search
×

Hexaware Technologies IPO: హెక్సావేర్ టెక్నాలజీస్ ఐపీవో ప్రైస్‌ బ్యాండ్‌ ఇదే - ఫిబ్రవరి 12 నుంచి లైవ్‌

Hexaware Technologies IPO Price Band: ఈ కంపెనీ IPO ద్వారా రూ. 8,750 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరుకు రూ. 674 నుంచి రూ. 708 మధ్య ధరను నిర్ణయించింది.

FOLLOW US: 
Share:

Hexaware Technologies IPO News: స్టాక్ మార్కెట్‌లోకి మరో పెద్ద కంపెనీ అడుగు పెట్టబోతోంది. ముంబైకి చెందిన ఐటీ సేవల సంస్థ 'హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్', ప్రైమరీ మార్కెట్‌ కాలింగ్‌ బెల్‌ కొట్టేందుకు సిద్ధమైంది. ఈ కంపెనీ దాదాపు రూ.9 వేల కోట్ల భారీ IPO (Initial Public Offering) ఫిబ్రవరి 12 (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తిగల పెట్టుబడిదారులు ఫిబ్రవరి 14 వరకు ఈ ఐపీఓ కోసం అప్లై చేసుకోవచ్చు.

ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ కోసం, హెక్సావేర్ టెక్నాలజీస్‌, ఒక్కో IPO షేరుకు రూ. 674 - 708 ప్రైస్‌ బ్యాండ్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 11న జరిగే ప్రి-IPO విండోలో యాంకర్ ఇన్వెస్టర్లు పాల్గొంటారు.

IPO ద్వారా రూ.8,750 కోట్లు సమీకరణ
IPO ద్వారా, హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్‌ రూ.8,750 కోట్లు సమీకరించనుంది. ఈ IPO పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్‌ (OFS)లో వస్తోంది. అంటే, కంపెనీలో ప్రస్తుతం ఉన్న పెట్టుబడిదారులు తమ షేర్లను అమ్మేస్తున్నారు. ఈ IPOలో కొత్త షేర్లు జారీ చేయడం లేదు. ఈ కంపెనీలో, ప్రమోటర్ CA మాగ్నమ్ హోల్డింగ్స్ 95.03 శాతం వాటాను కలిగి ఉంది. 

IPO లాట్‌ సైజ్‌ & లిస్టింగ్‌ డేట్‌
హెక్సావేర్ టెక్నాలజీస్‌ IPOలో పెట్టుబడిదారులు కనీసం 21 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. గరిష్ట ప్రైస్‌ బ్యాండ్‌ రూ.708 ప్రకారం, ఒక్కో లాట్‌ కోసం కనీసం రూ. 14,868 (708 x 21) పెట్టుబడి పెట్టాలి. రిటైల్ పెట్టుబడిదారులు గరిష్టంగా 13 లాట్లు లేదా 273 షేర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే, గరిష్టంగా రూ.1,93,284 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 

IPO బిడ్డింగ్‌లో గెలుపొందిన పెట్టుబడిదార్లకు ఫిబ్రవరి 17న షేర్లు కేటాయిస్తారు. షేర్లు రాని వాళ్లకు ఫిబ్రవరి 18న డబ్బు వాపసు ఇస్తారు. అదే రోజున, విజయవంతమైన పెట్టుబడిదారుల డీమ్యాట్ ఖాతాలకు షేర్లు జమ చేస్తారు. 

హెక్సావేర్ టెక్నాలజీస్ IPO 19 ఫిబ్రవరి 2025న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో (BSE & NSE) లిస్ట్‌ అవుతుంది. 

ఐటీ రంగంలో అతి పెద్ద ఐపీఓ 
హెక్సావేర్ టెక్నాలజీస్ IPO ఐటీ రంగంలో అతి పెద్ద IPO అవుతుంది. టాటా గ్రూప్‌లోని ఐటీ కంపెనీ TCS, సుమారు 2 దశాబ్దాల క్రితం రూ. 4,713 కోట్ల IPOను తీసుకువచ్చింది. హెక్సావేర్ టెక్నాలజీస్ IPO ద్వారా రూ. 8,750 కోట్లు సేకరించనున్నారు. హెక్సావేర్ IPO TCS IPO కంటే దాదాపు 2 రెట్లు పెద్దది. 

హెక్సావేర్ టెక్నాలజీస్ రీఎంట్రీ
హెక్సావేర్ టెక్ గతంలో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. రెండు దశాబ్దాల క్రితం, జూన్ 2002లో ఇది లిస్ట్‌ అయింది. అయితే, దాదాపు 4 సంవత్సరాల క్రితం డీలిస్ట్‌ అయింది. పాత ప్రమోటర్ కంపెనీ బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా, 2020లో, హెక్సావేర్ టెక్‌ను ప్రైవేట్ కంపెనీగా మార్చాలని నిర్ణయించింది. అందువల్లే డీలిస్టింగ్‌ జరిగింది. కార్లైల్ గ్రూప్‌, 2021లో, బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా నుంచి హెక్సావేర్‌ను దాదాపు $3 బిలియన్లకు కొనుగోలు చేసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏ పెట్టుబడి సాధనంలోనైనా పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పదు. 

మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది బంగారం డిమాండ్‌ తగ్గొచ్చు - నగల రేట్లు దిగొచ్చే అవకాశం! 

Published at : 06 Feb 2025 03:55 PM (IST) Tags: GMP Price Band IPO dates Hexaware Technologies IPO Lot Size

ఇవి కూడా చూడండి

YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే

YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే

Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?

Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

టాప్ స్టోరీస్

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు

Phone tapping case:  ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు

Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!

Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!

AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?

Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని

This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy