Minister Nimmala Ramanaidu: 'అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు' - జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమన్న మంత్రి నిమ్మల
Andhra News: మాజీ సీఎం జగన్‌పై మాజీ మంత్రి నిమ్మల రామానాయుడు ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేసిన జగన్ ఛీత్కారానికి గురయ్యారని ఎద్దేవా చేశారు.
Minister Nimmala Strong Counter To Ys Jagan Through Twitter: అబద్ధాల్లో మాజీ సీఎం జగన్‌కు (Jagan) ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని.. పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) హితవు పలికారు. ఈ మేరకు పోలవరంపై జగన్ చేసిన విమర్శలకు ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కన్నతల్లిని తోడబుట్టిన చెల్లిని మోసం చేసి జగన్ ఛీత్కారానికి గురయ్యారని సెటైర్లు వేశారు. ప్రపంచ చరిత్ర తిరగేస్తే తల్లిని, చెల్లిని మోసం చేసిన వంటి దౌర్భాగ్య రాజకీయవేత్త ఎక్కడా కనిపించడు ఇతను తప్ప అంటూ మండిపడ్డారు. ప్రజా జీవనంలో ఉండడానికి అర్హత లేదన్న విషయం జగన్‌కు అర్థమైపోయిందని.. అందుచేతనే డైవర్షన్ పోలిటిక్స్‌కు తెర లేపారని అన్నారు. 'పోలవరం ఎత్తుపై అతని చెత్త మీడియాలో అబద్ధాలు అచ్చు వేసి గడిచిన రెండు రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి నేను పూర్తి వివరాలతో జగన్ పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహం గురించి వివరించా. అయినా అతని బుద్ధి మారలేదు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమే. నాడు జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారు. కృష్ణా మిగులు జలాల్లో హక్కు కోరబోమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు లేఖ రాసి ఇచ్చి ద్రోహం చేశారు.' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'అలా కోరింది జగన్ కాదా.?'
అబద్ధాల్లో @ysjagan నీకు ఆస్కార్ అవార్డుఇవ్వచ్చు ......పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకో....
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) October 31, 2024
కన్నతల్లిని తోడబుట్టిన చెల్లిని మోసం చేసి జగన్ చిత్కారానికి గురయ్యాడు. ప్రపంచ చరిత్ర తిరగేస్తే తల్లిని, చెల్లిని మోసం చేసిన వంటి దౌర్భాగ్య రాజకీయవేత్త ఎక్కడా కనిపించడు ఇతను తప్ప.…
పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో 15 నెలలు ఆలస్యం చేసి డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి కారకులయ్యారని మంత్రి నిమ్మల జగన్‌పై ధ్వజమెత్తారు. 'ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యామ్‌ను కూలగొట్టి 38 మంది ప్రాణాలు బలిగొన్నారు. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా.?. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ.3,800 కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి రెండు ఫేజ్‌లుగా విభజించింది జగన్ కాదా.?. 41.15 మీటర్లకు తగ్గించాలని కేంద్రం అనుమతి కోరింది జగన్ కాదా.?. ఎన్డీయే ప్రభుత్వం పోలవరం ఎత్తు 45.72 మీటర్లకు పెంచి నదుల అనుసంధానం ద్వారా ఏపీని సస్యశ్యామలం చేస్తుంది.' అని స్పష్టం చేశారు.
కాగా, పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా.. ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ సీఎం జగన్.. సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. దీని వల్ల ప్రాజెక్ట్ లక్ష్యాలు దెబ్బతింటాయని.. దేనికి లాలూచీ పడి ఈ పనికి ఒడిగట్టారంటూ ఆయన పేర్కొన్నారు. 'మీ స్వార్థ రాజకీయాలకు, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను నట్టేట ముంచేస్తారని మరోసారి నిరూపిస్తున్నారు కదా?.' అంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల ట్విట్టర్‌లోనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Also Read: Rains Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్