అన్వేషించండి

Horoscope 1st February 2024: ఈ రాశులవారికి నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఫిబ్రవరి 1 రాశిఫలాలు

Horoscope 1st February 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 1st February 2024  - ఫిబ్రవరి 1 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రాశివారు సహనం పాటించండి. కష్టపడితేనే విజయం సాధిస్తారు. సంభాషణలో సమతుల్యత పాటించండి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈరోజు శుభవార్త అందుతుంది. కుటుంబంలో కొనసాగుతున్న ఆర్థిక వివాదాల నుంచి మీరు ఉపశమనం పొందుతారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి.

వృషభ రాశి (Taurus  Horoscope Today)

చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది. మీరు పాత స్నేహితులను కలుస్తారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. పిల్లల వైపు నుంచి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అధిక ఖర్చుల వల్ల ఇబ్బందిపడతారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉంటాయి, కానీ ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

Also Read: లోకంలో చీకటినే కాదు మనిషి లోపలున్న చీకటిని కూడా తొలిగించే భగవానుడు!

మిథున రాశి (Gemini Horoscope Today) 

మానసిక ఆరోగ్యం బాగుంటుంది. గౌరవం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.  వాహన ఆనందాన్ని పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. మాటలో మాధుర్యం ఉంటుంది. ఏదో శక్తి మీలో నిండి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  
 
మాటలో మాధుర్యం ఉంటుంది. సంగీతం, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వాహన నిర్వహణకు డబ్బు వెచ్చించాల్సి రావొచ్చు. సహనం తగ్గుతుంది. స్నేహితుల సహకారంతో పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ జీవితంలో ఆనందం  ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

Also Read: ఈ రాశులవారికి ఫిబ్రవరి నెల చుక్కలు చూపిస్తుంది, నెలాఖరు కొంత ఉపశమనం

సింహ రాశి (Leo Horoscope Today)

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కార్యాలయంలో కొత్త వ్యక్తులను కలుస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి.  కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. మీరు విద్యా పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది.

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. తల్లి సహకారంతో ధనలాభం ఉంటుంది. మీరు కార్యాలయంలో పూర్తి విశ్వాసంతో కనిపిస్తారు.  విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. సహనం తగ్గవచ్చు. మీ భావోద్వేగాలను నియంత్రించండి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు హాని కలిగిస్తాయి. వాహన నిర్వహణకు డబ్బు వెచ్చించవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.  

తులా రాశి (Libra Horoscope Today) 

మనస్సు ఆనందంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల నుంచి  మద్దతు లభిస్తుంది. కార్యాలయంలోని పై అధికారుల సహకారం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అనేక అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మేధోపరమైన  పనుల నుంచి ఆర్థిక లాభం ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది.

Also Read:  ఈ 6 రాశులవారికి ఫిబ్రవరి నెల సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది!

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

సక్సెస్ వైపు అడుగులు వేస్తారు. ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు. ప్రేమ, వృత్తి, డబ్బు , ఆరోగ్యం అన్నింటిలో అదృష్టం మీకు కలిసొస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

కార్యాలయంలో మీ ప్రతిభను వ్యక్తీకరించడానికి సిద్ధంగా ఉండండి.  కెరీర్ వృద్ధికి పుష్కలమైన అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడి నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోండి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆఫీసు గాసిప్‌లకు దూరంగా ఉండండి మరియు మీ పనితీరుపై దృష్టి పెట్టండి. క్రమం తప్పకుండా యోగా లేదా ధ్యానం చేయండి. దీంతో పని ఒత్తిడి తగ్గుతుంది. ప్రతికూలత దూరమై మనసు ఆనందంగా ఉంటుంది.

మకర రాశి (Capricorn Horoscope Today) 

ఏ విషయం గురించి అతిగా ఆలోచించవద్దు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగులు, వ్యాపారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. మాటల్లో కఠినత్వాన్ని తీసుకోరావొద్దు. కార్యాలయంలో కొత్త ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం ఉండొచ్చు. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

Also Read: విజ్ఞానం, సంపద, ఆహారం, ఆరోగ్యానికి మూలం ఆదిత్యుడే!

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు వచ్చే సూచన ఉంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు డబ్బులు ఖర్చు చేస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. కోపం తగ్గించుకోవాసి. స్నేహితుల సహాయంతో వ్యాపారం ఊపందుకుంటుంది. 

మీన రాశి (Pisces Horoscope Today) 

మీ తెలివితేటలు నూతన ఆదాయ మార్గాలను చూపిస్తాయి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. కుటుంబంతో కలసి మతపరమైన ప్రదేశాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం అవకాశాలు వస్తాయి. డబ్బుకి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేముందు మరోసారి ఆలోచించాలి. 

గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget