అన్వేషించండి

Nagpur Odi Result Update: గిల్ స్టన్నింగ్ ఫిఫ్టీ.. తొలివన్డేలో భారత్ ఘన విజయం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు.. ఆకట్టుకున్న అక్షర్, శ్రేయస్ 

ఆరంభంలో ఓపెనర్లు ఇద్దరు త్వరగా ఔటైనా, గిల్ ఒక ఎండ్ లో నిలబడి జట్టును దాదాపు విజయ తీరాలకు చేర్చాడు. అక్షర్ పటేల్ తనకు చక్కని సహకారం అందించాడు. ఈ విజయంతో సిరీస్ లో ఇండియా 1-0 తో ఆధిక్యంలో నిలిచింది.

Ind Vs Eng 1st Odi Live Updates: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. గురువారం నాగపూర్లో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై 4 వికెట్లతో విజయం సాధించింది. బ్యాటర్లు సమయోచితంగా రాణించడంతో తొలి వన్డేలో 68 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని దక్కిచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్‌లో భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు ఛేదించింది. వన్ డౌన్ బ్యాటర్ శుభమాన్ గిల్ సూపర్ అర్థ సెంచరీ (96 బంతుల్లో 87, 14 ఫోర్లు)తో  జట్టును దాదాపు విజయతీరాలకు చేర్చాడు. చివర్లో కాస్తలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. అక్షర్ ఔటయ్యాక భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో టెన్షన్ రేగినా, బ్యాటర్లు అందుకు అవకాశమివ్వలేదు. సమయోచితంగా ఆడి జట్టును గెలిపించారు.   శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52)  కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. నాలుగో వికెట్ కు అక్షర్ తో కలిసి గిల్ జోడించిన 108 పరుగుల భాగస్వామ్యం కీలకంగా మారింది.  రోహిత్ శర్మ(2) , యశస్వి జైస్వాల్ (15)  విఫలమయ్యారు. బౌలర్లలో సాఖిబ్ మహ్మూద్, ఆదిల్ రషీద్ లకు రెండు వికెట్లు దక్కాయి.  ఈ మ్యాచ్ లో విజయంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0తో భారత్ ఆధిక్యం సంపాదించింది. రెండో వన్డే ఆదివారం కటక్ లో జరుగుతుంది. గిల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

 

రోహిత్ మళ్లీ విఫలం.. 
ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ టోర్నీ కి ముందు ఫామ్ లోకి రావాలని భావించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ వన్డేలో నిరాశే ఎదురైంది. లెగ్ సైడ్ పై వచ్చిన బంతిని ఫ్లిక్ చేయబోయి లివింగ్ స్టన్ కు దొరికిపోయాడు. అంతకుముందు జైస్వాల్ కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ 19 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో శ్రేయస్ తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. ఆరంభంలో గిల్ చాలా ఓపికగా ఆడగా, శ్రేయస్ మాత్రం దూకుడుగా ఆడాడు. టీ20 తరహాలో రెచ్చిపోతూ సిక్సర్లు, ఫోర్లు బాదాడు. దీంతో ఇంగ్లాండ్ బౌలర్లు ఆత్మరక్షణలో పడిపోయారు. దీంతో స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ ను ఈ జంట గాడిన పెట్టింది. కుదురుకున్నాక గిల్ కూడా  బ్యాట్ ఝళిపించడం మొదలు పెట్టాడు. ఈక్రమంలో కేవలం 30 బంతుల్లోనే 50 పరుగులతో శ్రేయస్ ఫిఫ్టీ చేశాడు. ఇతని దూకుడుతోనే 14వ ఓవర్లోనే జట్టు స్కోరు వంద పరుగుల మార్కును దాటింది. అయితే ఇంగ్లాండ్ పార్ట్ టైమ్ బౌలర్ జాకబ్ బెతెల్ ఈ జంటను విడదీశాడు. అతని బౌలింగ్ లో స్వీప్ షాట్ కు ప్రయత్నించి శ్రేయస్ ఔటయ్యాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈక్రమంలో మూడో వికెట్ కు నమోదైన 92 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. 

కీలక భాగస్వామ్యం..
111/3తో ఇరుజట్లకు సమాన అవకాశాలు ఉన్న దశలో బ్యాటింగ్  కు దిగిన అక్షర్ రెచ్చిపోయాడు. రావడంతో ప్రత్యర్థి బౌలర్ల లైన్ ను దెబ్బ తీసే విధంగా వేగంగా ఆడాడు. దీంతో మరో ఎండ్ లో ఉన్న గిల్ పై ఒత్తిడి తగ్గి, స్వేచ్ఛగా పరుగులు సాధించాడు. వీరిద్దరిని విడదీయాలని ఇంగ్లీష్ కెప్టెన్ జోస్ బట్లర్ చాలమంది బౌలర్లను ప్రయోగించినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలో 60 బంతుల్లో గిల్, 46 బంతుల్లో పటేల్ అర్థ సెంచరీలు చేశారు. నాలుగో వికెట్ కు కీలకమైన 108 పరుగులు జోడించారు. అనంతరం ఆదిల్ రషీద్.. అక్షర్ ను బౌల్డ్ చేసి చిన్న షాకిచ్చాడు. అయితే త్వరగా కేఎల్ రాహుల్ (2), గిల్ వికెట్లను కోల్పోవడంతో చివర్లో కాస్త టెన్షన్ నెలకొంది. అయితే హర్దిక్  పాండ్యా (12 నాటౌట్), రవీంద్ర జడేజా (12 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. బౌలర్లలో బెతెల్, జోఫ్రా ఆర్చర్ కు ఒక వికెట్ దక్కింది.  అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో 248 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (52), బెతెల్ (51) ఫిఫ్టీలతో రాణించారు. బౌలర్లలో జడేజా, రాణాకు మూడేసి వికెట్లు దక్కాయి.  

Read Also: Bumrah Injury Update: బుమ్రా గాయంపై లేటెస్ట్ అప్డేట్.. అప్పుడే స్పష్టత వస్తుందటున్న రోహిత్.. తొలి రెండు వన్డేలకు స్టార్ పేసర్ దూరం..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget