Mergu Nagarjuna: ఉద్యోగం పేరుతో రూ.90 లక్షలు మోసం చేసిన మాజీ మంత్రి - మెరుగు నాగార్జునపై మహిళ ఫిర్యాదు !
Andhra Pradeh: మాజీ మంత్రి మెరుగు నాగార్జున ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు చేశారని ఓ మహిళ తాడేపల్లి పోలీసులకుు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు తిరిగివ్వాలని అడిగితే బెదిరిస్తున్నారు.

Ysrcp : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి మెరుగు నాగార్జున తమను ఉద్యోగం పేరుతో మోసం చేశారని విజయవాడకు చెందిన ఓ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 90 లక్షలు వసూలు చేశారని చివరికి ఉద్యోగం ఇప్పించలేదన్నారు. ఇప్పుడు అసలు ఇప్పించలేరు కాబట్టి తమ సొమ్ము తమకు ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నారని ఆమె చెబుతున్నారు. ఈ మేరకు తాడేపల్లి సీఐకు ఆమె ఫిర్యాదు పత్రం అందించారు. తాము డబ్బులు ఇచ్చినట్లుగా కొన్ని ఆధారాలను కూడా సమర్పించినట్లుగా తెలుస్తోంది. న్యాయ సలహా తీసుకుని పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
వేమూరు ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్ల పాటు మంత్రిగా పని చేసిన మెరుగు నాగార్జున
2019లో వేమూరు నియోజకవర్గం నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన మెరుగు నాగార్జున మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 2022లో మంత్రిపదవి చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన తీరుపై పలు ఆరోపణలు వచ్చాయి. చివరికి ఆయనను సంతనూతలపాడు నియోజకవర్గానికి మార్చారు. ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. వేమూరులో కూడా వైసీపీ ఓడిపోయింది. వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి వైసీపీ నేతలు చాలా మంది తమను మోసం చేశారని బాధితులు కూటమి పార్టీల కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యకమాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. అలా మోసం చేసిన కేసుల్లో ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్ వరకూ వెళ్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
కేసుల్లో ఇరుక్కున్న పలువురు వైసీపీ నేతలు
తాజాగా విజయవాడ బాధితురాలు కూడా ఇలా తమ వద్ద ఉన్న ఆధారాలతో పోలీసుల్ని సంప్రదించారు. విజయవాడ మహిళ తనపై రూ. 90 లక్షలు తీసుకుని ఉద్యోగం ఇప్పించలేదని పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదుపై మెరుగు నాగార్జున స్పందించలేదు. ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కేసు నమోదు చేయడానికి అవసరమైన సాక్ష్యాలను మహిళ అందిస్తే పోలీసులు న్యాయసలహా మేరకు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే మాజీ మంత్రికి చిక్కులు తప్పవని అంచనా వేస్తున్నారు.
Also Read: 'అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు' - జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమన్న మంత్రి నిమ్మల
వైసీపీ హయాంలో జరిగిన అనేక ఘటనల్లో నేరస్తులు ఉన్న వైసీపీ నేతలు ఇప్పటికే కొంత మంది అరెస్టయ్యారు. చాలా మంది ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. వీరిలో చాలా మంది విచారణల కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. మెరుగు నాగార్జున పైనా కే్సు నమోదు అయితే ఆయన కూడా ఆజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

