Jagan Disappoints: టైగర్ అని ఎలివేషన్ ఇచ్చిన ఫ్యాన్స్ - గాలి తీసేసిన జగన్ - ఇలా అయితే ఎలా అన్నా ?
Jagan: వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వస్తారని దడదడలాడిస్తారని ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రచారం చేశారు. కానీ జగన్ తుస్సుమనిపించారు.

Jagan not going to the assembly: వైఎస్ జగన్ లండన్ వేకెషన్ నుంచి తిరిగి రాగానే వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు జగన్ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీకి వెళ్తారని వైరల్ చేశారు. పాత రోజుల్లో అయన అసెంబ్లీకి వెళ్లి.. పోరాడిన వీడియోలను పోస్టు చేశారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా పెద్దల సూచనలతోనే ఇలా వైరల్ చేసిందని ..జగన్ అసెంబ్లీకి వెళ్లడం ఖాయమని అనుకున్నారు. అయితే గురువారం నిర్వహించిన ప్రెస్మీట్ లో జగన్ ఈ అంశంపై గాలి తీసేశాలా స్పందించారు. తాను అసెంబ్లీకి పోయేది లేదని తేల్చేశారు. దీంతో మన టైగర్ అసెంబ్లీకి వెళ్తుంది.. కూటమి ప్రభుత్వాన్ని దడదడలాడిస్తుందని ప్రచారం చేసిన వైసీపీ కార్యక్తలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది.
మీడియా సమావేశంలో జగన్ అసెంబ్లీకి హాజరవడంపై స్పందించాలని మీడియా ప్రతినిధులు అడిగారు. దానికి జగన్ డొంకతిరుగుడుగా సమాధానం ఇచ్చారు. మనం బహిష్కరించడం అనే దాని కన్నా.. స్పీకర్ హైకోర్టుకు సమాధానం చెప్పాలన్నారు. అంటే.. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై స్పీకర్ స్పందించి కౌంటర్ వేయాలని అంటున్నారు. ఈ ప్రకారం చూస్తే.. ప్రతిపక్ష నేత హోదా రాకపోతే ఆయన అసెంబ్లీకి వెళ్లేది లేదు అనే తన ప్రతిజ్ఞకే కట్టుబడి ఉన్నారన్నమాట. ఈ అంశంపై ఆయన అసెంబ్లీకి వెళ్లకపోతే నష్టం ఏమీ జరగదని కూడా చెప్పుకొచ్చారు.
"ఎదురెదురుగా ఉండి కొట్టుకోవాల్సిన , కుస్తీ పడాల్సిన పనిలే. నేను అడుగుతున్నా నువ్ సమాధానం చెప్పు ". అని అధికారపక్షానికి సూచించారు. అంటే తాను ఎక్కడ కూర్చుని అడిగినా సమాధానం చెప్పాలని తాను మాత్రం అసెంబ్లీకి రానని ఆయన చెప్పినట్లయింది. అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హతా వేటు వేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. స్పీకర్ అనుమతి లేకుండా వరుసగా అరవై రోజులు రాకపోతే ఆ స్థానం ఆటోమేటిక్ గా ఖాళీ అయినట్లుగా ప్రకటిస్తారని అంటున్నారు. అయినా ఈ విషయంలలో తాను లెక్కచేసేది లేదని ఆయనంటున్నారు.
సాధారణంగా ప్రజాస్వామ్యంలో పోరాటం ముఖాముఖిగా అసెంబ్లీలోనే జరుగుతుంది. బయట చర్చకు సిద్దమా అని ప్రకటనలు చేస్తారు కానీ చర్చించుకోరు. అదే సమయంలో అసెంబ్లీని ప్రజాస్వామ్య దేవాలయంగా భావిస్తారు. అక్కడ జరిగే చర్చలు రికార్డుల్లో ఉంటాయి. చర్చలు జరిగితే చాలా వరకూ నిజాలు బయటకు వస్తాయని భావిస్తారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని గతంలో రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశానికి వెళ్లకుండా మానుకోలేదు. పదేళ్ల పాటు ఆయన తన పార్టీలోని ఇతర ఎంపీకి ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చి తాను సాధారణ ఎంపీగా వెళ్లారు. ఇప్పుడు ప్రతిపక్షానికి అవసరమైన గుర్తింపు వచ్చేలా సీట్లు రావడంతో ప్రతిపక్ష నేత అయ్యారు. జగన్ మాత్రం అసెంబ్లీకి వెళ్లనంటున్నారు. ఎంతో ఊహించుకున్న ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలుకు నిరాశ మిగిల్చారు.
Also Read: సినీ హీరో వేణుపై కేసు పెట్టిన సీఎం రమేష్ - కాంట్రాక్టుల్లో వచ్చిన తేడాలే కారణం !
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

