Ram Gopal Varma: శుక్రవారం ఒంగోలు పోలీసుల ఎదుటకు రామ్ గోపాల్ వర్మ - అరెస్టు చాన్స్ లేనట్లే !
RGV: శుక్రవారం ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు రామ్ గోపాల్ వర్మ హాజరు కానున్నారు. వైసీపీ నుంచి డబ్బులు తీసుకుని అసభ్య పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై విచారణ చేయనున్నారు.

Ram Gopal Varma will appear before the Ongole Police on Friday: చంద్రబాబు, పవన్,లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన కేసులో రామ్ గోపాల్ వర్మ శుక్రవారం ఒంగోలు పోలీసుల ఎదట హాజరుకానున్నారు.గతంలో ఆయన కు హాజరు కావాలని నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్లి అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. విచారణకు సహకరించారని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు నాలుగో తేదీన హాజరు కావాలని ఆయనకు ఒంగోలు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తనకు కుదరదని...ఏడో తేదీన అయితే వస్తానని సమాచారం ఇచ్చారు. దానికి పోలీసులు అంగీకరించడంతో శుక్రవారం హాజరు కానున్నారు.
కూటమి నేతలపై అసభ్య పోస్టులు పెట్టిన రామ్ గోపాల్ వర్మ
రాంగోపాల్ వర్మ 2023లో వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తశారు. ఆ సినిమా విడుదల సందర్భంగా చంద్రబాబు, పవన్, లోకేశ్‌ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. వారి పరువుకు భంగం కలిగించారంటూ టీడీపీ మద్దిరాలపాడు మండల కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టులను పరిశీలించిన పోలీసులు మద్దిపాడు పీఎస్‌లో ఈ నెల 10న ఏడు సెక్షన్లు (336(4), 353(2), 356(2), 61(2), 196, 352, ఐటీ సెక్షన్ 67) కింద రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే గుంటూరు జిల్లా తుళ్లూరు,. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్‌లోనూ రాంగోపాల్ వర్మపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
అరెస్టు చేయకుండా హైకోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్న వర్మ
ఒకే కేసుపై మల్టిపుల్ ఎఫ్ఐఆర్ లు వద్దని కూడా ఆయన కోర్టుకు వెళ్లారు. అయితే ఆయనకు ఊరట లభించలేదు. వర్చువల్ గా విచారణకు హాజరవుతానని ఆయన కోరారు కానీ పోలీసులు అంగీకరించలేదు. కోర్టు విచారణ సహకరించాలని చెప్పి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అందుకే ఆయనను ప్రశ్నించి పంపేస్తారని అరెస్టు చేసే అవకాశం లేదని చెబుతున్నారు. విచారణకు సహకరించకపోతే కోర్టులో పిటిషన్ వేసి అనుమతి తీసుకుని అరెస్టు చేస్తారు కానీ ఇప్పుడు అదుపులోకి తీసుకునే అవకాశం లేదని చెబుతున్నారు. ఆ పోస్టులు వైసీపీ వద్ద డబ్బులు తీసుకుని పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఫైబర్ నెట్ డబ్బులు తీసుకున్న విషయంలోనూ వర్మకు నోటీసులు
మరో వైపు తన వ్యూహం సినిమాను ఫైబర్ నెట్ లో రిలీజ్ చేసి.. ఎవరూ చూడకపోయినా.. కోటిన్నర వరకూ డబ్బులు తీసుకున్నారని నోటీసులు జారీ చేశారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే తన వద్ద డబ్బులు లేవని ఆయన సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ సొమ్మును అక్రమంగా కాజేసినందున ఆయనపై కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఇప్పటికే తెలిపారు.
Also Read: టైగర్ అని ఎలివేషన్ ఇచ్చిన ఫ్యాన్స్ - గాలి తీసేసిన జగన్ - ఇలా అయితే ఎలా అన్నా ?





















