ఈ 3 విషయాలను నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే!
ఆచార్య చాణక్యుడి విధానాలు మరియు ఆలోచనలు కఠినంగా ఉండొచ్చు కానీ వాటిని అమలు చేస్తే ఎలాంటి కష్టం రాదు.. వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగల సామర్థత మీ సొంతం
ఏ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు. ఓ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సమస్యలకు చాలాదూరంగా ఉన్నట్టే అంటాడు చాణక్యుడు
చాణక్య నీతి ప్రకారం...రోగాలు, శత్రువులు, పాములను పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ విషయాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే..
ఈ మూడు విషయాలు మిమ్మల్ని పట్టుకున్న తర్వాత అస్సలు వదిలిపెట్టవు..సమయం కోసం ఎదురుచూస్తుంటాయి అందుకే రోగాలు, శత్రువులు, పాముల విషయంలో నిర్లక్ష్యం అస్సలు కూడదు
అనారోగ్యం ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వ్యాధులు వెంటాడుతూనే ఉంటాయి. చిన్న చిన్న సమస్యలే కదా అని పట్టించుకోకుండా ఉండే ఒక్కోసారి మీ ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు.
శత్రువు శత్రువు నిశ్చలంగా కూర్చున్నాడని బలహీనుడని అనుకోవద్దు. ఓడిపోయిన వారు నిశ్శబ్దంగా కనిపిస్తారు కానీ నిశ్శబ్దంగా ఉండరు. అవకాశం కోసం పొంచి ఉంటారని మర్చిపోరాదు
పాములు పాము కూడా అంతే. మనకు తెలియకుండానే కాటేసి వెళ్లిపోతుంది. ప్రాణాంతకం అయ్యాక కానీ అర్థంకాదు..
ఇక్కడ పాములు అంటే మీ చుట్టూ ఉండే విషం నిండిన వ్యక్తులని కూడా అనుకోవచ్చు
ఎన్ని జనరేషన్లు మారినా ఆచార్య చాణక్యుడి విధానాలు జీవితంలో మార్గదర్శకాలుగా పనిచేస్తాయి