By: Arun Kumar Veera | Updated at : 06 Feb 2025 03:55 PM (IST)
పాత పన్ను విధానం Vs కొత్త పన్ను విధానం ( Image Source : Other )
4 Key Reasons To Choose The Old Tax Regime: 2025 బడ్జెట్‌లో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) కొత్త పన్ను విధానం కింద ఆదాయ పన్ను శ్లాబ్‌లో కీలకమైన మార్పులు ప్రకటించారు. నూతన మార్పుల వల్ల, సంవత్సరానికి రూ. 12 లక్షల వరకు వ్యక్తుల ఆదాయం పన్ను రహితంగా మారింది. సహజంగానే ఇది మధ్యతరగతికి ప్రయోజనం చేకూరుస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, దాదాపు 74 శాతం మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు (ITR Filing) కొత్త పన్ను విధానాన్ని (New Tax Regime) ఎంచుకున్నారు. పన్ను శ్లాబులలో చేసిన ఆకర్షణీయమైన మార్పుల కారణంగా, వచ్చే ఏడాది దాదాపు 90 శాతం మంది పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉందని CBDT చైర్మన్ రవి అగర్వాల్ ఇటీవల చెప్పారు. రెండు పన్ను వ్యవస్థల మధ్య పన్ను రేట్లలో అంతరం పెరుగుతున్నందున, పాత పన్ను విధానాన్ని స్వీకరించాలనుకునే వాళ్ల సంఖ్య ఇంకా పడిపోవచ్చన్నది అంచనా.
అయితే, కొన్ని పరిస్థితులను బట్టి చూస్తే పాత పన్ను వ్యవస్థను ఎంచుకోవడమే తెలివైన పని అవుతుంది. దీనికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి.
* కొత్త పన్ను విధానం మీకు భారీ పన్ను మినహాయింపులను అందిస్తుంది. కానీ.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ స్టిస్టమ్ (NPS), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి పన్ను ఆదా పథకాలలో పెట్టుబడులు పెట్టినప్పుడు కొత్త పన్ను విధానంలో పన్ను మినహాయింపులు లభించవు. ఇలాంటి పథకాల్లో పెట్టుబడులు ఉన్న వ్యక్తులు పాత పన్ను విధానంలో ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయాలనుకుంటారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C, సెక్షన్ 80D కింద మరిన్ని తగ్గింపులు & మినహాయింపులను (Deductions & Exemptions) క్లెయిమ్ చేయడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.
* కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే, ఆదాయ పన్ను తగ్గింపు కోసం ప్రామాణిక తగ్గింపు (Standard Deduction) & NPS (యజమాని సహకారం) తప్ప మీరు ఎటువంటి డిడక్షన్స్, ఎగ్జమ్షన్స్‌ను క్లెయిమ్ చేయలేరు.
* గృహ రుణంపై వడ్డీ & HRA వంటివి అందుబాటులో ఉండవు. కొంతమంది ఉద్యోగులు నెలకు రూ. 1 లక్ష వరకు ఇంటి అద్దె భత్యం (HRA) పొందుతారు కాబట్టి, పాత పన్ను విధానం ప్రకారం రిటర్న్‌లను దాఖలు చేయడం మరింత అర్ధవంతంగా ఉంటుంది.
* మీరు అధిక పన్ను పరిధిలోకి వచ్చినప్పుడు కూడా పాత పన్ను విధానాన్ని ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ, మీ వార్షిక ఆదాయం రూ. 24 లక్షల కంటే ఎక్కువగా ఉండి, మీరు 30 శాతం పన్ను పరిధిలోకి వస్తే, పాత పన్ను విధానంలో తదనుగుణంగా పన్ను ఉంటుంది. మీ ఆదాయం పెరిగే కొద్దీ పన్ను ఆదా పరిధి తగ్గుతుంది. కాబట్టి కొత్త పన్ను విధానంలో రిటర్న్‌లను దాఖలు చేయడం సమంజసం కాదు.
ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనే అంశంలో మీకు ఇంకా గందరగోళం ఉంటే.. ఆదాయ పన్ను విభాగం వెబ్‌సైట్‌ను సందర్శించి, రెండు విధానాలలోనూ టాక్స్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. అప్పుడు, తక్కువ పన్ను చెల్లించాల్సిన విధానం మీకు తెలుస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ఇంటి యజమాని, అద్దెదారు ఇద్దరికీ లాభం - మారిన TDS రూల్స్
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
iBomma Ravi Bail Petition: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
Maoists surrender: మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!
Top 10 Actress: టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?
Mustafizur Rahman Joins PSL: ఐపీఎల్ నుండి తొలగింపు.. PSLలో ఆడాలని ముస్తాఫిజుర్ రెహ్మాన్ నిర్ణయం.. 3 రోజుల్లో మారిన సీన్