ఆ దోషాలు తొలగిపోయేందుకే ఆయుధ పూజ!



శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి ఆయుధం చేపట్టి దుర్గాష్టమి రోజున దుర్గముడు అనే రాక్షసుడిని , మహా నవమి నాడు మహిషాసురుడనే రాక్షసుని సంహరించడంతో ఆయుధాలను శక్తి స్వరూపిణిగా భావించి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.



పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శ



కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనేందుకు అర్జునుడు జమ్మిచెట్టు తొర్రలో దాచి ఉంచిన ఆయుధాలను విజయదశమికి ఒకరోజు ముందు క్రిందికి తీసి పూజలు నిర్వహించి యుద్ధానికి బయలు దేరతాడు. ఆ యుధ్దంలో విజయం సాధిస్తాడు.



యుధాల శత్రు సంహారానికి మాత్రమే వినియోగించాలని, ఆయుధం దుర్వినియోగం చేయకూడదని ఈ ఆయుధ పూజ ఉద్దేశం.



ఆయుధ పూజ చేయడం ద్వారా అమపృత్యు దోషాలుండవని, వాహన ప్రమాదాలు జరగవని నమ్మకం.



అందుకే వ్యాపారులు, ఉద్యోగులు, ఇతర వృత్తి పనివారంతా దుర్గాష్టమిరోజు తాము ఉపయోగించే పనిముట్లను,యంత్రాలను, వాహనాలను శుభ్రం చేసుకుని వాటిలో చైతన్య రూపంలో ఉండే శక్తి స్వరూపిణిని మననం చేసుకుంటూ పూజలు చేస్తారు.



పోలీసులు తాము వినియోగించే లాఠీ,తుపాకులు వాహనాలు - రైతులు అయితే కొడవలి,నాగలి, వాహనం ఉన్న వారు తమ వాహనాలకు - టైలర్లు కుట్టు మిషన్లకు, చేనేత కార్మికులు మగ్గాలకు పూజ చేస్తారు.



ఫ్యాక్టరీలలో కార్మికులు తమ మిషన్లకు, ఇతర పనిముట్లకు పసుపు, కుంకుమలతో, పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆయుధ పూజ చేసేటప్పుడు ఓం దుం దుర్గాయైనమః అనే మంత్రాన్ని పఠించాలి.



ఆయుధ పూజ చేసేటప్పుడు ఓం దుం దుర్గాయైనమః అనే మంత్రాన్ని పఠించాలి.



Images Credit: Pixabay