు, బోనస్‌లు మరియు ప్రశంసలను పొందవచ్చు.
మీన రాశి (Pisces )
కుజుడి సంచారం సమయంలో మీన రాశివారి జీవితంలో వెలుగొస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు...సంతోష సమయం స్పెండ్ చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. చేపట్టిన పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు అందరితో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తారు. వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు సహాయపడే వ్యక్తులను కలుస్తారు.
Also Read: ఈ రాశులవారికి నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఫిబ్రవరి 1 రాశిఫలాలు
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)