Zomato : పేరు మార్చుకున్న ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో.. కొత్త పేరు ఇదే
Eternal Ltd : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన గుర్తింపును మార్చుకుంది. జొమాటో పేరు మార్చాలనే నిర్ణయాన్ని కంపెనీ బోర్డు ఆమోదించింది. జొమాటో బోర్డు తన పేరును మార్చడానికి ఆమోదం తెలిపింది.

Zomato name Eternal: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన గుర్తింపును మార్చుకుంది. జొమాటో పేరు మార్చాలనే నిర్ణయాన్ని కంపెనీ బోర్డు ఆమోదించింది. జొమాటో బోర్డు తన పేరును మార్చడానికి ఆమోదం తెలిపింది. కంపెనీ పేరును ఎటర్నల్ లిమిటెడ్‌గా మార్చాలని నిర్ణయించింది. కొత్త పేరుపై వాటాదారుల ఆమోదం కోసం బోర్డు వెయిట్ చేస్తుంది. కంపెనీ జొమాటో యాప్ పేరును మార్చలేదని, మాతృ సంస్థ పేరు మాత్రమే ఎటర్నల్ లిమిటెడ్‌గా మారింది. ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన కంపెనీ పేరును Eternal Ltd గా మార్చుకున్నట్లు గురువారం (ఫిబ్రవరి 6) అధికారికంగా ప్రకటించింది. కంపెనీ బోర్డు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
పేరు మార్పు వెనుక కారణం
జొమాటో గ్రూప్ సీఈవో దీపిందర్ గోయల్ మాట్లాడుతూ.. "మేము Blinkitని కలిపినప్పటి నుంచి కంపెనీ పేరుగా ‘Eternal’ అని ఉపయోగిస్తున్నాం. జొమాటో అంటే కేవలం ఫుడ్ డెలివరీ మాత్రమే కాకుండా, మేము భవిష్యత్తులో మరిన్ని వ్యాపార మార్గాలను అన్వేషిస్తున్నాము. ఇప్పుడు Blinkit ద్వారా అది సాధ్యమవుతోంది. అందుకే కంపెనీ పేరు Eternal Ltd. గా మార్చాలని నిర్ణయించాం" అని వెల్లడించారు.
కంపెనీ పేరు మారినప్పటికీ Zomato యాప్ యధావిధిగా కొనసాగుతుంది. అయితే స్టాక్ మార్కెట్‌లో కంపెనీ టిక్కర్ పేరు 'Zomato' స్థానంలో 'Eternal' గా మారుతుంది.
Also Read : Income Tax News: కన్‌ఫ్యూజ్ కావద్దు, పాత పన్ను విధానాన్ని ఎంచుకోవడానికి 4 పెద్ద కారణాలివి
ఎటర్నల్ లిమిటెడ్ వ్యాపార విభాగాలు
ఎటర్నల్ కంపెనీ నాలుగు ప్రధాన వ్యాపారాలను నిర్వహిస్తుంది. అవి:
* Zomato - ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ
* Blinkit - క్విక్ కామర్స్ (తక్షణ డెలివరీ సేవలు)
* Hyperpure - రెస్టారెంట్లకు సరఫరా సేవలు
* District - కొత్తగా ప్రారంభించిన డైనింగ్, రిటైల్ విభాగం
Q3 ఆర్థిక ఫలితాలు
జొమాటో కంపెనీ ఇటీవల 2024 డిసెంబర్ 31తో ముగిసిన Q3 ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం 57శాతం తగ్గి రూ.59 కోట్లకు పడిపోయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 176 కోట్లుగా నమోదైంది. ఆపరేషనల్ రెవెన్యూ 64శాతం పెరిగి రూ. 5,404 కోట్లకు చేరుకుంది. ఈ సారి ఖర్చులు భారీగా పెరిగి రూ. 5,533 కోట్లకు చేరాయి.
భవిష్యత్ వ్యూహాలు
Blinkit విభాగాన్ని విస్తరించడానికి 1,000 కొత్త స్టోర్లు ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రారంభించాలని ఎటర్నల్ కంపెనీ నిర్ణయించింది. కంపెనీ ఫుడ్ టెక్, క్విక్ కామర్స్, డైనింగ్, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పేరుమార్పు తర్వాత స్టాక్ మార్కెట్‌లో Eternal Ltd. టిక్కర్ హోల్‌డింగ్ మారిపోయింది. అయితే, Zomato యాప్, సర్వీసులు అలాగే కొనసాగుతాయి. ఈ పేరు మార్పు ద్వారా Eternal Ltd. సంస్థ ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యంగా ఎదగాలనే దిశగా ముందుకు వెళ్తోంది. త్వరలో మరిన్ని విస్తరణ చర్యలను చేపట్టే అవకాశం ఉంది.
Also Read : Hexaware Technologies IPO: హెక్సావేర్ టెక్నాలజీస్ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఇదే - ఫిబ్రవరి 12 నుంచి లైవ్





















